అన్వేషించండి

E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

Flex Fuel Bike: ఈ బైక్‌ను E20 నుండి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించేలా తయారు చేశారు. E85 అంటే ఈ ఇంధనంలో 85 శాతం ఇథనాల్ మరియు 15 శాతం పెట్రోల్ ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ భారత్‌లో విడుదలైంది.
  • ఇది సాధారణ పెట్రోల్, E85 ఫ్లెక్స్ ఇంధనంతో నడుస్తుంది.
  • పెట్రోల్ ధరలు, కాలుష్యం తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉంది.
  • 149cc ఇంజిన్, ABS, డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లున్నాయి.

Flex Fuel Bike: భారత్‌లో పెట్రోల్ ధరల పెరుగుదల, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో యమహా భారత మార్కెట్లో తన కొత్త FZ బ్లూ ఫ్లెక్స్ (FZ Blue Flex) మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. సాధారణ పెట్రోల్‌తో పాటు E85 ఫ్లెక్స్ ఫ్యూయల్తో నడవగల కంపెనీ తీసుకొచ్చిన మొదటి బైక్ ఇది. ఇప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, E20 పెట్రోల్ లాంటి వివిధ రకాల ఇంధనాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

కంపెనీ FZ Blue Flex బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.24 లక్షలుగా నిర్ణయించింది. ఈ బైక్ అతిపెద్ద ప్రత్యేకత దీని ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికత అని చెప్పవచ్చు. సాధారణంగా భారత్‌లో విక్రయించే బైక్‌లు కేవలం పెట్రోల్ లేదా పరిమితంగా ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై మాత్రమే నడుస్తాయి.

యమహా FZ బ్లూ ఫ్లెక్స్ (Yamaha FZ Blue Flex) బైక్‌ను E20 నుండి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచేలా డిజైన్ చేశారు. E20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. E85 అంటే ఈ ఇంధనంలో దాదాపు 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇథనాల్‌ను చెరకు, ఇతర వ్యవసాయ పంటల నుండి తయారు చేస్తారు. ఇది పెట్రోల్‌తో పోలిస్తే పర్యావరణానికి మరింత అనుకూలమైనదిగా భావిస్తున్నారు. 

Also Read:  ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?

బైక్ ప్రత్యేకతలు 

బైక్ ఇంజిన్ విషయానికి వస్తే కొత్త యమహా FZ బ్లూ ఫ్లెక్స్‌లో 149cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ దాదాపు 11.5 BHP పవర్, 12.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు 5 స్పీడ్ గేర్‌ బాక్స్ వస్తుంది. ఇంజిన్ పవర్ గతంలోలాగే ఉన్నప్పటికీ, ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనంపై కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసేలా ఇందులో టెక్నికల్ మార్పులు చేశారు.

డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

కొత్త FZ బ్లూ ఫ్లెక్స్ చాలా వరకు ప్రస్తుత FZ సిరీస్ తరహాలోనే కనిపిస్తుంది. ఇందులో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, LED హెడ్‌లైట్, మంచి గ్రాఫిక్స్, స్పోర్టీ లుక్ ఇచ్చారు. ఇవి యువతను ఆకట్టుకుంటున్నాయి. బైక్‌లో సౌకర్యవంతమైన సీటు, మెరుగైన రైడింగ్ పొజిషన్, స్ట్రాంగ్ బాడీ కూడా లభిస్తాయి. దీనివల్ల రోజువారీ వాడకంతో పాటు లాంగ్ జర్నీని కూడా తేలిక చేస్తాయి.

Yamaha FZ Blue Flex ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్, సింగిల్ ఛానల్ ABS, రెండు వీల్స్‌కు  డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఈ సౌకర్యాలన్నీ బైక్‌ను సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుస్తాయి. ట్రాఫిక్ ఉండే సిటీ రోడ్ల నుండి హైవేల వరకు ప్రతి రకమైన రోడ్డు రైడింగ్‌లోనూ బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా యమహా ఈ బైక్‌ను డిజైన్ చేసింది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో టాటా సియెర్రా EV ఫైనల్‌గా ఎంతకు వస్తుంది? ఆన్‌రోడ్‌ ధరలు, EMI వివరాలు ఇవిగో

Frequently Asked Questions

యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ ప్రధాన ప్రత్యేకత ఏమిటి?

ఇది సాధారణ పెట్రోల్ తో పాటు E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ తో నడవగల యమహా కంపెనీ మొదటి బైక్. ఇది E20 నుండి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచేలా డిజైన్ చేయబడింది.

యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఎంత?

యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు. ఇది ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికతతో కూడిన బైక్.

యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ ఎలాంటి ఇంజిన్‌తో వస్తుంది?

ఈ బైక్ 149cc ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది దాదాపు 11.5 BHP పవర్ మరియు 12.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా FZ బ్లూ ఫ్లెక్స్ బైక్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

ఈ బైక్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైటింగ్, సింగిల్ ఛానల్ ABS, డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇది రైడింగ్‌ను సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా చేస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget