అన్వేషించండి

మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?

FASTag బ్యాంక్‌ను మార్చుకునే అవకాశం వచ్చింది. OneTag ద్వారా అదే స్టిక్కర్, FASTag ID & వాహన నంబర్‌తో మరో బ్యాంక్‌కు మారవచ్చు.

FASTag OneTag Guide Telugu: ఫాస్టాగ్ యాజర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై, FASTag బ్యాంక్ సేవలు మీకు నచ్చకపోతే ఆ సర్వీస్‌ను మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. ఇందుకోసం వాహనంపై ఉన్న FASTag స్టిక్కర్‌ను తొలగించాల్సిన అవసరం లేదు, కొత్త స్టిక్కర్ తీసుకోవాల్సిన పనీ ఉండదు. ఇదంతా OneTag పోర్టబిలిటీ విధానంతో సాధ్యం కానుంది.

మొబైల్ వినియోగదారులు తమ ఫోన్ నంబర్ మార్చుకోకుండా నెట్‌వర్క్‌ను మార్చుకున్నట్లే.. FASTag వినియోగదారులు కూడా అదే స్టిక్కర్‌తో బ్యాంక్‌ను మార్చుకోవచ్చు. FASTag ID, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మారవు. వన్‌ట్యాగ్‌ (OneTag) పేరుతో దీనిని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ముంబైలో ప్రారంభించారు. ఈ విధానాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ & NPCI కలిసి అభివృద్ధి చేశాయి. FASTag జారీ చేసే బ్యాంక్‌ను సులభంగా మార్చుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలి?

FASTag బ్యాంక్‌ను మార్చుకోవాలంటే ముందుగా NHAIకి చెందిన "రాజ్‌మార్గ్‌యాత్ర" ‍‌(Rajmarg Yatra) మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో OneTag పోర్టబిలిటీ సదుపాయాన్ని ఎంచుకోవాలి. ఇప్పటికే ఉన్న FASTag వివరాలు & వాహన వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ FASTag పోర్టింగ్‌కు అర్హత ఉందో లేదో పరిశీలించాలి.

అర్హత నిర్ధారణ అయిన తర్వాత ప్రస్తుత బ్యాంక్ నుంచి FASTagను మరో బ్యాంక్‌కు మార్చేందుకు వినియోగదారు సమ్మతి ఇవ్వాలి. అనంతరం OneTagలో భాగమైన బ్యాంకుల జాబితా నుంచి తమకు నచ్చిన బ్యాంక్‌ను ఎంచుకోవచ్చు.

మీరు ఎంచుకున్న కొత్త బ్యాంక్ అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేస్తుంది. కస్టమర్ ధ్రువీకరణ పూర్తయిన తర్వాత FASTag నిర్వహణ కొత్త బ్యాంక్‌కు మారుతుంది.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?

స్టిక్కర్‌కు ఏమవుతుంది?

ఇక్కడే OneTag విధానం ప్రత్యేకత ఉంది. బ్యాంక్ మారినా వాహనంపై ఉన్న పాత RFID స్టిక్కర్ అలాగే ఉంటుంది. దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు. కొత్త స్టిక్కర్‌ను అతికించాల్సిన అవసరం కూడా ఉండదు. FASTag ID & వాహన రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అలాగే కొనసాగుతాయి. కొత్త బ్యాంక్ వివరాలను NPCI, NETC నెట్‌వర్క్‌లో అప్‌డేట్ చేస్తుంది. ఆ తర్వాత టోల్ ప్లాజాల వద్ద FASTag ద్వారా చెల్లింపులు సాధారణంగానే జరుగుతాయి.

పాత బ్యాంక్ ఖాతా సంగతేంటి?

పోర్టింగ్ పూర్తయిన వెంటనే పాత బ్యాంక్‌కు సంబంధించిన అన్ని అంశాలు పూర్తిగా ముగిసిపోవు. గత లావాదేవీలు, పెండింగ్ మొత్తాలు, రీఫండ్‌లు & సెక్యూరిటీ డిపాజిట్‌కు సంబంధించిన వ్యవహారాలను పాత బ్యాంకే పరిష్కరించాల్సి ఉంటుంది. FASTag నిర్వహణ మాత్రం కొత్త బ్యాంక్ చేతికి వెళ్తుంది. ఈ మార్పుతో FASTag వినియోగదారులకు బ్యాంక్ ఎంపికలో మరింత స్వేచ్ఛ లభించనుంది. బ్యాంక్ సేవలు నచ్చకపోయినా, కస్టమర్ సేవల్లో ఇబ్బందులు ఉన్నా స్టిక్కర్ మార్చే తంటా లేకుండా మరో బ్యాంక్‌కు మారవచ్చు.

ప్రస్తుతం దేశంలో FASTag వినియోగం 98 శాతానికి మించి ఉందని కేంద్రం చెబుతోంది. సుమారు 13 కోట్ల FASTagలు జారీ కాగా, దాదాపు 6 కోట్ల ట్యాగ్‌లు క్రియాశీలంగా ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: నెలకు కేవలం రూ.10 వేలతో ఎలక్ట్రిక్‌ కారు సొంతం - పెట్రోల్ భారం నుండి విముక్తి పొందే ఐడియా

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget