అన్వేషించండి

మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లోకి వస్తున్న నిస్సాన్ టెక్టాన్ - ఈ 13వ మోడల్‌ నుంచి ఏమేం ఆశించవచ్చు?

నిస్సాన్ టెక్టాన్ రేపు అధికారికంగా ఆవిష్కరణ కానుంది. కొత్త డిజైన్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌లు, ఆధునిక ఫీచర్లు, అంచనా ధర, ప్రత్యర్థి SUVల వివరాలను తెలుసుకోండి.

Nissan Tekton launch: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత పోటీ ఉన్న మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లోకి నిస్సాన్ మరోసారి అడుగుపెడుతోంది. 2023లో కిక్స్ ఉత్పత్తిని నిలిపివేసిన తర్వాత ఈ విభాగానికి దూరమైన సంస్థ, ఇప్పుడు టెక్టాన్ పేరుతో కొత్త SUVని తీసుకురానుంది. ఈ కొత్త మోడల్‌ను నిస్సాన్ గురువారం (09 జులై 2026) అధికారికంగా ఆవిష్కరించనుంది. ఇప్పటికే మార్కెట్‌లో 12 మోడళ్లు పోటీ పడుతుండగా, టెక్టాన్ 13వ మోడల్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

నిస్సాన్ టెక్టాన్, రెనాల్ట్ డస్టర్ ‍‌(Renault Duster) ఆధారంగా రూపొందించిన బ్యాడ్జ్ ఇంజినీరింగ్ మోడల్. ప్లాట్‌ఫామ్ & ఇంజిన్ ఎంపికలు డస్టర్‌తో ఒకేలా ఉన్నప్పటికీ, డిజైన్ పరంగా టెక్టాన్‌కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని నిస్సాన్ నిర్ణయించింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ల ప్రకారం ముందు భాగంలో పూర్తిగా కొత్త డిజైన్ కనిపించనుంది. ప్రత్యేక LED లైటింగ్ సిగ్నేచర్‌తో పాటు కంపెనీ ఫ్లాగ్‌షిప్ పట్రోల్ SUV నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌ను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.

బయటి డిజైన్‌లో డోర్లు, బోనెట్, ముందు & వెనుక ఫెండర్లు వంటి కొన్ని ప్యానెల్స్ డస్టర్‌తో ఒకేలా ఉండే అవకాశం ఉంది. అయితే ముందు గ్రిల్, బంపర్, లైటింగ్ ఎలిమెంట్లు పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. దీంతో టెక్టాన్‌కు ప్రత్యేక రూపం లభించనుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫీచర్లు & టెక్నాలజీ పరంగా డస్టర్‌కు దగ్గరగానే ఉన్నప్పటికీ, డ్యాష్‌బోర్డ్ డిజైన్, రంగులు, ట్రిమ్స్ & ఫినిషింగ్‌లో మార్పులు ఉండనున్నాయి. దీంతో క్యాబిన్‌లో కొత్త అనుభూతి కలిగేలా నిస్సాన్ ప్రయత్నిస్తోంది.

ఇది కూడా చదవండి: 2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌

ఇంజిన్ ఎంపికల్లో 100 హెచ్‌పీ శక్తి ఉత్పత్తి చేసే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 163 హెచ్‌పీ శక్తి అందించే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ఇంజిన్‌లకు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభించనుండగా, 1.3 లీటర్ ఇంజిన్‌కు మాత్రమే 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించే అవకాశం ఉంది. డస్టర్‌లో ఈ ఏడాది దీపావళి నాటికి రానున్న 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను టెక్టాన్‌లో కూడా తీసుకొస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.

ఫీచర్ల పరంగా టాప్ వేరియంట్‌లో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గూగుల్ ఇంటిగ్రేషన్, వైర్‌లెస్ Apple CarPlay & Android Auto, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ముందు సీట్ల వెంటిలేషన్ & పానోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: EV కొనాలనుకుంటున్నారా? BaaS స్కీమ్‌తో లక్షల రూపాయలు ఆదా - పూర్తి జాబితా ఇదే

భద్రత విషయంలో కూడా టెక్టాన్ ఆకట్టుకునే అవకాశమే ఎక్కువ. 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా, ABS, EBD, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ ఫంక్షన్ & TPMS వంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది. దిగువ వేరియంట్‌లలో కూడా మంచి ఫీచర్లు అందించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ధర విషయానికి వస్తే, టెక్టాన్‌ను డస్టర్ ధరలకు సమీపంగానే విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం డస్టర్ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు కాగా, టాప్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.18.69 లక్షల వరకు ఉంది. టెక్టాన్ కూడా ఇదే ధర పరిధిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత నిస్సాన్ టెక్టాన్‌కు రెనాల్ట్ డస్టర్‌తో పాటు Tata Sierra, Hyundai Creta, Kia Seltos, Skoda Kushaq, Volkswagen Taigun, Honda Elevate, MG Astor, Maruti Grand Vitara and Maruti Victoris వంటి మిడ్‌సైజ్ SUVల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

నిస్సాన్ టెక్టాన్ అంటే ఏమిటి?

నిస్సాన్ టెక్టాన్ అనేది మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి నిస్సాన్ తిరిగి ప్రవేశిస్తున్న కొత్త మోడల్. ఇది రెనాల్ట్ డస్టర్ ఆధారంగా రూపొందించబడింది, కానీ ప్రత్యేక డిజైన్‌తో వస్తుంది.

నిస్సాన్ టెక్టాన్ ఎప్పుడు ఆవిష్కరించబడుతుంది?

ఈ కొత్త నిస్సాన్ టెక్టాన్ SUVని కంపెనీ 2026 జులై 09వ తేదీ గురువారం అధికారికంగా ఆవిష్కరించనుంది.

నిస్సాన్ టెక్టాన్‌లో ఏ ఇంజిన్ ఎంపికలు ఉంటాయి?

ఇందులో 100 హెచ్‌పీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 163 హెచ్‌పీ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉంటాయి. 1.3 లీటర్ ఇంజిన్‌కు 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా లభిస్తుంది.

డిజైన్ పరంగా టెక్టాన్ రెనాల్ట్ డస్టర్‌తో ఎలా భిన్నంగా ఉంటుంది?

ప్లాట్‌ఫామ్, ఇంజిన్ ఒకేలా ఉన్నా, టెక్టాన్‌కు ప్రత్యేక డిజైన్ ఇవ్వాలని నిస్సాన్ నిర్ణయించింది. ముందు భాగంలో కొత్త డిజైన్, ప్రత్యేక LED లైటింగ్ సిగ్నేచర్ ఇందులో ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget