అన్వేషించండి

టయోటా టైసర్ ప్లస్‌లు & మైనస్‌లు ఇవే - కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ఈ SUVలో ఉన్న 3 ప్రధాన ప్రయోజనాలు, 2 ముఖ్యమైన లోపాలు, ఇంజిన్, ఫీచర్లు, కంఫర్ట్ & డ్రైవింగ్ అనుభవంపై పూర్తి వివరాలు తెలుసుకోండి.

Toyota Taisor Price And Features: భారత మార్కెట్లో టయోటా బ్రాండ్‌కు చెందిన అత్యంత అందుబాటు ధర SUVగా టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ నిలుస్తోంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారంగా ఈ మోడల్‌ను డిజైన్‌ చేశారు. అయితే, ఈ SUVని కొనుగోలు చేసే ముందు దీని బలాలు ఏంటి? లోపాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. 

బలాలు

మొదటి ప్రధాన బలం శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇందులో 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్ అందించారు. ఇది 100 hp పవర్ & 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. చిన్న ఇంజిన్ అయినప్పటికీ పనితీరు పరంగా చాలా ఉత్సాహంగా స్పందిస్తుంది. 6,000 rpm వరకు సాఫీగా రేవ్ అవుతూ మంచి పవర్ డెలివరీని అందిస్తుంది. నగరంలోనూ, హైవేపైనా డ్రైవింగ్‌ను ఎంతో సరదాగా మార్చుతుంది.

ఈ ఇంజిన్‌కు జతగా వచ్చే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరో ప్రత్యేకత. ఇది G & V వేరియంట్లలో లభిస్తుంది. గేర్ మార్పులు చాలా సాఫీగా ఉండటంతో పాటు స్టీరింగ్‌పై ఉన్న ప్యాడిల్ షిఫ్టర్లకు వేగంగా స్పందిస్తుంది. మాన్యువల్ మోడ్‌లో డ్రైవర్ కోరుకునే వరకు గేర్‌ను ఆటోమేటిక్‌గా మార్చకపోవడం వల్ల డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. పరీక్షల్లో ఈ SUV 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 11.86 సెకన్లలో అందుకుంది.

ఇది కూడా చదవండి: అథర్ రిజ్టా & చేతక్‌కు కొత్త పోటీ - సెప్టెంబర్ 2న రాబోతున్న సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్

రెండో ప్రధాన బలం హ్యాండ్లింగ్. తక్కువ వేగంలో సస్పెన్షన్ కొద్దిగా గట్టిగా అనిపించినా, వేగం పెరిగే కొద్దీ వాహనం చాలా స్థిరంగా ఉంటుంది. హైవేపై మూడు అంకెల వేగంతో ప్రయాణించినా మంచి నమ్మకాన్ని కలిగిస్తుంది. తేలికైన స్టీరింగ్ కారణంగా నగర ట్రాఫిక్‌లో లేన్ మార్పులు & పార్కింగ్ సులభంగా చేయవచ్చు. చిన్న టర్నింగ్ రేడియస్ కూడా డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.

మూడో ప్రధాన బలం కంఫర్ట్ & ఎర్గోనామిక్స్. డ్రైవర్ సీటు అడ్జస్ట్‌మెంట్‌తో పాటు స్టీరింగ్‌కు టిల్ట్ & టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ ఉండటం వల్ల సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్‌ను సులభంగా పొందవచ్చు. అన్ని కంట్రోల్స్ అందుబాటులో ఉండటంతో పాటు డ్రైవర్ కోసం అడ్జస్టబుల్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కూడా ఉంది.

వెనుక సీట్లు కూడా విశాలంగా ఉండటంతో ప్రయాణికులకు మంచి లెగ్‌రూమ్ లభిస్తుంది. వెనుక AC వెంట్స్, USB Type C పోర్టులు, మూడు హెడ్‌రెస్టులు, మూడు పాయింట్ల సీట్‌బెల్ట్‌లు వంటి ఫీచర్లు సౌకర్యం & భద్రతను పెంచుతాయి. 360 డిగ్రీ కెమెరా కూడా ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్‌ను సులభతరం చేస్తుంది.

ఇది కూడా చదవండి: E20 కాదు, కలుషిత ఇంధనమే అసలు సమస్య? - పెట్రోల్ బంకులపై స్వతంత్ర తనిఖీలకు ఆటోమొబైల్‌ కంపెనీల డిమాండ్

లోపాలు

టైసర్‌లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మొదటిది ఫీచర్ల కొరత. 360 డిగ్రీ కెమెరా ఉన్నప్పటికీ దాని రిజల్యూషన్ అంతగా మెరుగ్గా లేదు. ముఖ్యంగా రాత్రి సమయంలో లేదా వర్షంలో స్పష్టత తగ్గుతుంది. పవర్డ్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, LED అంబియంట్ లైటింగ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, లెదరెట్ అప్హోల్స్టరీ, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ADAS, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఇందులో లేవు. ఈ విషయంలో కొన్ని ప్రత్యర్థి SUVలు మెరుగైన పరికరాలను అందిస్తున్నాయి.

రెండో లోపం క్యాబిన్ నాణ్యత. లోపల ఎక్కువ భాగంలో హార్డ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వల్ల ప్రీమియం అనుభూతి కొంత తగ్గుతుంది. అలాగే రోడ్డుపై నుంచి వచ్చే శబ్దం & ఇంజిన్ శబ్దం క్యాబిన్‌లోకి ఎక్కువగా వినిపించడం మరో మైనస్. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని కొత్త కాంపాక్ట్ SUVలు ఈ విషయంలో టైసర్ కంటే మెరుగైన ఇన్సులేషన్‌ను అందిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ మంచి పనితీరు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ & విశ్వసనీయమైన ఇంజిన్ కోరుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. అయితే అత్యాధునిక ఫీచర్లు & మరింత ప్రీమియం క్యాబిన్ అనుభూతి కోరుకునేవాళ్లు ప్రత్యర్థి మోడళ్లతో పోల్చి నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Embed widget