సభ్య దేశాలు 'దిల్లీ డిక్లరేషన్ 2026'ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ ప్రకటన చేయడం భారతదేశానికి దౌత్య విజయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
BRICS Delhi Declaration: పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ బ్రిక్స్ ప్రకటన.. ఏకపక్ష సుంకాలపై ఆందోళన- భారత్ దౌత్య విజయం
BRICS Delhi Declaration: 18వ బ్రిక్స్ సమ్మిట్ లో దిల్లీ డిక్లరేషన్‌ను సభ్య దేశాలు ఆమోదించాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రకటన చేశాయి.

- బ్రిక్స్ దిల్లీ డిక్లరేషన్ 2026 పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది.
- ఉగ్రవాదం పట్ల జీరో టోలరెన్స్ ప్రకటించి, భారతదేశ విజయమన్నారు మోదీ.
- ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు బలోపేతం చేయాలని బ్రిక్స్ నిర్ణయించింది.
- ఆర్థికేతర భద్రతా అంశాలపైనా బ్రిక్స్ ప్రాముఖ్యతను పెంచుకుంది.
BRICS Delhi Declaration: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ముగింపు సమావేశంలో 'దిల్లీ డిక్లరేషన్ 2026'ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ బ్రిక్స్ ప్రకటన చేయడం భారతదేశానికి ఒక దౌత్య విజయంగా ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాదం పట్ల జీరో టోలరెన్స్‌ను ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది. ఏ కారణం చేతనైనా ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి.
ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా మధ్య పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా విభేదాలు ఉన్నప్పటికీ, భారత్ దౌత్య నైపుణ్యంతో బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్‌కు అవన్నీ ఆమోదం తెలిపాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు విరుద్ధంగా కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష సుంకాలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చర్యలపై ఈ సమావేశంలో సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ వివాదాలు, ఉద్రిక్తతలను యుద్దాల ద్వారా కాకుండా కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి. భారత్ చొరవతో పశ్చిమాసియా దేశాలు గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి రావడం విశేషం.
పహల్గామ్ ఉగ్రదాడి ఖండిస్తూ బ్రిక్స్ ప్రకటన
దిల్లీ డిక్లరేషన్ 40వ అంశంలో పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించింది. "ఉద్దేశంతో సంబంధం లేకుండా, ఎక్కడ చేసినా, ఎవరు చేసినా, ఏ పరిస్థితులలోనైనా జరిగిన ఉగ్రవాద చర్యలను మేము ఖండిస్తున్నాం, దానిని నేరపూరితమైనదిగా, సమర్థించలేనిదిగా పరిగణిస్తాం. 26 మంది మరణానికి, అనేక మంది గాయపడటానికి కారణమైన, ఏప్రిల్ 22, 2025న జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలలో ఎదుర్కోవడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని బ్రిక్స్ దేశాలు ప్రకటించాయి.
Also Read: బ్రిక్స్ వేదికగా భారత్ గ్లోబల్ సౌత్ గొంతుకగా, లీడర్‌గా ఎలా మారుతోంది ?
చైనా, రష్యాలతో సహా బ్రిక్స్ దేశాలన్నీ పహల్గామ్ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించాయి. మతం ఆధారంగా ఎవరినీ చంపకూడదని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ దాడికి కొద్దిసేపటి ముందు పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ హిందువులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందున, పాకిస్తాన్ మద్దతు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read: ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, నేడు మోదీతో కీలక భేటీ
ఉగ్రవాద కట్టడిపై బ్రిక్స్ కీలక ప్రకటన
బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక కార్యవర్గం (CTWG), దాని ఐదు సబ్ గ్రూపుల కార్యకలాపాలను స్వాగతిస్తున్నామని బ్రిక్స్ తెలిపింది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు మరింత బలోపేతం చేస్తామని ప్రకటించాయి. బ్రిక్స్ దేశాలు CTWG ద్వారా ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ముందుకు సాగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు, బ్రిక్స్ ఒక ఆర్థిక కూటమిగా మాత్రమే ఉందని, ఆ పరిధిని దాటి, ఉగ్రవాద నిరోధక భద్రతా కోణంలో దాని ప్రాముఖ్యతను పెంచుకుందని నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద నిరోధక సమస్యలను, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి కేసును ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకురావడంపై కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వారిని నిర్మూలించినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని బ్రిక్స్ దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ విషయాన్ని బ్రిక్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: కాంగ్రెస్ కూటమిలో విజయ్ కాదు.. విజయ్ కూటమిలోనే కాంగ్రెస్! ప్రధాని రేసుపై టీవీకే మాస్టర్ స్ట్రోక్!
Before You Go
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Frequently Asked Questions
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయం ఏమిటి?
దిల్లీ డిక్లరేషన్ ఉగ్రవాదం గురించి ఏమి స్పష్టం చేసింది?
డిక్లరేషన్ ఉగ్రవాదం పట్ల జీరో టోలరెన్స్‌ను పునరుద్ఘాటించింది. ఏ కారణం చేతనైనా ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని, అది నేరపూరితమైనదని, సమర్థించలేనిదని పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడిపై బ్రిక్స్ వైఖరి ఏమిటి?
బ్రిక్స్ దేశాలు ఏప్రిల్ 22, 2025న జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలలో ఎదుర్కోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించాయి.
ఉగ్రవాద నిరోధంపై బ్రిక్స్ ఎలా దృష్టి సారిస్తోంది?
బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక కార్యవర్గం (CTWG) కార్యకలాపాలను స్వాగతించింది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించింది. ఇది ఆర్థిక కూటమి నుండి భద్రతా కోణంలోనూ విస్తరించింది.
ట్రెండింగ్ వార్తలు






















