అన్వేషించండి

Hero Splendor Plus Flex Fuel vs Hero HF Deluxe Flex Fuel: హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మధ్య వ్యత్యాసాలు ఏంటీ? 

కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , హెచ్‌ఎఫ్ డీలక్స్ మధ్య తేడాలు ఏంటి? USB ఛార్జింగ్, i3S ఫీచర్, ప్రైస్ డిఫరెన్స్ పూర్తి డీటెయిల్స్ ఇక్కడ చూడండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హీరో రెండు ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లు విడుదల చేసింది, ధరలలో వ్యత్యాసం.
  • స్ప్లెండర్ ఐ3ఎస్, యూఎస్‌బీ పోర్ట్ కలిగి ఉండగా, హెచ్‌ఎఫ్ డీలక్స్ లేదు.
  • స్ప్లెండర్ ప్రీమియం లుక్, హెచ్‌ఎఫ్ డీలక్స్ బడ్జెట్ ఎంపిక.

Hero Splendor Plus Flex Fuel vs Hero HF Deluxe Flex Fuel: భారతీయ టూ-వీలర్ మార్కెట్లో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ హీరో మోటోకార్ప్ ఒకేసారి రెండు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌ను ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లలో లాంచ్ చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ , హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. 100cc కమ్యూటర్ సెగ్మెంట్‌లో ఈ రెండూ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై డిజైన్ చేసినప్పటికీ ఫీచర్లు, ధర పరంగా వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రెండింటిలో ఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ కొనుగోలు చేయడం మంచిదో క్లియర్ కట్‌గా బ్రేక్‌డౌన్ చేద్దాం.

రూ.10,000 వ్యత్యాసం దేనికి?

బడ్జెట్ కాన్షియస్ రైడర్స్ అందరూ మొదట చూసేది ధర. ఇక్కడే ఈ రెండు బైకుల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ యావరేజ్ ఎక్స్-షోరూమ్ ధర 72,792 రూపాయలుగా ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ యావరేజ్ ఎక్స్-షోరూమ్ ధర 82,710 రూపాయలుగా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్ మోడల్స్ లాగే, ఫ్లెక్స్ ఫ్యూయల్ సెగ్మెంట్‌లో కూడా స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ కంటే దాదాపు 9,918 రూపాయలు అదనం. మీరు ఒకవేళ స్ట్రిక్ట్ బడ్జెట్‌లో ఉండి, కేవలం ఎకో-ఫ్రెండ్లీ ప్రయాణమే లక్ష్యంగా పెట్టుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఇక్కడ భారీగా డబ్బు ఆదా చేస్తుంది.

i3S టెక్నాలజీ 

ఈ రెండు మోడల్స్ మధ్య ఉన్న అతిపెద్ద మెకానికల్ డిఫరెన్స్ హీరో సిగ్నేచర్ i3S టెక్నాలజీ. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఈ స్మార్ట్ i3S ఫీచర్ అందుబాటులో ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బైక్ న్యూట్రల్‌లో ఉన్నప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. మళ్లీ క్లచ్ నొక్కగానే సింపుల్‌గా స్టార్ట్ అవుతుంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో అదనపు పెట్రోల్‌ పొదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్లో ఈ i3S టెక్నాలజీ తొలగించారు. ధరను వీలైనంత తక్కువగా ఉంచేందుకు హెచ్ఎఫ్ డీలక్స్‌ఫ్లెక్స్ ఫ్యూయల్లో ఈ ఫీచర్‌ను హీరో ఆఫర్ చేయడం లేదు.

మొబైల్ USB ఛార్జింగ్ పోర్ట్ 

నేటి డిజిటల్ యుగంలో, ముఖ్యంగా రోజంతా బైక్‌లపై ప్రయాణించే డెలివరీ బాయ్స్, ఉద్యోగులకు మొబైల్ ఛార్జింగ్ అత్యంత అవసరమైన ఫీచర్. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ హ్యాండిల్‌బార్ వద్ద కంపెనీ ఇన్‌బిల్ట్‌గా USB ఛార్జింగ్ పోర్ట్‌ను అందిస్తోంది. దీనివల్ల ప్రయాణంలో మొబైల్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. హెచ్ఎఫ్ డీలక్స్‌ఫ్లెక్స్ ఫ్యూయల్లో USB ఛార్జింగ్ పోర్ట్ లభించదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ లేదా అదనపు యాక్సెసరీగా అమర్చుకోవాల్సి ఉంటుంది.

డిజైన్, సీట్ హైట్, రైడింగ్ కంఫర్ట్

ఇంజిన్ పరంగా రెండింటిలోనూ ఒకే రకమైన 97.2 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉన్నప్పటికీ (రెండు బైకులూ E85 ఫ్యూయల్‌పై 8.5 PS పవర్, 8.3 Nm టార్క్ ఇస్తాయి), వాటి డైమెన్షన్స్‌లో స్వల్ప మార్పులు ఉన్నాయి. స్ప్లెండర్ ప్లస్ దాని క్లాసిక్, బాక్సీ, ప్రీమియం లుక్‌ను కొనసాగిస్తుండగా.. హెచ్ఎఫ్ డీలక్స్ కాస్త యాంగ్యులర్, యూత్‌ఫుల్ డిజైన్‌తో వస్తుంది. స్ప్లెండర్ ప్లస్ సీట్ హైట్ 785 mm మాత్రమే. అంటే హైట్ తక్కువ ఉన్న రైడర్స్‌కు కూడా ఇది చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంది. మరోవైపు హెచ్ఎఫ్ డీలక్స్ సీట్ హైట్ 805mmగా ఉంది, ఇది కొంచెం పొడవుగా ఉండే వారికి మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది.

మీరు కేవలం తక్కువ ధరలో, ఎటువంటి ఆడంబరాలు లేని ప్రాక్టికల్ ఇథనాల్ బైక్ కావాలనుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఛాయిస్. కానీ, మీకు సిటీ ట్రాఫిక్‌లో మైలేజ్ సేవ్ చేసే i3S టెక్నాలజీ, లాంగ్ రైడ్స్‌లో మొబైల్ ఛార్జ్ చేసుకునే USB పోర్ట్, ఐకానిక్ రీసేల్ వాల్యూ ఉన్న ప్రీమియం లుక్ కావాలనుకుంటే అదనంగా ₹10,000 ఖర్చు చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వైపు వెళ్లడం 100% వాల్యూబుల్ డిసిషన్.

Frequently Asked Questions

హీరో మోటోకార్ప్ విడుదల చేసిన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు ఏవి?

హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మరియు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఇవి ఇథనాల్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్లు.

స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మధ్య ధరల వ్యత్యాసం ఎంత?

స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కంటే దాదాపు రూ. 9,918 ఎక్కువ. హెచ్ఎఫ్ డీలక్స్ ధర సుమారు రూ. 72,792 కాగా, స్ప్లెండర్ ప్లస్ ధర రూ. 82,710.

ఏ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లో i3S టెక్నాలజీ ఉంది? దాని ప్రయోజనం ఏమిటి?

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో i3S టెక్నాలజీ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయి, ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

ఈ బైక్‌లలో మొబైల్ USB ఛార్జింగ్ పోర్ట్ ఏ బైక్‌లో అందుబాటులో ఉంది?

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో ఇన్-బిల్ట్ USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌లో ఈ ఫీచర్ లేదు.

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget