Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో అన్‌బిలీవబుల్ డ్రామా చోటుచేసుకుంది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో 10 మందితో పోరాడిన అర్జెంటీనాను ఎక్స్‌ట్రా టైమ్ 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన మైండ్ బ్లోయింగ్ గోల్‌తో 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ లియోనెల్ మెస్సిపై అతిగా ఆధారపడటమే. స్పెయిన్ డిఫెండర్లు మెస్సిని కంప్లీట్ గా లాక్ చేయడంతో, ఈ టోర్నీలో 8 గోల్స్ కొట్టిన మెస్సి ఫైనల్‌లో ఒక్క కీ పాస్ కూడా ఇవ్వలేకపోయాడు.
మ్యాచ్ సెకండ్ హాఫ్ స్టాపేజ్ టైమ్‌లో ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్‌తో బయటకు వెళ్లడం అర్జెంటీనాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఒక ప్లేయర్ తగ్గడంతో వీకైన అర్జెంటీనా డిఫెన్స్‌ను దెబ్బతీస్తూ ఫెర్రాన్ టోర్రెస్ విన్నింగ్ గోల్ సాధించాడు. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా స్పెయిన్ జట్టు ట్రోఫీని అందుకుంది.
ట్రెండింగ్ వార్తలు






















