అన్వేషించండి

మాన్యువల్ నుంచి DCT వరకు - కార్లలో ఉండే అన్ని రకాల గేర్‌బాక్స్‌ల గురించి పూర్తి వివరాలు

భారత్‌లో కార్లలో ఉపయోగించే Manual, AMT, CVT, Torque Converter & DCT గేర్‌బాక్స్‌ల మధ్య తేడాలు ఏమిటి? ఏది ఎవరికి సరిపోతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Types of car gearbox in India: భారత్‌లో కొత్త కారు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది ఇంజిన్, మైలేజ్, ఫీచర్లపై దృష్టి పెడతారు. అయితే గేర్‌బాక్స్ ఎంపిక కూడా అంతే కీలకం. ప్రస్తుతం భారత మార్కెట్‌లో మాన్యువల్ నుంచి ఆధునిక ఆటోమేటిక్ వరకు అనేక రకాల గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్, డ్రైవింగ్ అలవాట్లు & అవసరాలను బట్టి సరైన గేర్‌బాక్స్‌ను ఎంచుకుంటే డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT)

భారత్‌లో ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన గేర్‌బాక్స్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. ఇందులో డ్రైవర్ క్లచ్ పెడల్ నొక్కి గేర్ లీవర్ ద్వారా స్వయంగా గేర్ మార్చాలి. సాధారణంగా 5 స్పీడ్ లేదా 6 స్పీడ్ గేర్‌బాక్స్‌లు అందుబాటులో ఉంటాయి. తక్కువ ధర, మంచి మైలేజ్, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ కార్లలో ఎక్కువగా ఈ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచూ క్లచ్ ఉపయోగించాల్సి రావడం కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు.

ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)

AMT అనేది సాధారణ మాన్యువల్ గేర్‌బాక్స్‌కే కంప్యూటర్ ఆధారిత క్లచ్ వ్యవస్థను జోడించిన సాంకేతికత. ఇందులో క్లచ్ పెడల్ ఉండదు. గేర్ మార్పులను సిస్టమ్ స్వయంగా నిర్వహిస్తుంది. తక్కువ ధరలో ఆటోమేటిక్ అనుభవం అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా వంటి కంపెనీల ఎంట్రీ లెవల్ కార్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గేర్ మారే సమయంలో స్వల్పంగా జర్క్ అనిపించడం దీని లోపంగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి: పాత వాహనాల ఓనర్లకు షాక్‌ - ప్యూర్ పెట్రోల్‌, E10 ఆప్షన్లు లేవు, E20 మాత్రమే ఉంటుందన్న కేంద్రం

కంటిన్యూయస్‌లీ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT)

CVT గేర్‌బాక్స్‌లో సాధారణ గేర్‌లు ఉండవు. బెల్ట్ & పుల్లీ వ్యవస్థ ద్వారా శక్తి చక్రాలకు చేరుతుంది. దీనివల్ల, గేర్ మార్పులు కారులో ఉన్న వాళ్లు గుర్తించలేనంత సాఫీగా ఉంటాయి. నగర ట్రాఫిక్‌లో తరచూ బ్రేక్ & యాక్సిలరేటర్ ఉపయోగించే వారికి ఇది చాలా అనువైన ఎంపిక. ఇంధన సామర్థ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. హోండా సిటీ వంటి కార్లలో ఈ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (TC)

టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌లో ద్రవ ఆధారిత వ్యవస్థ ద్వారా ఇంజిన్ శక్తి చక్రాలకు చేరుతుంది. దీంతో గేర్ మార్పులు చాలా మృదువుగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నిక, విశ్వసనీయ పనితీరు & ట్రాఫిక్ పరిస్థితుల్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ కారణంగా ఈ గేర్‌బాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా నగరాల్లో ప్రతిరోజూ డ్రైవ్ చేసే వారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు.

ఇది కూడా చదవండి: ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?

డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT లేదా DSG)

ఆధునిక సాంకేతికతతో రూపొందిన DCT గేర్‌బాక్స్‌లో రెండు క్లచ్‌లు ఉంటాయి. ఒకటి ప్రస్తుత గేర్‌ను నిర్వహిస్తే, మరొకటి తదుపరి గేర్‌ను ముందుగానే సిద్ధంగా ఉంచుతుంది. దీంతో గేర్ మార్పులు అత్యంత వేగంగా జరుగుతాయి. టర్బో పెట్రోల్ & ప్రీమియం కార్లలో ఈ గేర్‌బాక్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కియా సోనెట్ DCT, వోక్స్‌వ్యాగన్ వర్చుస్ DSG వంటి మోడళ్లు ఇందుకు ఉదాహరణలు. వేగవంతమైన పనితీరు కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

ఏ గేర్‌బాక్స్ ఎవరికి సరిపోతుంది?

తక్కువ బడ్జెట్, తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి మాన్యువల్ గేర్‌బాక్స్ ఉత్తమం. నగర ట్రాఫిక్‌లో క్లచ్ ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయాలనుకుంటే AMT మంచి ఎంపిక. అత్యంత సాఫీగా సాగే డ్రైవింగ్ అనుభవం కోసం CVT అనుకూలంగా ఉంటుంది. మన్నిక & సౌకర్యాన్ని కోరుకునేవారికి టార్క్ కన్వర్టర్ సరైనది. స్పోర్టీ పనితీరు, వేగవంతమైన గేర్ మార్పులు కోరుకునే వారికి DCT లేదా DSG గేర్‌బాక్స్ అత్యుత్తమ ఎంపికగా చెప్పవచ్చు. వీటిలో, మాన్యువల్ తప్ప మిగిలిన ట్రాన్స్‌మిషన్ల నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget