అన్వేషించండి

అథర్ రిజ్టా & చేతక్‌కు కొత్త పోటీ - సెప్టెంబర్ 2న రాబోతున్న సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్

సింపుల్ ఎనర్జీ తన తొలి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించనుంది. 'సింపుల్ అరైవ్' పేరుతో వచ్చే ఈ మోడల్ అథర్ రిజ్టా, TVS iQube & బజాజ్ చేతక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Simple Arrive family e-scooter: భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో పోటీ ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. యువత కోసం స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్న సింపుల్ ఎనర్జీ, ఇప్పుడు కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమైంది. కంపెనీ తన తొలి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సెప్టెంబర్ 2, 2026న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త స్కూటర్‌కు 'సింపుల్ అరైవ్' (Simple Arrive) అనే పేరును పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో రోడ్లపై టెస్టింగ్ సందర్భంగా ఈ స్కూటర్ కనిపించగా, ఇప్పుడు ఆవిష్కరణ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించడంతో విడుదలకు సమయం దగ్గరపడినట్లు స్పష్టమైంది.

ప్రస్తుతం సింపుల్ ఎనర్జీ విక్రయిస్తున్న సింపుల్ వన్ & సింపుల్ వన్S మోడళ్లు స్పోర్టీ డిజైన్‌తో యువతను ఆకట్టుకుంటున్నాయి. అయితే కొత్త అరైవ్ మాత్రం కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో రూపొందించినట్లు టెస్ట్ మోడల్ చిత్రాలు వెల్లడించాయి. పదునైన ఆకృతులకు బదులుగా గుండ్రని ఆకారంతో, సాంప్రదాయ స్కూటర్ రూపాన్ని ఈ మోడల్‌లో అందించే అవకాశం ఉంది.

ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ డిజైన్‌
టెస్టింగ్ సమయంలో కనిపించిన వివరాల ప్రకారం ఈ స్కూటర్‌లో పొడవైన ఫ్లాట్ సింగిల్ పీస్ సీటు ఉండనుంది. కుటుంబ సభ్యులు సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు, సెంటర్ స్టాండ్ కూడా ఇందులో ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!

బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో డిస్క్ బ్రేక్ & వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌ను అందించనున్నట్లు టెస్ట్ మోడల్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం సింపుల్ వన్ శ్రేణిలో రెండు చక్రాలకూ డిస్క్ బ్రేక్‌లు ఉన్నప్పటికీ, కొత్త అరైవ్‌లో ఖర్చును తగ్గిస్తూ రోజువారీ వినియోగానికి అనువైన సెటప్‌ను కంపెనీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు
ఈ స్కూటర్‌లో ముందు భాగంలో చిన్న స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, ఆధునిక TFT డిస్‌ప్లే కూడా ఉండనున్నాయి. హెడ్‌లైట్‌ను ఫ్రంట్ ఏప్రాన్‌పై అమర్చడంతో పాటు దాని పైన చిన్న విండ్ డిఫ్లెక్టర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు టెస్ట్ మోడల్ చిత్రాలు సూచిస్తున్నాయి.

ఇక సాంకేతికంగా కూడా ఈ స్కూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. హెవీ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ మోటార్లను వాణిజ్యపరంగా తయారు చేసిన తొలి భారతీయ OEMగా సింపుల్ ఎనర్జీ ఇటీవల ప్రకటించింది. ఇదే అత్యాధునిక మోటార్ టెక్నాలజీని కొత్త అరైవ్ స్కూటర్‌లో కూడా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తయారీ వ్యయం తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థపై ఆధారపడటం కూడా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బజాజ్ ఫెస్టివ్‌ ప్లాన్‌ - కొత్త పల్సర్ 125, పల్సర్ 150తో పాటు 10 కొత్త టూవీలర్ మోడళ్లు

మార్కెట్లోకి వచ్చిన తర్వాత సింపుల్ అరైవ్ నేరుగా అథర్ రిజ్టా, TVS iQube & బజాజ్ చేతక్ వంటి ప్రముఖ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. కుటుంబ వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక ఫీచర్లు & కొత్త టెక్నాలజీతో ఈ స్కూటర్‌ను కంపెనీ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం, స్కూటర్‌ ఆవిష్కరణ తేదీని మాత్రమే సింపుల్‌ ఎనర్జీ ప్రకటించింది. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, మోటార్ పవర్, ధర & పూర్తి ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ 2న జరిగే అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ కీలక వివరాలన్నీ వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మరో కొత్త పోటీకి తెరలేవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget