అన్వేషించండి

18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

18th BRICS Summit: కీలకమైన ఖనిజాలు, సాంకేతికను ఆయుధాలుగా మార్చవద్దని ప్రధాని మోదీ బ్రిక్స్ ముగింపు సభలో అన్నారు. బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటును ప్రతిపాదించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సు; ప్రపంచ సవాళ్లకు సహకారం.
  • మోదీ గ్లోబల్ సౌత్‌కు స్వరం, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ప్రతిపాదన.
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్-చైనా భాగస్వాములు, ప్రత్యర్థులు కాదన్నారు.

18th BRICS Summit: దిల్లీలోని భారత్ మండపంలో రెండ్రోజుల పాటు జరిగిన బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు (BRICS 2026) ముగిసింది. సదస్సు చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ సభ్య దేశాలు మరింత సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ ప్రసంగం  

సాంకేతిక పరిజ్ఞానాన్ని, కీలకమైన ఖనిజాలను ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయుధాలుగా ఉపయోగిస్తే అది ఉమ్మడి అభివృద్ధికి ఆటంకం అవుతుందని  ప్రధాని మోదీ అన్నారు. అందరినీ కలుపుకొని పోయే సాంకేతికతే బ్రిక్స్ లక్ష్యమని తెలిపారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు ప్రపంచ సంక్షోభాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనుకబడిపోతున్నాయని అన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ రూల్స్ పాటించేదిగా మాత్రమే కాకుండా, రూల్స్ సెట్ చేసే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.

Also Read: సీఐఏ సంచలన రిపోర్ట్.. ఒసామా బిన్ లాడెన్ హిట్ లిస్ట్‌లో భారత్!

బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్

మానవ అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య బ్యాలెన్స్ పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించే భారతీయ నాగరికత మూలాలను గుర్తుచేశారు. బ్రిక్స్ దేశాలలోని పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి "బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్" ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకుండా రైతులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతతో కూడిన ప్రజా ఉద్యమంగా మారాలని ఆకాక్షించారు.

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ ప్రకటన.. ఏకపక్ష సుంకాలపై ఆందోళన- భారత్ దౌత్య విజయం

చైనా-భారత్ సంబంధాలపై 

మరోవైపు, భారత్, చైనాలు భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కాదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఇరు దేశాల అభివృద్ధి ఒకదానికొకటి అవకాశాలను పెంచుతుందే తప్ప ముప్పు కాదని ఆయన పేర్కొన్నారు. మొత్తం 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో దేశాల మధ్య సహకారం, ఆవిష్కరణ, సుస్థిర అభివృద్ధి అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు.  

Also Read: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?

Frequently Asked Questions

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది?

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు దిల్లీలోని భారత్ మండపంలో రెండ్రోజుల పాటు జరిగింది.

బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ ఏ నిధిని ప్రతిపాదించారు?

ప్రధాని మోదీ

గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రధాని మోదీ ఏమన్నారు?

గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని, ఇకపై అవి రూల్స్ సెట్ చేసే శక్తిగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు.

భారత్-చైనా సంబంధాలపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏమన్నారు?

భారత్, చైనాలు భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కావని షీ జిన్‌పింగ్ అన్నారు. ఇరు దేశాల అభివృద్ధి ఒకదానికొకటి అవకాశాలను పెంచుతుందని పేర్కొన్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Drone Smuggling Syndicate: సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్.. ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ
సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, హెరాయిన్ స్మగ్లింగ్.. ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్ఐఏ
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Embed widget