అన్వేషించండి

E20 కాదు, కలుషిత ఇంధనమే అసలు సమస్య? - పెట్రోల్ బంకులపై స్వతంత్ర తనిఖీలకు ఆటోమొబైల్‌ కంపెనీల డిమాండ్

E20 ఇంధనం అమలైన తర్వాత వాహనాల్లో స్టాలింగ్ & స్టార్టింగ్ సమస్యలు పెరగడంతో పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యతను స్వతంత్రంగా పరీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆటో కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

E20 Fuel Concerns: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగం విస్తరించిన తర్వాత కొంతమంది వాహన యజమానులు స్టాలింగ్, స్టార్ట్ కావడంలో ఇబ్బందులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధన నాణ్యతను స్వతంత్రంగా పరీక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, అసలు సమస్య E20 ఇంధనంలో లేదని, E20కు అనుగుణంగా రూపొందించిన వాహనాల్లో ఈ ఇంధనం సక్రమంగానే పనిచేస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే కలుషితమైన లేదా కల్తీ అయిన ఇంధనమే వాహనాల్లో తలెత్తుతున్న సమస్యలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నాయి. ఇదే ఆందోళనను పలువురు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

E20 ఇంధనంలో తేమ & క్లోరైడ్
ఇటీవల వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై నిర్వహించిన పరిశీలనల్లో కొన్ని ఇంధన నమూనాల్లో తేమ & క్లోరైడ్ స్థాయులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎథనాల్‌లో ఉండే నీటిని సులభంగా పీల్చుకునే లక్షణం.

ఇది కూడా చదవండి: ఫుల్ ఛార్జ్‌పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్

E20 కోసం తగిన నిల్వ ఏర్పాట్లు లేవు
ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో ఉన్న భూగర్భ నిల్వ ట్యాంకులు & పైప్‌లైన్లు సాధారణ పెట్రోల్ కోసం రూపొందించబడ్డాయి. అధిక ఎథనాల్ మిశ్రమం కలిగిన ఇంధనాన్ని నిల్వ చేయడానికి అవసరమైన మార్పులు చాలాచోట్ల ఇంకా చేయలేదు. వర్షపు నీరు, గాలిలోని తేమ, కండెన్సేషన్ లేదా ఇంధనాన్ని సరఫరా చేసే ట్యాంకర్ల ద్వారా కూడా నీరు నిల్వ ట్యాంకుల్లోకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

భూగర్భ ట్యాంకులో నీటి శాతం 0.5 శాతానికి మించి పెరిగితే ఎథనాల్ నీటితో కలిసి పెట్రోల్ నుంచి విడిపోతుంది. దీనినే 'ఫేజ్ సెపరేషన్' అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో పైభాగంలో పెట్రోల్ & అడుగుభాగంలో నీరు-ఎథనాల్ మిశ్రమం ఏర్పడుతుంది. ట్యాంకు దిగువ భాగం నుంచి ఇంధనం తీసుకున్న వాహనాల్లోకి ఈ నీటి మిశ్రమం వెళ్లే అవకాశం ఉండటంతో ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

అంతేకాకుండా, మైల్డ్ స్టీల్‌తో తయారైన పాత నిల్వ ట్యాంకులు & పైప్‌లైన్లు అధిక ఎథనాల్ మిశ్రమం కారణంగా తుప్పు పట్టే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఇంధన నాణ్యత మరింత దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఇంధన నాణ్యతను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే తనిఖీ చేస్తున్న విధానాన్ని మార్చాలని ఆటో పరిశ్రమ కోరుతోంది. ఇంధనాన్ని తయారు చేసే సంస్థలే దాని నాణ్యతను పరీక్షించడం సరైన విధానం కాదని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనం ఉందో లేదో స్వతంత్ర సంస్థ పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

BIS మార్గదర్శకాల ప్రకారం E20 ఇంధనంలో అదనపు డిటర్జెంట్లు, డిస్పర్సెంట్లు, సిలికాన్, క్లోరిన్ ఆధారిత పదార్థాలు లేదా లోహ ఆధారిత యాడిటివ్‌లు ఉండకూడదు.

గత రెండేళ్లలో దేశంలో పెట్రోల్‌లో కలిపే ఎథనాల్ పరిమాణం దాదాపు రెట్టింపు అయింది. అయితే ఇంధనంలో ఎథనాల్ శాతం పెరిగినా, దానికి అనుగుణంగా నిల్వ ట్యాంకులు, పైప్‌లైన్లు, రవాణా వ్యవస్థలను ఆధునికీకరించలేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్లే కలుషిత ఇంధనం ఘటనలు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టాలంటే పెట్రోల్ బంకుల వద్ద క్రమం తప్పకుండా నాణ్యత పరీక్షలు నిర్వహించే స్వతంత్ర వ్యవస్థ అత్యవసరమని ఆటో పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
కొత్త బైక్ కొనేవాళ్లకు అదిరిపోయే అప్‌డేట్.. క్విక్‌షిఫ్టర్, క్రూయిజ్ కంట్రోల్‌తో వచ్చిన Xtreme 250R Carbon
దసరా కానుకగా Hero Xtreme 250R Carbon.. TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో కొత్త బైక్ లాంచ్‌
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget