Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకున్న వివాదాస్పద విచిత్ర రనౌట్‌పై భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఎట్టకేలకు స్పందించాడు. నాల్గో టీ20కి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన తిలక్, ఆ క్షణంలో మైదానంలో ఏం జరిగిందో స్పష్టంగా వివరించాడు.
భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్లో గుడాకేశ్ మోతీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ కమిల్ పూరన్ డైవ్ చేసి బంతిని అద్భుతంగా ఆపాడు. అయితే ఆ బంతి ఫోర్ వెళ్ళిపోయిందని భావించిన తిలక్, అక్షర్ ఇద్దరూ నిర్లక్ష్యంగా క్రీజు వీడి బయటకు నడుచుకుంటూ వచ్చారు. పూరన్ వేసిన త్రో అక్షర్ ఎండ్‌కు రావడంతో అతడు గమనించి వెంటనే క్రీజులోకి చేరిపోయాడు.
కానీ బంతి ఫోర్ వెళ్లిందని భావించి అటువైపు చూడని తిలక్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్ మోతీ బెయిల్స్ ఎగరగొట్టే సమయానికి అసలు ఫ్రేమ్‌లోనే లేకపోవడంతో 28 పరుగుల వద్ద దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. "మేమిద్దరం అది ఫోర్ అనుకున్నాం. అక్షర్ బంతిని చూసి క్రీజులోకి వెళ్లాడు, నేను బంతిని చూడకపోవడంతో నడుచుకుంటూ వెళ్లిపోయా" అని తిలక్ వివరణ ఇచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు






















