అన్వేషించండి

జూన్ కార్ల అమ్మకాల్లోనూ మారుతి హవా - టాటా, మహీంద్రా హోరాహోరీ రేస్‌

జూన్ 2026లో భారత కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి 1.47 లక్షల యూనిట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాటా రెండో స్థానం దక్కించుకోగా, మహీంద్రా మూడో స్థానంలో నిలిచింది.

June 2026 car sales: భారత ప్యాసింజర్ వెహికల్‌ మార్కెట్‌లో జూన్ 2026 నెలలో కూడా వృద్ధి కొనసాగింది. చాలా కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలను పెంచుకోగా, కొన్ని బ్రాండ్లు మాత్రం నెలవారీగా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దేశీయ మార్కెట్లో మరోసారి మారుతి సుజుకి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, టాటా మోటార్స్ స్వల్ప ఆధిక్యంతో రెండో స్థానాన్ని కాపాడుకుంది. మహీంద్రా మూడో స్థానంలో నిలవగా, హ్యుందాయ్ నాలుగో స్థానం & టయోటా ఐదో స్థానంలో కొనసాగాయి.

కంపెనీవారీగా జూన్‌ సేల్స్‌

మారుతి సుజుకి జూన్ నెలలో మొత్తం 1,47,187 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి ప్రత్యర్థులపై భారీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 23.78 శాతం పెరిగాయి. బ్రెజ్జా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎర్టిగా, XL6, జిమ్నీ, ఇన్విక్టో & ఈ విటారా వంటి SUVలు కలిపి 61,726 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆల్టో, ఎస్ ప్రెస్సో, బాలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ & వాగన్ ఆర్ వంటి చిన్న కార్లు 75,231 యూనిట్ల విక్రయాలతో కంపెనీ అమ్మకాలకు ప్రధాన బలంగా నిలిచాయి.

టాటా మోటార్స్ జూన్‌లో 62,076 కార్లను విక్రయించి రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ 67.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. మహీంద్రాపై కేవలం 1,683 యూనిట్ల ఆధిక్యంతో టాటా రెండో స్థానాన్ని కాపాడుకుంది. ఇదే నెలలో కంపెనీ కొత్త Sierra EVను విడుదల చేయడంతో పాటు జులై 1 నుంచి తన ICE & EV మోడళ్ల ధరలను 1.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Toyota Fortunerకు అదిరిపోయే మేకోవర్ - కొత్త జనరేషన్ SUVలా మార్చేసిన ఓనర్

మహీంద్రా కూడా జూన్‌లో 60,393 SUVలను విక్రయించి టాటాకు గట్టి పోటీ ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 27.66 శాతం పెరిగాయి. Scorpio-N, Thar, XUV 3XO & XUV 7XO మోడళ్లకు కొనసాగుతున్న బలమైన డిమాండ్ కంపెనీ విక్రయాలకు ఊతమిచ్చింది.

హ్యుందాయ్ జూన్‌లో 39,635 కార్లను విక్రయించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 9.97 శాతం తగ్గాయి. తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సుమారు 13,900 యూనిట్ల ఉత్పత్తి దెబ్బతిన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయినప్పటికీ Creta, Venue, Exterతో పాటు Grand i10 Nios & i20 మోడళ్లకు స్థిరమైన డిమాండ్ కొనసాగింది.

టయోటా జూన్‌లో 28,441 వాహనాలను విక్రయించి ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది. Innova Hycross, Urban Cruiser Hyryder & Glanza కంపెనీ అమ్మకాల్లో కీలక పాత్ర పోషించాయి. త్వరలో భారత మార్కెట్లో తొమ్మిదో తరం Hilux పికప్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: CNG ఆటోమేటిక్ కారు కొనాలని చూస్తున్నారా ? ఈ లిస్ట్ చూసి డిసైడ్ అవ్వండి

కియా జూన్‌లో 24,552 కార్లను విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 19.04 శాతం వృద్ధిని నమోదు చేసింది. Seltos, Sonetతో పాటు Carens Clavis & Syros మోడళ్లు మంచి అమ్మకాలను నమోదు చేశాయి. ఇదే నెలలో Carens Clavis EV కోసం Battery as a Service (BaaS) ప్రోగ్రామ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.

JSW MG Motor జూన్‌లో 7,568 వాహనాలను విక్రయించి 29.83 శాతం వృద్ధిని నమోదు చేసింది. Windsor EV, Comet EV & Hector మోడళ్లు కంపెనీ విక్రయాల్లో కీలకంగా నిలిచాయి. అలాగే జూలై 16న కొత్త ఎనర్జీ వాహనాన్ని భారత మార్కెట్లో ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

రెనాల్ట్ జూన్‌లో 4,063 కార్లను విక్రయించి 54.78 శాతం వృద్ధిని నమోదు చేసింది. కొత్త Duster ఎగుమతులను ప్రారంభించిన కంపెనీ, ఇటీవల Kiger Evolution+ Turbo వేరియంట్‌ను విడుదల చేసింది. మరోవైపు నిస్సాన్ వరుసగా నాలుగో నెల కూడా వృద్ధిని కొనసాగిస్తూ 3,006 కార్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 42.67 శాతం పెరిగాయి. Magnite & కొత్త Gravite మోడళ్లకు లభిస్తున్న ఆదరణ ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget