అన్వేషించండి

526km రేంజ్‌తో కియా సైరోస్ EV ఎంట్రీ - టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EVతో పోలిస్తే ప్రత్యేకత ఏంటి?

కియా సైరోస్ EV, టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV మధ్య డైమెన్షన్స్‌, బ్యాటరీ, రేంజ్‌, పవర్‌, ఛార్జింగ్‌, ధరల పోలిక తెలుసుకోండి.

Kia Syros EV vs Nexon EV vs XUV 3XO EV: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోకి, కియా ఇండియా, తన అత్యంత చిన్న ఎలక్ట్రిక్ SUV అయిన సైరోస్ EVని అధికారికంగా పరిచయం చేసింది. ధరలను ఇంకా ప్రకటించకపోయినా, వేరియంట్‌ల వారీగా ఫీచర్లు, బ్యాటరీ ఎంపికలు & పవర్‌ట్రెయిన్ వివరాలను కంపెనీ వెల్లడించింది. మార్కెట్లో ఈ కొత్త మోడల్ నేరుగా టాటా నెక్సాన్ EV & మహీంద్రా XUV 3XO EVలకు పోటీగా నిలవనుంది. మరి ఈ మూడు ఎలక్ట్రిక్ SUVల మధ్య డైమెన్షన్స్‌, పనితీరు, రేంజ్‌, ఛార్జింగ్ & ధరల పరంగా ఏది మెరుగ్గా ఉందో చూద్దాం.

డైమెన్షన్స్ 
కియా సైరోస్ EV పొడవు 3,995 మి.మీ. టాటా నెక్సాన్ EV కూడా ఇదే పొడవును కలిగి ఉండగా, మహీంద్రా XUV 3XO EV పొడవు 3,990 మి.మీ.గా ఉంది. వెడల్పులో మహీంద్రా XUV 3XO EV 1,821 మి.మీ.తో ముందంజలో ఉండగా, కియా సైరోస్ EV వెడల్పు 1,805 మి.మీ., నెక్సాన్ EV వెడల్పు 1,802 మి.మీ.గా ఉన్నాయి. ఎత్తు పరంగా కియా సైరోస్ EV 1,670 మి.మీ.తో ఈ మూడింటిలోనే అత్యంత ఎత్తైన SUVగా నిలిచింది.

వీల్‌బేస్ 
మహీంద్రా XUV 3XO EV 2,600 మి.మీ.తో ముందంజలో ఉంది. కియా సైరోస్ EV వీల్‌బేస్ 2,550 మి.మీ. కాగా, టాటా నెక్సాన్ EVలో ఇది 2,498 మి.మీ.గా ఉంది. కియా మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ & బూట్ స్పేస్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. టాటా నెక్సాన్ EVలో 190 నుంచి 205 మి.మీ. వరకు గ్రౌండ్ క్లియరెన్స్ & 350 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుండగా, మహీంద్రా XUV 3XO EVలో 190 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్ & 364 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?

పవర్‌ట్రెయిన్‌ 
కియా సైరోస్ EVలో 42kWh & 51.4kWh అనే రెండు బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి. టాటా నెక్సాన్ EVలో 30kWh & 45kWh బ్యాటరీలు లభిస్తుండగా, మహీంద్రా XUV 3XO EVలో ఒకే 39.4kWh బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నారు. మూడు మోడళ్లలోనూ FWD డ్రైవ్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

పవర్ 
సైరోస్ EV టాప్ వేరియంట్ 171hp శక్తిని ఉత్పత్తి చేస్తూ ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. దీని చిన్న బ్యాటరీ వేరియంట్ 135hp పవర్‌ను అందిస్తుంది. టాటా నెక్సాన్ EV 129hp & 144hp ఎంపికలతో వస్తుండగా, మహీంద్రా XUV 3XO EV 150hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే టార్క్ పరంగా మహీంద్రా XUV 3XO EV 310Nmతో మొదటి స్థానంలో ఉంది. కియా సైరోస్ EV రెండు బ్యాటరీ వేరియంట్‌లలోనూ 255Nm టార్క్‌ను అందిస్తుండగా, టాటా నెక్సాన్ EVలో 215Nm టార్క్ లభిస్తుంది.

రేంజ్ 
51.4kWh బ్యాటరీతో కూడిన కియా సైరోస్ EV ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 526 కి.మీ ARAI సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది టాటా నెక్సాన్ EV పెద్ద బ్యాటరీ వేరియంట్ కంటే 37 కి.మీ ఎక్కువ. మహీంద్రా XUV 3XO EVతో పోలిస్తే 175 కి.మీ అధికం. అలాగే 42kWh బ్యాటరీ వేరియంట్ కూడా 443 కి.మీ రేంజ్‌ను అందిస్తూ ప్రత్యర్థుల కంటే మెరుగైన ఫలితాలను చూపిస్తోంది.

ఇది కూడా చదవండి: మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!

ఛార్జింగ్ 
7.4kW AC ఛార్జర్‌తో కియా సైరోస్ EV 42kWh బ్యాటరీని 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. 51.4kWh బ్యాటరీకి 7 గంటల 15 నిమిషాలు అవసరం. టాటా నెక్సాన్ EVలో చిన్న బ్యాటరీకి 4 గంటల 18 నిమిషాలు, పెద్ద బ్యాటరీకి 6 గంటల 36 నిమిషాలు పడుతుంది. మహీంద్రా XUV 3XO EVకు సుమారు 6 గంటల 50 నిమిషాల సమయం అవసరం. DC ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా కియా సైరోస్ EV 100kW సపోర్ట్‌తో ముందంజలో ఉంది. టాటా నెక్సాన్ EV 60kW & మహీంద్రా XUV 3XO EV 50kW వరకు మాత్రమే DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి.

ధరలు 
కియా సైరోస్ EV ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం టాటా నెక్సాన్ EV ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉండగా, మహీంద్రా XUV 3XO EV ధరలు రూ.13.89 లక్షల నుంచి రూ.14.96 లక్షల వరకు ఉన్నాయి. కియా సైరోస్ EV ధర కూడా ఇదే శ్రేణిలో ఉండే అవకాశమున్నప్పటికీ, కంపెనీ అందించే Battery as a Service (BaaS) విధానం కారణంగా ప్రారంభ కొనుగోలు ధర కొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget