అన్వేషించండి

Ather 450Xలో మూడు కొత్త కలర్ ఆప్షన్లు - మీ టైమ్‌ సేవ్‌ చేసే కొత్త ఛార్జర్‌ కూడా లాంచ్

Ather 450X Overtone Series మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్స్‌తో విడుదలైంది. కొత్త గ్రాఫిక్స్, 900W ఛార్జర్, OTA అప్‌డేట్లు, ధర, రేంజ్, ఫీచర్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Ather 450X overtone series launched: పాపులర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్రాండ్ Ather Energy, తన స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ Ather 450X కోసం కొత్త Overtone Seriesను లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్ ఎంపికలకు తోడు ఈ కొత్త రంగులు చేరడంతో Ather 450X మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది.

డ్యూయల్ టోన్ థీమ్‌
కొత్త Overtone Seriesలో Still White, Space Grey & Lunar Grey రంగులను డ్యూయల్ టోన్ థీమ్‌లో అందించారు. ఈ మూడు కలర్ ఆప్షన్లలో కొత్త గ్రాఫిక్స్‌తో పాటు స్కూటర్ సైడ్ ప్రొఫైల్‌పై ప్రత్యేకంగా కనిపించే '450' లెటరింగ్‌ను కాంట్రాస్టింగ్ షేడ్‌లో అందించారు. దీంతో స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్ వచ్చింది.

Space Grey కలర్ అత్యంత స్టైలిష్‌గా కనిపించే ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇందులో మెరూన్ రంగు యాక్సెంట్లు & అదే రంగులో వీల్స్‌ను అందించారు. Lunar Grey వేరియంట్‌లో లైట్ గ్రే షేడ్‌తో పాటు పసుపు రంగు ఫ్రేమ్ & వీల్స్ ఉన్నాయి. Still White వేరియంట్‌లో తెలుపు రంగుతో పాటు లైట్ గ్రీన్ యాక్సెంట్లు ఇవ్వడం వల్ల ప్రీమియం లుక్ కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: పల్సర్ అభిమానులకు షాక్ - బజాజ్ పల్సర్ N125 అమ్మకాలు నిలిపేసిన కంపెనీ, కారణం ఇదే!

161 కిలోమీటర్ల వరకు రేంజ్‌
కొత్త కలర్స్ మినహా స్కూటర్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇప్పటికే ఉన్న పనితీరు, మోటార్ & బ్యాటరీ సెటప్‌ను యథాతథంగా కొనసాగించింది. నగర ప్రయాణాలకు అనువైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్‌తో వేరియంట్‌ను బట్టి 122 కిలోమీటర్ల నుంచి 161 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన రేంజ్‌ను అందిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధరలు
Ather 450X ప్రస్తుతం నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఎక్స్ షోరూమ్ ధరలు సుమారు రూ.1.23 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధరలు సుమారు రూ.1.33 లక్షల నుంచి రూ.1.73 లక్షల మధ్య ఉన్నాయి. బెంగళూరులో Ather 450X ధర రూ.1.52 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

కొత్త Overtone Seriesతో పాటు కంపెనీ ఇప్పటికే అందిస్తున్న Cosmic Black & True Red మోనో కలర్స్‌ను కూడా కొనసాగిస్తోంది. అలాగే Hyper Sand & Stealth Blue మ్యాట్ ఫినిష్ కలర్ ఆప్షన్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద Ather 450X ఇప్పుడు ఎనిమిది ఆకర్షణీయమైన కలర్ ఎంపికల్లో లభిస్తోంది.

ఇది కూడా చదవండి: E20 పెట్రోల్ నింపుకుంటే పూర్తి బాధ్యత వాహనదారులదే, సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేసిందా?

కొత్త 900W ఛార్జర్‌
కొత్త రంగులతో పాటు Ather మరో కీలక అప్‌డేట్‌ను కూడా ప్రకటించింది. కంపెనీ కొత్త 900W ఛార్జర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా Ather 450X ఛార్జింగ్ సమయం దాదాపు 30 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ వెల్లడించింది. దీంతో యూజర్లు తక్కువ సమయంలోనే స్కూటర్‌ను ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇటీవల నిర్వహించిన Community Day 2025 కార్యక్రమంలో కంపెనీ AtherStack 7ను కూడా పరిచయం చేసింది. ఇందులో భాగంగా 'Voice on Ather' ఫీచర్‌ను OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో వాయిస్ కమాండ్ల ద్వారా స్కూటర్‌లోని పలు ఫీచర్లను మరింత సులభంగా వినియోగించుకునే అవకాశం లభించనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget