అన్వేషించండి

టాటా కర్వ్ బలాలు, బలహీనతలు - కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

టాటా కర్వ్ కొనాలని అనుకుంటున్నారా? ఈ కూపే SUVలో ఉన్న 4 ప్రధాన బలాలు, 3 బలహీనతలు ఉన్నాయి. ఫీచర్లు, ఇంజిన్ ఎంపికలు, బూట్ స్పేస్ & లోపాలపై పూర్తి విశ్లేషణ తెలుసుకోండి.

Tata Curvv Price And Features: మిడ్‌సైజ్‌ SUV మార్కెట్‌లో ప్రత్యేకమైన డిజైన్‌తో గుర్తింపు తెచ్చుకున్న మోడళ్లలో టాటా కర్వ్ ఒకటి. 2024లో విడుదలైన ఈ కూపే SUV, సాంప్రదాయ SUVలతో పోలిస్తే భిన్నమైన రూపాన్ని అందిస్తూ యువతను, ఫ్యామిలీలను అమితంగా ఆకర్షిస్తోంది. టాటా ATLAS ప్లాట్‌ఫారంపై రూపొందించిన ఈ మోడల్... నెక్సాన్ & సియెర్రా మధ్యలో ఉంటుంది. ఈ కారు కొనడానికి ఆకర్షణీయమైన డిజైన్ మాత్రమే సరిపోతుందా?, రోజువారీ వినియోగానికి ఇది సరైన ఎంపికేనా? కొనేముందు తెలుసుకోవాల్సిన 4 ప్రధాన బలాలు & 3 లోపాలు ఇవే.

కొనడానికి 4 ప్రధాన కారణాలు

టాటా కర్వ్‌ను కొనడానికి ప్రధాన కారణాల్లో మొదటిది - రైడ్ క్వాలిటీ & హ్యాండ్లింగ్. టాటా వాహనాల మాదిరిగానే ఈ SUV కూడా బ్యాడ్‌ రోడ్లపై దృఢమైన అనుభూతిని అందిస్తుంది. గుంతలు, ఎత్తుపల్లాలను సులభంగా అధిగమిస్తుంది. తక్కువ వేగంలో సస్పెన్షన్ కొద్దిగా గట్టిగా అనిపించినా, వేగం పెరిగే కొద్దీ ప్రయాణం మరింత సాఫీగా మారుతుంది. ముఖ్యంగా హైవేపై స్థిరంగా ప్రయాణిస్తూ డ్రైవర్‌కు విశ్వాసాన్ని కలిగిస్తుంది. మలుపుల్లో బాడీ రోల్ కూడా చాలా వరకు నియంత్రణలో ఉండగా, స్టీరింగ్ స్పందన ఖచ్చితంగా ఉంటుంది.

రెండో ప్రధాన ఆకర్షణ - ఇంజిన్ ఎంపికలు. ఈ విభాగంలో అత్యధిక పవర్‌ట్రెయిన్ ఎంపికలను అందిస్తున్న SUVల్లో టాటా కర్వ్ ఒకటి. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ & 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. వీటి పవర్ వరుసగా 120hp, 118hp & 125hp వరకు ఉంటుంది. అన్ని ఇంజిన్‌లకు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఎంపికను టాటా అందించడం మరో ప్రత్యేకత.

ఇది కూడా చదవండి: హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?

మూడో కారణం - ఫీచర్ల జాబితా. టాటా కర్వ్‌లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ Apple CarPlay & Android Auto, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ & 9 స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. అలాగే పవర్డ్ డ్రైవర్ సీటు, ముందు సీట్లకు వెంటిలేషన్, వెనుక సీట్లకు ప్యాసివ్ వెంటిలేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ AC, వెనుక విండో సన్‌షేడ్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రత పరంగా Level-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ & ఆటో డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు ఈ SUVను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

నాలుగో ప్రధాన బలం - బూట్ స్పేస్. టాటా కర్వ్‌లో 500 లీటర్ల భారీ లగేజ్ సామర్థ్యం ఉంది. అవసరమైతే 60:40 స్ప్లిట్ రియర్ సీట్లను మడతపెట్టి మరింత సామాను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కుటుంబంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

దూరంగా ఉండడానికి 3 కారణాలు

అయితే ఈ SUVలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మొదటిది - కూపే తరహా పైకప్పు డిజైన్ కారణంగా వెనుక సీటులో కూర్చునే పొడవైన ప్రయాణికులకు తల భాగంలో స్థలం కొంత తక్కువగా అనిపిస్తుంది. సీటు రిక్లైన్ సౌకర్యం & ప్రత్యేకంగా రూపొందించిన హెడ్‌లైనర్ ఉన్నప్పటికీ, ఎత్తైన వ్యక్తులకు పూర్తి సౌకర్యం ఉండదు. అలాగే మధ్యలో కూర్చునే ప్రయాణికుడికి ప్రత్యేక హెడ్‌రెస్ట్ లేకపోవడం కూడా ఒక లోపంగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: 526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి

రెండో లోపం - క్యాబిన్ ఫిట్ & ఫినిష్. ఉపయోగించిన మెటీరియల్స్ నాణ్యత బాగానే ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఫినిషింగ్ ఆశించిన స్థాయిలో లేదు. ముందు కప్ హోల్డర్లను గ్లోవ్‌బాక్స్‌లో అమర్చడం వల్ల వాటిని ఉపయోగించడం అసౌకర్యంగా మారింది. 12V సాకెట్ కూడా చేరుకోవడానికి ఇబ్బందిగా ఉండే చోట ఉంది. సెంటర్ ఆర్మ్‌రెస్ట్ చిన్నగా ఉండటంతో పాటు స్లైడ్ సౌకర్యం లేకపోవడం, దాని కింద ఉన్న స్టోరేజ్ కూడా చిన్న వస్తువులకు మాత్రమే సరిపోవడం వినియోగదారులను నిరాశపరచవచ్చు.

మూడో లోపం మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్‌లో కనిపిస్తుంది. గేర్ మార్పులు సాఫీగా జరిగినప్పటికీ, క్లచ్ రెస్పాన్స్‌ ఒక్కసారిగా ఉండటం & గేర్ లివర్ ఎక్కువ దూరం కదలాల్సి రావడం డ్రైవింగ్ అనుభవాన్ని కొంత తగ్గిస్తాయి. అంతేకాకుండా గేర్ లివర్ డిజైన్ కూడా అందరికీ నచ్చకపోవచ్చు.

ధరలు 

టాటా కర్వ్ ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ.9.76 లక్షల నుంచి రూ.18.96 లక్షల వరకు ఉంది. ఆన్ రోడ్ ధర రూ.11.57 లక్షల నుంచి రూ.23.33 లక్షల వరకు ఉంటుంది. ఆకర్షణీయమైన డిజైన్‌, అధునాతన ఫీచర్లు, విభిన్న ఇంజిన్ ఎంపికలు & విశాలమైన బూట్ స్పేస్ కోరుకునే వారికి టాటా కర్వ్ మంచి ఎంపికగా నిలుస్తుంది. అయితే వెనుక హెడ్‌రూమ్, క్యాబిన్ ఎర్గోనామిక్స్ & మాన్యువల్ గేర్‌బాక్స్ లోపాలను కూడా కొనుగోలు ముందు ఒకసారి పరిశీలించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget