అన్వేషించండి

LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

LLR Online Test: ఇంటి నుంచే ఎల్ఎల్ఆర్ పొందేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ సాయంతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ రాసేందుకు వీలు కల్పిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వారం రోజుల్లో అమల్లోకి, రియల్ టైమ్ వెరిఫికేషన్ తప్పనిసరి.

LLR Online Test: కొత్తగా లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. లెర్నర్ లైసెన్స్ టెస్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా, ఇంటి నుంచే రాసేందుకు వీలు కల్పించేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 'సారథి న్యూ లెర్నర్ లైసెన్స్ పరీక్ష సిస్టమ్'ను, లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించనున్నారు.

ఏఐ ద్వారా పరీక్ష  

పరీక్షలో అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడనున్నారు. అభ్యర్థి స్థానంలో వేరొకరు పరీక్ష రాసినా, పరీక్ష సమయంలో అభ్యర్థి స్క్రీన్ ముందు లేకపోయినా ఏఐ వెంటనే గుర్తించి హెచ్చరిస్తుంది. దీనిని విజయవంతంగా పరీక్షించిన రవాణా శాఖ, వారం రోజుల్లోనే ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

పరీక్ష రాసే విధానం  

  1. ఆన్‌లైన్ పరీక్ష కోసం ప్రత్యేకమైన బ్రౌజర్‌తో పాటు రియల్ టైమ్ వెరిఫికేషన్ తప్పనిసరి.
  2. అభ్యర్థి తన అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
  3. ఎల్ఎల్ఆర్ పరీక్ష రాస్తున్న సమయంలో ఇతర వెబ్‌సైట్లు లేదా ట్యాబ్‌లు ఓపెన్ చేయడానికి వీలుండదు.
  4. ఫేషియల్ వెరిఫికేషన్ పలుమార్లు విఫలమైతే సిస్టమ్ ద్వారా ఓటీపీ వస్తుంది. ఆ సందర్భంలో అభ్యర్థి నేరుగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి పరీక్ష రాసుకోవాల్సి ఉంటుంది.

ప్రశ్నల సూచికలు  

  1. గ్రీన్ : ప్రశ్నకు సమాధానం గుర్తిస్తే.
  2. రెడ్ : ప్రశ్న చూశారు, కానీ సమాధానం రాయలేదు.
  3. వైట్ : ప్రశ్నను ఇంకా చూడలేదు.

పరీక్ష పూర్తయిన వెంటనే ఎన్ని సరైన సమాధానాలు రాశారో స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. పరీక్ష పాస్ అయిన వెంటనే క్యూఆర్ కోడ్ ఆధారిత ఎల్‌ఎల్‌ఆర్ డిజిటల్‌గా పొందుతారు.

Also Read: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !

ఎగ్జామ్ రాసేటప్పుడు 

  • ఆన్‌లైన్ పరీక్ష రాసేందుకు వెబ్‌క్యామ్ సౌకర్యం ఉన్న ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా స్పష్టమైన ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
  • ఫేషియల్ వెరిఫికేషన్ నిరంతరాయంగా జరగాలంటే అభ్యర్థి ముఖంపై తగినంత వెలుతురు ఉండే గదిలోనే కూర్చోవాలి.
  • ఆన్‌లైన్ ద్వారా పొందిన లెర్నర్ లైసెన్స్ పొందిన తేదీ నుంచి 6 నెలల (180 రోజులు) పాటు చెల్లుబాటు అవుతుంది. LLR వచ్చిన 30 రోజుల తర్వాత ఎప్పుడైనా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

    Also Read: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం

Frequently Asked Questions

ఆన్‌లైన్‌లో పొందిన లెర్నర్ లైసెన్స్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది?

ఆన్‌లైన్ ద్వారా పొందిన లెర్నర్ లైసెన్స్ 6 నెలల (180 రోజులు) పాటు చెల్లుబాటు అవుతుంది. ఎల్ఎల్ఆర్ వచ్చిన 30 రోజుల తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Meets Amit Shah: అమిత్ షాను కలిసిన చిరు, చరణ్... డీప్ ఫేక్ వీడియోలపై డిస్కషన్ - మెగా రిక్వెస్ట్
అమిత్ షాను కలిసిన చిరు, చరణ్... డీప్ ఫేక్ వీడియోలపై డిస్కషన్ - మెగా రిక్వెస్ట్
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
Amit Shah In Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిన టైమొచ్చింది, రాహుల్ ప్రధాని కాలేరు: అమిత్ షా
తెలంగాణలో కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిన టైమొచ్చింది, రాహుల్ ప్రధాని కాలేరు: అమిత్ షా
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
125 యూనిట్లు.. 6 నిమిషాలు! రికార్డు స్థాయిలో అమ్ముడైన Royal Enfield Classic 650 Hypershift స్పెషల్ ఎడిషన్
కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పెషల్‌ బైక్‌.. ఏంటి ప్రత్యేకత?
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
Embed widget