అన్వేషించండి

కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!

మారుతి సుజుకీ మరోసారి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈసారి, మోడల్‌ను బట్టి రూ.30,000 వరకు ధరలు పెరగనున్నాయి.

Maruti Suzuki to hike prices: కొత్త మారుతి సుజుకీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాదిలో పలుమార్లు ధరలను పెంచిన ఈ కార్ల కంపెనీ, మరోసారి ప్రైస్‌ హైక్‌ ప్రకటించింది. ఆగస్టు 2026 నుంచి రేట్లు పెంచబోతోంది. కంపెనీ నిర్ణయంతో, మారుతి సుజుకి కార్ల ధరలు మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.30,000 వరకు పెరగనున్నాయి. కాబట్టి, కొత్త కారు కొనాలనుకునేవారు ఈ నెలలోనే, ధరలు పెరగకముందే బుకింగ్ చేసుకోవడం బెటర్‌.

ఈ ఏడాదిలో మారుతి సుజుకీ ధరలు పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. జూన్‌లో కూడా ఈ కంపెనీ అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.30,000 వరకు ధరలను పెంచింది. ఇప్పుడు కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి అదే స్థాయిలో ధరల పెంపు ప్రకటించడం మార్కెట్లో చర్చనీయాంశమైంది.

ధరల పెంపునకు కారణాలేంటి?
ధరల పెంపుపై స్టాక్ ఎక్స్చేంజ్‌లకు సమర్పించిన నివేదికలో కంపెనీ స్పష్టమైన కారణాలను వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతుండటం, ఉత్పత్తి వ్యయం అధికమవడం, కమోడిటీ ధరల్లో ద్రవ్యోల్బణం కొనసాగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

అంతేకాదు, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు అంతర్గతంగా కొన్ని చర్యలు చేపట్టామని, తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు కూడా చేశామని కంపెనీ పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ వ్యయాలపై ఒత్తిడి తగ్గకపోవడంతో మొత్తం భారం భరించడం సాధ్యం కాలేదని, అందులో కొంత భాగాన్ని మాత్రమే వినియోగదారులపై మోపుతున్నామని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!

ఏ మోడల్‌కు ఎంత పెంపు?
2026 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చే ధరల పెంపు అన్ని మోడళ్లకు ఒకేలా ఉండదు. ఏ మోడల్, ఏ వేరియంట్ అనేదాన్ని బట్టి ధరల సవరణ ఉంటుంది. కొన్ని వేరియంట్‌లలో స్వల్ప పెరుగుదల ఉండగా, మరికొన్నింటిలో గరిష్ఠంగా రూ.30,000 వరకు పెరగనుంది. ఏ మోడల్‌ రేటు ఎంత పెరిగిందనేది కంపెనీ త్వరలోనే ప్రకటిస్తుంది.

ఇటీవల, ఆటోమొబైల్ రంగంలో వరుసగా ధరల పెంపులు కొనసాగుతున్నాయి. ముడి పదార్థాల ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు, తయారీ వ్యయాల పెరుగుదల కారణంగా ప్రముఖ కంపెనీలు ధరలను సవరిస్తున్నాయి. మారుతి సుజుకీతో పాటు మహీంద్రా, బీవైడీ, టాటా మోటార్స్ వంటి సంస్థలు కూడా ఇటీవల తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: మారుతి ఎర్టిగా EMI లెక్కలు ఏంటీ? ఎంత శాలరీ ఉంటే కొనుక్కోవచ్చు? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైస్ ఎంత?

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన మారుతి సుజుకీ ధరలు పెంచడం వల్ల ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి ప్రీమియం SUVల వరకు అన్ని విభాగాల కొనుగోలుదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్నాళ్లు ఆగిన తర్వాత కొత్త కారు కొందామనే ప్లాన్‌లో ఉన్నవాళ్లు, ఆగస్టు ధరల పెంపు అమల్లోకి రాకముందే బుకింగ్ పూర్తి చేస్తే కొంత మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Maruti Victoris S-CNG.. రూ.1 లక్ష ఎక్కువైనా ఎందుకు కొనాలి? మైలేజీతో లెక్క మారిపోతుంది!
మారుతి విక్టోరిస్‌ S-CNG రియల్‌ వరల్డ్‌ రివ్యూ.. మైలేజీ అదిరిపోయింది, మీ డబ్బు ఆదా!
BMW F 450 GS బైక్‌ రియల్‌ వరల్డ్‌ టెస్ట్.. 100km వేగం కేవలం 5.72 సెకన్లలో!
BMW కారే కాదు, బైక్‌ కూడా మామూలుగా లేదుగా.. లైఫ్‌లో ఒక్కసారైనా నడపాల్సిందే
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget