నిస్సాన్ గ్రావైట్ కొనాలనుకుంటున్నారా? సిటీలో, హైవేపై ఈ కారు నిజమైన మైలేజ్ వివరాలు ఇవిగో!
నిస్సాన్ గ్రావైట్ పెట్రోల్ MT రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్‌లో కాస్త ఆశాజనక ఫలితాలను నమోదు చేసింది. ఫుల్ ట్యాంక్‌తో సుమారు 560 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంది.

Nissan Gravite Price And Features: కేవలం ఆకర్షణీయమైన డిజైన్‌తోనే కాకుండా, అందుబాటు ధరలో 7-సీటర్ ఎంపికగా నిలిచిన నిస్సాన్ గ్రావైట్, తన రియల్ వరల్డ్ మైలేజ్‌తో కూడా హైలైట్ అయింది. రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్‌లో స్వల్ప డిజైన్ మార్పులు మాత్రమే ఉండగా, పనితీరు & ఇంధన సామర్థ్యం విషయంలో ఇది ఎలా ఉందో తాజా పరీక్షల్లో వెల్లడైంది.
తక్కువ ధరలో 7-సీటర్ MPV
మన మార్కెట్‌లో 4 మీటర్ల లోపు (సబ్-4 మీటర్) లభించే అరుదైన 7-సీటర్ MPVలలో నిస్సాన్ గ్రావైట్ ఒకటి. దీని ప్రారంభ (పెట్రోల్ MT వెర్షన్) ఎక్స్ షోరూమ్ ధర రూ.5.73 లక్షలు. రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన ఖర్చులు కలిపి ఈ కారు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 7.20 లక్షల ఆన్-రోడ్ ధర పలుకుతుంది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ వాహనం తక్కువ బరువు, సరసమైన ధర & మంచి ప్రయోజనాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది.
నిస్సాన్ గ్రావైట్‌లో 1.0 లీటర్, 3 సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇదే ఇంజిన్ నిస్సాన్ మ్యాగ్నైట్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 72 hp పవర్ & 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ AMT ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. తాజా రియల్ వరల్డ్ పరీక్షలు మాన్యువల్ వేరియంట్‌పై నిర్వహించారు.
ఇది కూడా చదవండి: టాటా కర్వ్ బలాలు, బలహీనతలు - కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
రియల్ వరల్డ్ మైలేజ్
రియల్ వరల్డ్ టెస్టుల్లో భాగంగా, ఓనర్లు/డ్రైవర్లు తమ కారును ఎలా నడుపుతారో దాదాపుగా అలానే కార్ ఎక్స్‌పర్ట్‌లు కూడా గ్రావైట్‌ను నడిపి మైలేజ్ టెస్ట్ చేశారు. నిస్సాన్ గ్రావైట్ పెట్రోల్ MT నగర రోడ్లపై లీటర్‌కు 11.9 కి.మీ. మైలేజ్ ఇచ్చింది. హైవేపై లీటర్‌కు 16.5 కి.మీ. నమోదు చేసింది. మొత్తం సగటు ఇంధన సామర్థ్యం (యావరేజ్ మైలేజ్) లీటర్‌కు 14.2 కి.మీ.గా నమోదైంది. అయితే కంపెనీ ప్రకటించిన ARAI మైలేజ్ మాత్రం లీటర్‌కు 19.3 కి.మీ.గా ఉంది. సాధారణంగా, ARAI మైలేజ్‌కు - వాస్తవ మైలేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ, నిస్సాన్ గ్రావైట్ విషయంలో అంత పెద్ద వ్యత్యాసం లేదు.
నగరంలో మైలేజ్ కొంత తగ్గడానికి ఆటో ఇంజిన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ట్రాఫిక్‌లో తరచూ ఆగాల్సిన పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఉంటే ఇంధన వినియోగం మరింత తగ్గే అవకాశం ఉండేది.
అయితే, హైవేపై ఈ వాహనం మంచి ఫలితాలను నమోదు చేసింది. 4వ & 5వ గేర్ రేషియోల కారణంగా అధిక వేగాల్లో కూడా ఇంజిన్ తక్కువ rpmలో పనిచేయడం వల్ల ఇంధన వినియోగం తగ్గింది. పరీక్షల సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉండటం కూడా మైలేజ్‌పై కొంత ప్రభావం చూపినట్లు వెల్లడైంది.
ఇది కూడా చదవండి: కియా సైరోస్ రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ - మాన్యువల్‌ది పైచేయా? DCT గెలిచిందా?
నిస్సాన్ గ్రావైట్‌లో 40 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ అందించారు. సగటు రియల్ వరల్డ్ మైలేజ్ 14.2 కి.మీ. ప్రకారం ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 560 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎక్కువ దూర ప్రయాణాలు చేసే కుటుంబాలకు ఇది ఉపయోగకరమైన అంశంగా చెప్పవచ్చు.
ఈ మైలేజ్ పరీక్షలను సాధారణ వినియోగదారుల డ్రైవింగ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్వహించారు. పరీక్షలకు ముందు ట్యాంక్‌ను పూర్తిగా నింపడం, కంపెనీ సూచించిన టైర్ ప్రెషర్‌ను పాటించడం, నగరం & హైవేపై ఒకే మార్గాల్లో ప్రయాణించడం, ACని ఫ్యాన్ స్పీడ్ 2లో అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించడం వంటి ప్రమాణాలను అనుసరించారు. అవసరమైన సమయంలో ఆడియో సిస్టమ్, ఇండికేటర్లు, వైపర్లు కూడా ఉపయోగించారు. అలాగే డ్రైవర్‌లను మారుస్తూ పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యక్తిగత డ్రైవింగ్ శైలి ప్రభావాన్ని తగ్గించారు. చివరగా మళ్లీ ట్యాంక్‌ను పూర్తిగా నింపి వాస్తవ ఇంధన వినియోగాన్ని లెక్కించారు. దీంతో నిస్సాన్ గ్రావైట్ పెట్రోల్ MT రోజువారీ వినియోగంలో ఎంత మైలేజ్ ఇస్తుందో స్పష్టమైన లెక్క తెలిసింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















