Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vijaya Dairy Milk Price Hike | రవాణా, ప్యాకేజింగ్ వ్యయాల పెరిగిన క్రమంలో విజయ డెయిరీ పాల ధరలను పెంచింది. లీటరుకు కాకుండా అర లీటరుపై రూపాయి చొప్పున పెరిగిన ధరలు అక్టోబర్ 17 నుంచి అమల్లోకి వస్తాయి.

Vijaya Dairy Telangana Increases Milk Prices Effective From October 17
హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ ప్రభుత్వ రంగానికి చెందిన విజయ డెయిరీ తమ పాల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన లీజింగ్, రవాణా, ప్యాకేజింగ్ ఖర్చులతో ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పాల ధరలు అక్టోబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. అంటే అక్టోబర్ 16 రాత్రి నుంచి సప్లైలకు కొత్త ధరలు వర్తించనున్నాయని ఆ ప్రకటనలో తెలిపింది.

ఈ విడతలో విజయ డెయిరీ ముఖ్యంగా స్టాండర్డైజ్డ్ మిల్క్, హోల్ మిల్క్ రకాలపై ధరలను సవరించింది. లీటరు చొప్పున కాకుండా ప్రతీ 500 ఎంఎల్ (అర లీటరు) ప్యాకెట్‌పై రూ. 1 చొప్పున పెంచారు. దీని ప్రకారం, ఇప్పటివరకు రూ.34కి లభించే 500 ఎంఎల్ స్టాండర్డైజ్డ్ మిల్క్ ప్యాకెట్ ధర ఇకపై రూ.35 అవుతుంది. రూ.39గా ఉన్న 500 ఎంఎల్ హోల్ మిల్క్ ప్యాకెట్ ధర రూ.40 అయింది. దాంతో వినియోగదారులు అక్టోబర్ 17 నుంచి ఈ కొత్త సవరించిన ధరల ప్రకారమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నెంబర్ 040 27019851, 27019854 లలో సంప్రదించాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు























