అన్వేషించండి

India Public EV Charging Stations: ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!

భారత్‌లో పెట్రోల్ పంపులు మాదిరిగానే ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్ విస్తరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు పార్లమెంట్‌లో వెల్లడించింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వలె ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు.
  • ప్రభుత్వం 52,718 ఛార్జింగ్ స్టేషన్లు, 16,561 హైస్పీడ్ ఛార్జర్లను గుర్తించింది.
  • ఫేమ్-2, పీఎం ఈ-డ్రైవ్ కింద వేల కోట్ల నిధులు కేటాయింపు.
  • ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిబంధనలు సరళీకృతం, డీలైసెన్స్ ప్రకటించారు.

India Public EV Charging Stations: భారత్‌లో రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇంకా కొనే ఆలోచన చాలా మందికి ఉన్నప్పటికీ ఛార్జింగ్ స్టేషన్లు అన్ని ప్రాంతాల్లో లేవనే ఆలోచన వారిని వెనక్కి లాగుతోంది.. అందుకే చాలా మంది ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు.  అయితే దీనిపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక విషయాలు పంచుకుంది. ఇప్పుడు పెట్రోల్ పంపులు ఉన్నట్టుగానే దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొంది. 

కేంద్రం చెప్పిన వివరాలు ప్రకారం ఇప్పటికే 52,700  ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దీన్ని మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. 

లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ భారీ పరిశ్రమల  శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ దేశంలోని ఈవీ మౌలిక సదుపాయాలను వివరించారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 52, 718 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఫోర్‌వీల్ డ్రైవ్ కార్ల యజమానుల కోసం అతి పెద్ద ఊరట ఏంటంటే, ఈ స్టేషన్‌లలో 16, 561 స్టేషన్‌లలో కార్ల కోసం హైస్పీడ్‌ లేదా పాస్ట్ ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీని వల్ల హైవేల, నగరాల్లో డ్రైవర్లు సుదూర ప్రయాణం చేసేటప్పుడు విలువైన సమయం ఆదా అవ్వడమే కాక, ఇబ్బందులు కూడా తగ్గుతాయి. 

దేశంలోని ప్రతి మూలకూ ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించడానికి శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్రం చెప్పింది. ఫేమ‌-2 పథకం కింద భారీగా పరిశ్రమల మంత్రిత్వశాఖ 912.50 కోట్లను ఆమోదించినట్టు పార్లమెంట్‌కు తెలియజేసింది. అదనంగా కొత్త పీఎం ఇ- డ్రైవ్‌ పథకం కింద కేవలం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసమే రెండు వేల కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ప్రధాన నగరాల్లో , రద్దీగా ఉండే రాష్ట్ర రహదారులపై నిరాటంకమైన ఛార్జింగ్ పాయింట్లను అందించడమే ఈ భారీ పెట్టుబడి లక్ష్యం. 

ఛార్జింగ్ స్టేషన్లను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు!

ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, రూల్స్‌ను కూడా సరళీకరించిందని గమనించాలి. విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును డీలైసెన్స్‌ కార్యకలాపంగా ప్రకటించారు. 

అంటే ఇప్పుడు ఏ ప్రైవేటు పారిశ్రామికవేత్త లేదా వ్యాపార వేత్త అయినా ఎలాంటి సంక్లిష్టమైన పత్రాలతో పని లేకుండా తమ సొంత ఛార్జింగ్ స్టేషన‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్ల అమ్మకాలు, తయారీని ప్రోత్సహించడానికి ఆటో పీఎల్‌ఐ పథకం కింద 13శాతం నుంచి 18శాతం వరకు ఆర్థిక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. 

Frequently Asked Questions

భారత్‌లో ప్రస్తుతం ఎన్ని EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి?

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 52,718 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 16,561 స్టేషన్లలో కార్ల కోసం హైస్పీడ్ ఛార్జర్లు ఏర్పాటు చేయబడ్డాయి.

EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?

ఫేమ్-2 పథకం కింద ₹912.50 కోట్లు, కొత్త పీఎం ఇ-డ్రైవ్ పథకం కింద ₹2000 కోట్లు కేటాయించారు. ప్రధాన నగరాలు, రాష్ట్ర రహదారులపై నిరాటంకమైన ఛార్జింగ్ పాయింట్లను అందించడం లక్ష్యం.

ప్రైవేట్ వ్యక్తులు EV ఛార్జింగ్ స్టేషన్‌ను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చా?

అవును, విద్యుత్ మంత్రిత్వ శాఖ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును డీలైసెన్స్ కార్యకలాపంగా ప్రకటించింది. దీంతో ఎలాంటి సంక్లిష్ట పత్రాలు లేకుండా ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు సొంత ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
కొత్త హ్యుందాయ్ వెర్నా కోసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే EMI ఎంత మారుతుంది?
Hyundai Verna EMI: రూ.15,000 లోపు EMIతో హ్యుందాయ్‌ వెర్నా కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి?
మీ హెల్మెట్‌ వైజర్‌ పొగమంచుతో మసకబారుతోందా? పిన్‌లాక్‌ గురించి ప్రతి బైక్‌ రైడర్‌ ఈ విషయాలు తెలుసుకోవాలి
పిన్‌లాక్‌ ఉంటే చలికాలంలో కూడా మీ హెల్మెట్‌ వైజర్‌ మీద ఫాగ్‌ పేరుకుపోదు! ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసా?
Car Polish vs Wax: కారు మెరుపు కోసం పాలిష్ మాత్రమే సరిపోదు! పెయింట్ రక్షణకు వ్యాక్స్ కూడా అవసరమే!
కారు పాలిష్ చేయాలా.. వ్యాక్స్ వేయాలా? తేడా ఇదే.. ముందుగా ఏది చేయాలో తెలుసుకోండి
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget