అన్వేషించండి

రెనాల్ట్ డస్టర్ 1.0 Vs 1.3 టర్బో పెట్రోల్ - పవర్‌ ఎంత, టార్క్‌ ఎంత, మైలేజ్‌లో ఏది బెస్ట్?

రెనాల్ట్ డస్టర్ 1.0 & 1.3 టర్బో పెట్రోల్ వేరియంట్ల రియల్ వరల్డ్ మైలేజ్ కంపారిజన్‌ విడుదలైంది. సిటీలో, హైవే మీద ఏ ఇంజిన్ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందించింది, ధరల వివరాలు తెలుసుకోండి.

Renault Duster Real World Mileage: ఇటీవల కొత్త మిడ్‌సైజ్‌ SUV డస్టర్‌ను తీసుకొచ్చిన రెనాల్ట్‌, ఈ మోడల్‌లో 1.0 లీటర్ & 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను అందిస్తోంది. అయితే ఎక్కువ పవర్ ఇచ్చే ఇంజిన్ అంటే మైలేజ్ తప్పనిసరిగా తగ్గిపోతుందా? లేక తక్కువ పవర్‌ ఇంజిన్‌ ఎక్కువ ఇంధన పొదుపు చేస్తుందా? అనే ప్రశ్నకు రియల్ వరల్డ్ టెస్టింగ్ ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.

రెనాల్ట్ డస్టర్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 hp పవర్ & 166 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ రెనాల్ట్ కైగర్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. మరోవైపు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏకంగా 163 hp పవర్ & 280 Nm టార్క్‌ను అందిస్తోంది. ఈ ఇంజిన్ ప్రస్తుతం ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన టర్బో పెట్రోల్ యూనిట్‌గా నిలుస్తోంది.

రెండు ఇంజిన్‌లకూ 6 స్పీడ్ MT గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. 1.3 లీటర్ ఇంజిన్‌కు అదనంగా 6 స్పీడ్ DCT ఎంపిక కూడా ఉంది. 1.0 లీటర్ వేరియంట్ బరువు 1,316 కిలోలు కాగా, 1.3 లీటర్ వేరియంట్ 1,372 కిలోల బరువుతో వస్తుంది. రెండు మోడళ్లలోనూ 50 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కంపెనీ అందించింది.

మైలేజ్‌ (kpl)
Duster 1.0
Duster 1.3
సిటీలో 
 
7.98
8.04
హైవే మీద
 
13.98
13.24
సగటు
 
10.98
10.94
ARAI
 
19.41
17.75

రియల్ వరల్డ్ మైలేజ్ పరీక్షల్లో ఎక్స్‌పర్ట్‌లు ఈ రెండు ఇంజిన్‌లనూ Eco మోడ్ & ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్‌తో పరీక్షించారు. నగరంలో 1.3 లీటర్ ఇంజిన్ స్వల్ప ఆధిక్యాన్ని నమోదు చేసింది. 1.0 లీటర్ ఇంజిన్‌తో పోలిస్తే ఇది కేవలం 0.06 kmpl ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. లాంగ్‌ గేర్ రేషియో కారణంగా తరచుగా గేర్ మార్చాల్సిన అవసరం లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తేలింది.

ఇది కూడా చదవండి: ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?

అయితే 1.0 లీటర్ ఇంజిన్ పరీక్ష సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా AC ఎక్కువ సేపు పనిచేయడం & ఆటో స్టార్ట్/స్టాప్ ఫీచర్ పరిమితంగా పని చేయడం వల్ల సిటీ మైలేజ్‌పై ప్రభావం పడింది.

హైవేపై మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. అక్కడ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 1.3 లీటర్ ఇంజిన్ కంటే 0.74 kmpl ఎక్కువ మైలేజ్‌ను అందించింది. మొత్తం సగటు మైలేజ్‌లో కూడా 1.0 లీటర్ వేరియంట్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. 1.0 లీటర్ వేరియంట్ సగటున 10.98 kmpl ఇవ్వగా, 1.3 లీటర్ వేరియంట్ 10.64 kmpl మైలేజ్‌ను నమోదు చేసింది. అంటే రెండు మోడళ్ల మధ్య వాస్తవ వినియోగంలో కేవలం 0.34 kmpl మాత్రమే తేడా కనిపించింది. ARAI ప్రకటించిన గణాంకాల్లో ఉన్న 1.66 kmpl తేడాతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్‌ ధరలు, EMI వివరాలు ఇవిగో

ధరల విషయానికి వస్తే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ డస్టర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.49 లక్షల నుంచి రూ.13.49 లక్షల వరకు ఉంది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.16.99 లక్షల వరకు నిర్ణయించారు. ఒకే వేరియంట్‌లో 1.3 లీటర్ ఇంజిన్‌ను ఎంచుకుంటే గరిష్ఠంగా రూ.1.30 లక్షల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అందుబాటు ధరలో మంచి మైలేజ్ కోరుకునే వారికి 1.0 లీటర్ డస్టర్ ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోంది. అయితే, పవర్‌ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌, వేగవంతమైన డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ సరైన ఎంపిక అవుతుంది. మైలేజ్ పరంగా చూస్తే రెండు మోడళ్ల మధ్య పెద్దగా తేడా లేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget