అన్వేషించండి

టాటా బెస్ట్‌ సెల్లింగ్‌ కార్‌ నెక్సాన్‌ - ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి, ఆలోచించండి

టాటా నెక్సాన్ కొనాలని భావిస్తున్నారా? ఈ SUVలో ఉన్న 3 ప్రధాన బలాలు, 2 ముఖ్యమైన లోపాలు, ఇంజిన్ ఆప్షన్లు, ఫీచర్లు, మైలేజ్, ధర & పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tata Nexon Price And Features: ఓవరాల్‌ ఇండియాలో అత్యంత పాపులారిటీ ఉన్న కాంపాక్ట్ SUVల్లో టాటా నెక్సాన్ ఒకటి. 2017లో మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్‌కు ఇప్పటికే రెండు ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చినప్పటికీ, అమ్మకాల పరంగా ఇప్పటికీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2026 జూన్ నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్న నెక్సాన్, కొనుగోలుదారులకు ఎన్నో ఆప్షన్లు అందిస్తోంది. అయితే ఈ SUVకి ఉన్న బలాలు ఏంటి? లోపాలు ఏంటి? కొనుగోలు చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే.

టాటా నెక్సాన్ ధర రూ.7.40 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.14.40 లక్షల వరకు (ఎక్స్‌షోరూమ్‌) ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్ ధర సుమారు రూ.8.77 లక్షల నుంచి రూ.17.72 లక్షల వరకు ఉంటుంది. 

10 శాతం డౌన్ పేమెంట్‌తో, ఏడేళ్ల రుణ కాలానికి, నెలవారీ EMI సుమారు రూ.12,710 నుంచి ప్రారంభమవుతుంది.

ప్లస్‌ పాయింట్లు

నెక్సాన్‌ను కొనడానికి మొదటి ప్రధాన కారణం విభిన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు. పెట్రోల్, డీజిల్, CNG & EV రూపాల్లో ఈ SUV అందుబాటులో ఉండటం కొనుగోలుదారులకు పెద్ద ప్రయోజనం. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120hp శక్తి & 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ 100hp శక్తిని అందిస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115hp శక్తి & 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Nexon EVలో 30kWh & 45kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Maruti Baleno మీకు సరైన కారేనా? కొనే ముందు తెలుసుకోవాల్సిన 2 ప్లస్‌లు & 2 మైనస్‌లు

ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయంలో కూడా నెక్సాన్ ముందంజలో ఉంది. పెట్రోల్ వేరియంట్‌లో 5 స్పీడ్ MT, 6 స్పీడ్ MT, 6 స్పీడ్ AMT & 7 స్పీడ్ DCT ఆప్షన్లు లభిస్తాయి. డీజిల్‌లో 6 స్పీడ్ MT లేదా 6 స్పీడ్ AMT, CNGలో 6 స్పీడ్ MT అందుబాటులో ఉంది. ఈ స్థాయిలో ఇన్ని ఎంపికలు అందించే SUVలు చాలా తక్కువగా ఉన్నాయి.

రెండో ప్రధాన బలం రైడ్ క్వాలిటీ. 208 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో నెక్సాన్ గుంతలు, ఎగుడుదిగుడు రహదారులపై కూడా మంచి స్థిరత్వాన్ని చూపుతుంది. తక్కువ వేగంలో కొద్దిపాటి షాక్స్‌ అనిపించినా, వేగం పెరిగిన తర్వాత ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారుతుంది. బాడీ కంట్రోల్ & సస్పెన్షన్ పనితీరు కూడా ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి.

మూడో ప్రధాన ఆకర్షణ ఫీచర్ల జాబితా. వేరియంట్‌ను బట్టి 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 8 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో డిమ్మింగ్ IRVM, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!

మైనస్‌ పాయింట్లు

నెక్సాన్‌లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మొదటిగా ఇంటీరియర్ ఎర్గోనామిక్స్ పూర్తిగా మెప్పించవు. క్యాబిన్‌లో సరైన కప్ హోల్డర్లు లేకపోవడం కొంత అసౌకర్యంగా ఉంటుంది. డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ లేదు. సీట్ వెంటిలేషన్ బటన్ సీటు కింద భాగంలో ఉండటంతో దాన్ని ఉపయోగించడం అంత సులభం కాదు.

క్యాబిన్‌లో ఉపయోగించిన గ్లోస్ బ్లాక్ ఫినిష్‌పై వేలిముద్రలు & దుమ్ము త్వరగా కనిపిస్తాయి. AC & స్టీరింగ్ కోసం ఇచ్చిన టచ్ కంట్రోల్స్ ప్రయాణ సమయంలో సౌకర్యంగా ఉండవు. మొత్తం నిర్మాణ నాణ్యత కూడా కొన్ని ప్రత్యర్థి SUVలతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకో బలహీనత 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్. గేర్ మారడంలో స్వల్ప ఆలస్యం అనిపిస్తుంది. క్లచ్ కూడా కొంత గట్టిగా ఉండటంతో సిటీ ట్రాఫిక్‌లో తరచూ డ్రైవ్ చేసే వారికి ఇది పూర్తిగా సౌకర్యంగా అనిపించకపోవచ్చు.

మొత్తంగా చూస్తే, టాటా నెక్సాన్ విభిన్న ఇంజిన్ ఆప్షన్లు, సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీ & అధునాతన ఫీచర్లతో మంచి ఎంపికగా నిలుస్తోంది. అయితే ఇంటీరియర్ వినియోగ సౌలభ్యం & మాన్యువల్ గేర్‌బాక్స్ పనితీరులో కొంత మెరుగుదల ఉంటే ఈ SUV మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Embed widget