అన్వేషించండి

2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!

ఈ నెల 24న విడుదల కానున్న 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, లాంచ్‌కు ముందే పూర్తిగా లీకైంది. కొత్త 1.0 లీటర్ టర్బో ఇంజిన్, ADAS, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లతో కీలక అప్‌డేట్లు ఉన్నాయి.

2026 Maruti Brezza Facelift: భారత మార్కెట్లో, అత్యధికంగా ఎదురుచూస్తున్న కాంపాక్ట్ SUVల్లో మారుతి సుజుకీ బ్రెజ్జా 2026 ఒకటి. అధికారికంగా జులై 24న విడుదల కానున్న ఈ SUV, లాంచ్‌కు ముందే పూర్తిగా లీక్ అయింది. డీలర్‌షిప్ స్టాక్‌యార్డ్‌లో ఎలాంటి క్యామొఫ్లాజ్ లేకుండా కనిపించిన కొత్త బ్రెజ్జా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి కేవలం డిజైన్ మార్పులతోనే కాకుండా కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్, అధునాతన ఫీచర్లతో బ్రెజ్జా మరింత ఆకర్షణీయంగా మారింది.

2022లో రెండో తరం బ్రెజ్జా విడుదలైన తర్వాత వస్తున్న తొలి మిడ్ లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ఇదే. బయట కనిపించే మార్పులు పెద్దగా లేకపోయినా, ఫ్రంట్ గ్రిల్‌కు కొత్త గోల్డెన్ ఫినిష్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న గ్రే ఫినిష్ స్థానంలో ఇది మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ముందు బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేయగా, ఫాగ్ ల్యాంప్‌లను ట్రయాంగ్యులర్ హౌసింగ్‌లో అమర్చారు. హెడ్‌ల్యాంప్‌లు & LED DRLs మాత్రం యథాతథంగా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక భాగంలో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు.

ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు
క్యాబిన్‌లో మాత్రం గణనీయమైన అప్‌డేట్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను అందించారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అంబియంట్ లైటింగ్, కొత్త HVAC కంట్రోల్స్, డ్యాష్‌బోర్డ్ & డోర్ ప్యాడ్‌లపై గ్లోస్ బ్లాక్ ఫినిష్ వంటి మార్పులు క్యాబిన్‌కు మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.

ఇది కూడా చదవండి: రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు

భద్రత పరంగా కూడా బ్రెజ్జా ఒక అడుగు ముందుకేసింది. తొలిసారిగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లు అందించనుండగా, Level 2 ADAS సూట్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అడాప్టివ్ సేఫ్టీ ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు ఇది మరింత ఆకర్షణీయంగా మారనుంది.

ఇంజిన్ ఆప్షన్లలో అతి పెద్ద
అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్‌లో అతి పెద్ద మార్పు ఇంజిన్ విభాగంలోనే ఉంది. కొత్తగా 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను మారుతి అందిస్తోంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఉన్నప్పటికీ, బ్రెజ్జాలో ఇది మరింత శక్తివంతమైన ట్యూనింగ్‌తో రానుంది. మూడు సిలిండర్ల ఈ ఇంజిన్ సుమారు 110 హెచ్‌పీ పవర్ & 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్‌గా 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

ఈ కొత్త టర్బో ఇంజిన్‌తో బ్రెజ్జాకు మరో కీలక ప్రయోజనం కూడా లభించనుంది. సబ్ 4 మీటర్ల పన్ను నిబంధనలకు అనుగుణంగా మారడం వల్ల ధరను పోటీ స్థాయిలో ఉంచేందుకు మారుతికి అవకాశం లభిస్తుంది. దీంతో బ్రెజ్జా ధరలు మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: దేశంలోనే అత్యంత చౌకైన 7 సీటర్ కారు, 2026లో బెస్ట్ సెల్లింగ్ కార్‌ ధర, ఫీచర్లు

కొత్త టర్బో ఇంజిన్‌తో పాటు ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా కొనసాగనుంది. ఇది 103 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తోనే CNG వేరియంట్ కూడా కొనసాగనున్నప్పటికీ, ఇందులో విక్టోరిస్ తరహా అండర్‌బాడీ CNG ట్యాంక్ సెటప్‌ను అందించే అవకాశం ఉంది. దీంతో బూట్ స్పేస్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

ధరలు
ప్రస్తుతం బ్రెజ్జా ఎక్స్ షోరూమ్ ధర రూ.8.26 లక్షల నుంచి రూ.12.86 లక్షల వరకు ఉంది. కొత్త టర్బో ఇంజిన్ & అధునాతన ఫీచర్లు వచ్చినప్పటికీ, సబ్ 4 మీటర్ల ట్యాక్స్ ప్రయోజనం కారణంగా ధరను పెద్దగా పెంచే అవకాశం లేదు. కొత్త బ్రెజ్జా విడుదలైన తర్వాత హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ & కియా సైరస్ వంటి SUVలకు పోటీగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget