అన్వేషించండి

Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు

Rag Mayur Sivarapalli Award: కమర్షియల్ సినిమాల్లోనూ తన పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకుంటున్న నటుడు రాగ్ మయూర్. వెబ్ సిరీస్ 'సివరపల్లి'లో అతని నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు వచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు రాగ్ మయూర్ 'సివరపల్లి' నటనకు ఉత్తమ నటుడి అవార్డు.
  • ముంబైలో నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ వేడుకలో పురస్కారం అందుకున్నారు.
  • దిగ్గజ నటుల సమక్షంలో ఆయన నటనకు గొప్ప ప్రశంసలు పొందారు.
  • ప్రస్తుతం పలు తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.

'సినిమా బండి'లో మరిడేష్ బాబు పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు రాగ్ మయూర్ (Rag Mayur). ఆ తర్వాత 'కీడా కోలా' నుంచి 'శుభం', 'పరదా', 'మిత్ర మండలి' వరకు... ప్రతి సినిమాలోనూ తన మార్క్ చూపించారు. సిల్వర్ స్క్రీన్‌కు పరిమితం కాకుండా డిజిటల్ (ఓటీటీ) స్క్రీన్ మీద కూడా సత్తా చూపించారు. 'మోడ్రన్ లవ్ హైదరాబాద్', 'సివరపల్లి' వెబ్ సిరీస్‌లలో నటించారు. 'సివరపల్లి'లో ఆయన నటనకు గాను నేషనల్ లెవల్ వేదికపై అవార్డు వచ్చింది.

ఉత్తమ నటుడిగా రాగ్ మయూర్...
నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డుల్లో!
ముంబైలో 'నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్' (NEXA Streaming Academy Awards) వేడుక ఘనంగా జరిగింది. అందులో 'సివరపల్లి' వెబ్ సిరీస్‌కు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు రాగ్ మయూర్.

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సివరపల్లి'. ఆ సిరీస్‌లో ఆయన నటన సహజంగా ఉందని స్ట్రీమింగ్ అయిన సమయంలో అటు ఆడియన్స్, ఇటు క్రిటిక్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు అవార్డు రావడం కూడా సంతోషంగా ఉందన్నారు రాగ్ మయూర్.

Also Read: Jr NTR Tweet On Balakrishna Injury - బాబాయ్ బాలయ్య కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్లు... ఫోనులో మావయ్యకు లోకేష్ పరామర్శ

భారతీయ చిత్రసీమలో వివిధ భాషలకు చెందిన ప్రముఖులు హాజరైన వేడుకలో రాగ్ మయూర్ (Rag Mayur Awards)కు అవార్డు రావడం, అక్కడ ప్రముఖులు పలువురి చేత ప్రశంసలు అందుకోవడం విశేషం. మనోజ్ బాజ్‌పేయి, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులతో పాటు ప్రముఖ దర్శక ద్వయం రాజ్ (మా ఇంటి బంగారం రచయిత - నిర్మాత రాజ్ నిడిమోరు) & డీకేతో కలిసి రాగ్ మయూర్ వేదికను పంచుకున్నారు.

Also Read: Manasaagadhe Song Lyrics - మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian Streaming Academy (@streamingacademy.in)

ప్రస్తుతం తెలుగులో రాగ్ మయూర్ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. యువ దర్శక రచయితలు ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కథలు, క్యారెక్టర్లు చేస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'లో ఆయన అతిథి పాత్రలో మెరిశారు. త్వరలో మరో వెబ్ సిరీస్ కూడా చేయనున్నారని సమాచారం.

Also ReadKajal Aggarwal On Bikini Scenes - నో బోల్డ్ సీన్స్‌, బికినీలు... కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం

Frequently Asked Questions

రాగ్ మయూర్ ఏ వెబ్ సిరీస్‌కు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు?

రాగ్ మయూర్ 'సివరపల్లి' వెబ్ సిరీస్‌లో తన నటనకు గాను ముంబైలో జరిగిన 'నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్'లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందించబడింది.

సిల్వర్ స్క్రీన్‌తో పాటు డిజిటల్ స్క్రీన్‌పై రాగ్ మయూర్ నటించిన కొన్ని ప్రముఖ ప్రాజెక్టులు ఏమిటి?

సిల్వర్ స్క్రీన్‌పై 'సినిమా బండి', 'కీడా కోలా' వంటి చిత్రాలలో నటించారు. డిజిటల్ స్క్రీన్‌పై 'మోడ్రన్ లవ్ హైదరాబాద్', 'సివరపల్లి' వెబ్ సిరీస్‌లలో సత్తా చూపారు.

రాగ్ మయూర్ ప్రస్తుతం ఏ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు?

రాగ్ మయూర్ ప్రస్తుతం తెలుగులో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'లో అతిథి పాత్రలో కనిపించారు, త్వరలో మరో వెబ్ సిరీస్ కూడా చేయనున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget