అన్వేషించండి

Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్

చనిపోయి చాలా ఏళ్లు అయినా మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావులు సైతం ఓటర్ల జాబితాలో ఉన్నారని, ఇంకా వారికి ఓట్లు అవసరమా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నిర్మల్‌లో SIR వద్దన్న వారిపై బండి సంజయ్ విమర్శలు.
  • కాంగ్రెస్ CAA, NRC వ్యతిరేకతను సంజయ్ తీవ్రంగా ఖండించారు.
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా సమస్యలు గాలికొదిలేశాయని ఆరోపణ.
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం.

నిర్మల్‌కు వచ్చి ‘సర్’ (SIR) వద్దంటే అటువంటి వారి వీపంతా సాఫ్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల కిందట చనిపోయిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి, 2004లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆ తర్వాత సైతం ప్రముఖ నేతలు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, నేటికీ వారికి ఓట్లు ఉన్నాయని.. అలా చనిపోయిన వారి ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తొలగించాలా? వద్దా? అని ప్రశ్నించారు.

నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్ర సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా, సభలోని కార్యకర్తలు ఒక్కసారిగా 'సీఎం.. సీఎం' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన బండి సంజయ్, మరోసారి 'సీఎం సీఎం' అని నినాదాలు చేస్తే మైక్ బంద్ చేసి వెళ్లిపోతానని కార్యకర్తలను తీవ్రంగా మందలించారు. నిర్మల్ గడ్డ పూర్తిగా కాషాయ అడ్డా అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్, ఇండీ కూటమిపై ధ్వజం

ఇటలీ సంతతికి చెందిన వ్యక్తులు ఈ దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను 'రాక్షస సేన'గా అభివర్ణించిన ఆయన, ఆ పార్టీ నాయకులు వేసే నిందలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ గరళ కంఠుడిలా భరిస్తున్నారని అన్నారు. “మీ ముత్తాత, నానమ్మ, తండ్రి హయాంలో సర్ చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదు?” అని రాహుల్ గాంధీని నిలదీశారు. రాహుల్ గాంధీకి 'సర్' అంశంపై కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. ఈ దేశ పౌరులే ప్రధానిని, ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని.. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి 'కోన్ కిస్కా' గాళ్లు ఇక్కడి ప్రధానిని, సీఎంను నిర్ణయిస్తామంటే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. అట్లాంటి వారిని ఉరికించి ఉరికించి కొడతామని హెచ్చరించారు. సీఏఏ (CAA), ఎన్ఆర్సీ (NRC)లను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై మండిపాటు

SIR అమల్లోకి తేవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాదయాత్ర చేపడితే లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి మద్దతు తెలిపారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఆ యాత్రలో అమిత్ షాకు వందనం చేసినందుకు తనను, రామచంద్రరావును బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు కించపరుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. మాకు మీలాగా మందుపోసే కల్చర్ గానీ, డబ్బు సంచులు ఢిల్లీ పెద్దలకు పంపే సంస్కృతి గానీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను ప్రజలు ఉరికించి కొట్టే రోజులు త్వరలోనే రాబోతున్నాయని అన్నారు.

తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే

తెలంగాణ గడ్డపై ఇకపై రంగు రంగుల జెండాలకు తావులేదని, ఎగరబోయేది ఒక్క కాషాయ జెండానే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా కాషాయ జెండా వైపే మొగ్గు చూపుతున్నారని, రామచంద్రరావు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ లేక, సరిపడా నీళ్లు లేక ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు రాక వృద్ధులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో బాధితులుగా మారారని విమర్శించారు. ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేసి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోయి 'సర్' పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇలాగే ప్రవర్తిస్తే త్వరలోనే ఎన్ఆర్సీ (NRC)ని తీసుకొచ్చి తీరుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Frequently Asked Questions

బండి సంజయ్ 'సర్' అంశంపై ఏమన్నారు?

'సర్' వద్దంటే అటువంటి వారి వీపంతా సాఫ్ చేయాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించాలా వద్దా అని ప్రశ్నించారు.

నిర్మల్ సభలో 'సీఎం సీఎం' నినాదాలపై బండి సంజయ్ ఎలా స్పందించారు?

మరోసారి 'సీఎం సీఎం' అని నినాదాలు చేస్తే మైక్ బంద్ చేసి వెళ్లిపోతానని కార్యకర్తలను తీవ్రంగా మందలించారు. నిర్మల్ గడ్డ పూర్తిగా కాషాయ అడ్డా అని స్పష్టం చేశారు.

సీఏఏ (CAA), ఎన్ఆర్సీ (NRC)ల గురించి బండి సంజయ్ ఏమన్నారు?

సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు ఇలాగే ప్రవర్తిస్తే త్వరలోనే ఎన్ఆర్సీని తీసుకొస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో ఏ జెండా ఎగురుతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు?

తెలంగాణ గడ్డపై ఇకపై రంగు రంగుల జెండాలకు తావులేదని, ఎగరబోయేది ఒక్క కాషాయ జెండానే అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget