అన్వేషించండి

మీ బడ్జెట్‌లోనే ఆటోమేటిక్ కారు కావాలా? రూ.5 లక్షల లోపే ప్రారంభమయ్యే 10 బెస్ట్ ఆప్షన్లు

మన మార్కెట్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్ల జాబితా ఇదే. మారుతి, రెనాల్ట్, టాటా, హ్యుందాయ్, నిస్సాన్ మోడళ్ల ధరలు, ఫీచర్లు & ప్రత్యేకతలు తెలుసుకోండి.

Affordable cars with an automatic gearbox: నగరాల్లో రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో మాన్యువల్ గేర్‌బాక్స్ కారును నడపడం చాలామందికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్లు డ్రైవింగ్‌ను ఎంతో సులభంగా మార్చుతున్నాయి. ముఖ్యంగా AMT టెక్నాలజీతో వచ్చే కార్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి కొనుగోలుదారులు వాటివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న ఆటోమేటిక్ కార్ల జాబితాలో ఎక్కువగా హ్యాచ్‌బ్యాక్‌లు ఉండగా, కొన్ని SUVలు & ఒక సెడాన్ కూడా చోటు దక్కించుకున్నాయి.

1. Maruti S-Presso
ఈ జాబితాలో మొదటి స్థానంలో మారుతి ఎస్ ప్రెస్సో నిలిచింది. రూ.4.75 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందిస్తున్న దేశంలోనే అత్యంత చౌకైన కారు ఇదే. ఇందులో AMT గేర్‌బాక్స్ లభిస్తుండగా, తక్కువ నిర్వహణ ఖర్చులు కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. అయితే భద్రతా ఫీచర్ల విషయంలో కొన్ని పరిమితులు ఉండటంతో కొద్దిగా అదనపు బడ్జెట్ ఉంటే ఆల్టో K10ను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

2. Renault Kwid
రెండో స్థానంలో రెనాల్ట్ క్విడ్ ఉంది. దీని ధర రూ.4.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు నగర వినియోగానికి అనువైన పనితీరును అందిస్తుంది. తేలికపాటి యాక్సిలరేషన్‌కే మంచి స్పందన ఇవ్వడం దీని ప్రత్యేకత.

3. Maruti Alto K10
మూడో స్థానంలో మారుతి ఆల్టో K10 నిలిచింది. రూ.4.95 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు AMT గేర్‌బాక్స్ ద్వారా నగర ట్రాఫిక్‌లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. హైవేపై ఓవర్‌టేకింగ్ సమయంలో కొంత ముందస్తు ప్రణాళిక అవసరమైనా, నగర ప్రయాణాలకు ఇది మంచి ఎంపిక.

ఇది కూడా చదవండి: రెనాల్ట్ డస్టర్ 1.0 Vs 1.3 టర్బో పెట్రోల్ - పవర్‌ ఎంత, టార్క్‌ ఎంత, మైలేజ్‌లో ఏది బెస్ట్?

4. Maruti Celerio
నాలుగో స్థానంలో మారుతి సెలెరియో ఉంది. రూ.5.61 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ కారు భారతదేశంలో AMT టెక్నాలజీని ప్రజాదరణ పొందేలా చేసిన మోడళ్లలో ఒకటి. గేర్ మార్పులు సాఫీగా ఉండటం వల్ల రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

5. Maruti Wagon R
ఐదో స్థానంలో మారుతి వాగన్ ఆర్ ఉంది. రూ.5.97 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ మోడల్ 1.0 లీటర్ & 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. విశ్వసనీయత, తక్కువ నిర్వహణ ఖర్చులు & మంచి మైలేజ్ కారణంగా ఇది ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా కొనసాగుతోంది.

6. Tata Tiago
ఆరో స్థానంలో టాటా టియాగో ఉంది. రూ.6 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ & CNG రెండింటిలోనూ AMT ఆప్షన్‌ను అందిస్తోంది. నగర ప్రయాణాలకు తగిన పనితీరుతో పాటు డ్యూయల్ సిలిండర్ CNG టెక్నాలజీని కూడా అందిస్తోంది.

ఇది కూడా చదవండి: E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ

7. Nissan Magnite
ఏడో స్థానంలో నిస్సాన్ మాగ్నైట్ నిలిచింది. రూ.6.24 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ SUVలో AMTతో పాటు టర్బో పెట్రోల్ CVT ఎంపిక కూడా లభిస్తోంది. మెరుగైన మిడ్‌రేంజ్ పనితీరు & సాఫీ డ్రైవింగ్ అనుభవం దీని ప్రత్యేకత.

8. Tata Tigor
ఎనిమిదో స్థానంలో టాటా టిగోర్ ఉంది. రూ.6.80 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ జాబితాలోని ఏకైక సెడాన్ ఇదే. పెట్రోల్ & CNG ఇంజిన్‌లతో AMT గేర్‌బాక్స్ అందుబాటులో ఉండటం దీని ప్రధాన ఆకర్షణ.

9. Hyundai Exter
తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఉంది. రూ.6.95 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ SUVలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో AMT గేర్‌బాక్స్ లభిస్తుంది. ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో కొత్త లుక్ & అదనపు ఫీచర్లను కూడా కంపెనీ అందించింది.

10. Renault Kiger
పదో స్థానంలో రెనాల్ట్ కైగర్ ఉంది. రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఈ SUVలో సాధారణ పెట్రోల్ ఇంజిన్‌తో AMTతో పాటు టర్బో పెట్రోల్ CVT ఎంపిక కూడా అందుబాటులో ఉంది. జాబితాలోని అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌లలో ఇది ఒకటి కావడం విశేషం.

తక్కువ బడ్జెట్‌లో ఆటోమేటిక్ కారు కొనాలనుకునే వారికి ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV వరకు, పెట్రోల్ నుంచి CNG వరకు వివిధ అవసరాలకు తగ్గ మోడళ్లను కంపెనీలు అందిస్తున్నాయి. మీ బడ్జెట్, వినియోగ అవసరాలు & ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని సరైన కారును ఎంపిక చేసుకుంటే సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Small Cars: మీ ఇంటి దగ్గర రోడ్డు చాలా ఇరుకా? పార్కింగ్‌కు సరైన స్థలం లేదా? ఈ 8 కార్లు మీకు మంచి ఎంపిక
చిన్న సందులు, ఇరుకైన అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లకు సులభంగా సరిపోయే 8 కార్లు ఇవే!
Car Warranty: డాష్‌క్యామ్ అమరిస్తే కారు వారంటీ రద్దవుతుందా? రూ.లక్షల నష్టం రాకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!
కారులో డాష్‌క్యామ్ పెట్టించాలనుకుంటున్నారా? మీ కారు వారంటీ పోతుందేమో తెలుసుకోండి!
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Kia Seltos సరికొత్త రికార్డ్‌.. 7 లక్షలు దాటిన అమ్మకాలు.. ఈ SUVకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా?
ఇండియాలో 7 లక్షల మంది కొన్న క్రేజీ SUV.. ధర మీ బడ్జెట్‌లోనే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget