అన్వేషించండి

మగవాళ్ల కంటే ఆడవాళ్లే బెస్ట్‌ డ్రైవర్లు - రాత్రి 9-10 గంటల మధ్య డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం!

ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ 2026 ప్రకారం, మహిళల డ్రైవింగ్ స్కోర్ పురుషుల కంటే స్వల్పంగా మెరుగ్గా ఉంది. ఆకస్మిక బ్రేకింగ్ & వేగవంతమైన యాక్సిలరేషన్ ప్రధాన ప్రమాదకర అలవాట్లుగా తేలాయి.

Women Are Better Drivers Than Men: భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్త. రోజు మొత్తంలో ఇదే అత్యంత ప్రమాదకర సమయమని తాజా అధ్యయనం వెల్లడించింది. జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (IRSR) 2026 ప్రకారం, రాత్రి 8 గంటల తర్వాత డ్రైవింగ్ నాణ్యత గణనీయంగా తగ్గుతుండగా, 9 నుంచి 10 గంటల మధ్య ప్రమాదాల అవకాశాలు అత్యధికంగా ఉంటున్నాయి.

జునో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన టెలిమెట్రీ డేటా ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో నమోదైన 45 లక్షల ప్రయాణాలు & సుమారు 5.5 కోట్ల కిలోమీటర్ల డ్రైవింగ్ డేటాను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా పరిశీలించారు.

ఈ అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పురుషుల కంటే మహిళలే మెరుగైన డ్రైవర్లు అనే అభిప్రాయానికి ఈ నివేదిక బలం చేకూర్చింది. మహిళలు సగటున 92.86 డ్రైవింగ్ స్కోర్ సాధించగా, పురుషులు 92.43 స్కోర్ నమోదు చేశారు. ఈ తేడా చాలా స్వల్పమే అయినప్పటికీ, మహిళలు కొద్దిగా మెరుగైన డ్రైవింగ్ అలవాట్లు ప్రదర్శించినట్లు నివేదిక పేర్కొంది. దీంతో "పురుషులే మంచి డ్రైవర్లు" అనే సాధారణ అభిప్రాయానికి ఈ అధ్యయనం భిన్నమైన చిత్రాన్ని చూపించింది.

డ్రైవింగ్ అలవాట్లే ప్రమాదాలకు కారణం
అయితే రోడ్డు ప్రమాదాలకు కారణం వయస్సు, లింగం వంటి అంశాల కంటే... డ్రైవర్‌ సీట్‌లో ఉన్నవారి డ్రైవింగ్ అలవాట్లే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 80 శాతానికి పైగా డ్రైవింగ్ అలవాట్లే కారణమని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: నార్టన్ అట్లాస్ ఫస్ట్ రైడ్ - 585cc ట్విన్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో ఈ బండి మామూలుగా లేదుగా!

భారత డ్రైవర్లలో ఎక్కువగా కనిపిస్తున్న రెండు ప్రమాదకర అలవాట్లను కూడా ఈ నివేదిక గుర్తించింది. ఆకస్మికంగా బ్రేక్ వేయడం అత్యంత బలహీనమైన డ్రైవింగ్ లక్షణంగా నిలిచింది. దీనికి కేవలం 87 స్కోర్ మాత్రమే నమోదైంది. అలాగే ఒక్కసారిగా వేగం పెంచడం లేదా హార్ష్ యాక్సిలరేషన్ కూడా ప్రధాన సమస్యగా తేలింది. దీనికి 91 స్కోర్ లభించింది. ఈ రెండు అలవాట్లు ప్రమాదాల అవకాశాలను గణనీయంగా పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సీజన్‌తో సంబంధం లేని డ్రైవింగ్‌ నాణ్యత 
ఆశ్చర్యకరంగా వర్షాకాలం, చలికాలం వంటి సీజన్లు డ్రైవింగ్ నాణ్యతపై పెద్దగా ప్రభావం చూపలేదని అధ్యయనం తెలిపింది. భారీ వర్షాలు లేదా మంచు ఉన్న కాలాల్లో కూడా డ్రైవింగ్ స్కోర్లు ఏడాది పొడవునా దాదాపు ఒకే స్థాయిలో కొనసాగినట్లు జునో జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. అంటే వాతావరణం కంటే డ్రైవర్ ప్రవర్తనే రోడ్డు భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇక దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పరిస్థితి మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 1.73 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం రోడ్డు మరణాల్లో దాదాపు 11 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. దీని వల్ల దేశ GDPలో 3 నుంచి 5 శాతం వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బైక్‌ల్లో ఒకే ఇంజిన్ - కానీ మీకు సరిపోయే మోడల్‌ ఏది? పూర్తి వివరాలు

బైక్ రైడర్ల మరణాలే ఎక్కువ
రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే బలవుతున్నారు. మొత్తం రోడ్డు మరణాల్లో 44 శాతం బైక్ రైడర్లవే కాగా, 19 శాతం మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రోడ్డు భద్రత విషయంలో మౌలిక వసతుల అభివృద్ధి ఒక్కటే సరిపోదని, డ్రైవర్ల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమని జునో జనరల్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO షనాయ్ ఘోష్ అభిప్రాయపడ్డారు.

2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలన్న స్టాక్‌హోమ్ డిక్లరేషన్ లక్ష్యాన్ని భారత్ సాధించాలంటే ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ఆకస్మిక బ్రేకింగ్ & అధిక వేగం వంటి ప్రమాదకర అలవాట్లను తగ్గించడం అత్యంత కీలకమని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
33 కి.మీ మైలేజ్ ఇచ్చే Alto K10 కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ. 3.70 లక్షలు.. దీని ఫీచర్లు చూశారా
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
కొత్త ఎలక్ట్రిక్‌ బైకులు తీసుకురాబోతున్న హీరో - డైలీ యూజ్‌ కోసం, అడ్వెంచర్ల కోసం కూడా!
హీరో ఎలక్ట్రిక్‌ బైకులు త్వరలో రాబోతున్నాయి.. డబ్బులతో రెడీగా ఉండండి
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget