అన్వేషించండి

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!

యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు ప్రకటించింది. FZ సిరీస్‌పై రూ.5,999 వరకు బీమా ప్రయోజనం, తక్కువ డౌన్ పేమెంట్, మోడల్ వారీగా పూర్తి వివరాలు తెలుసుకోండి.

Yamaha Festive Offers 2026: ఈ పండుగ సీజన్‌లో కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నవాళ్లకు శుభవార్త. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా.. తన బైక్‌లు, స్కూటర్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై బీమా ప్రీమియం ప్రయోజనాలతో పాటు తక్కువ డౌన్ పేమెంట్, సులభమైన ఫైనాన్స్ సదుపాయాలను అందిస్తోంది. కొన్ని మోడళ్లపై రూ.5,999 వరకు బీమా ప్రయోజనం పొందవచ్చు. అయితే అన్ని బైక్‌లకు ఒకే రకమైన ఆఫర్లు లేవు. ఏ మోడల్‌పై ఎంత ప్రయోజనం లభిస్తుందో తెలుసుకుందాం.

FZ సిరీస్‌పై అత్యధిక ప్రయోజనం

యమహా ప్రకటించిన ఆఫర్లలో FZ సిరీస్‌కు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ సిరీస్‌లోని ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5,999 బీమా ప్రయోజనం అందిస్తున్నారు. డౌన్ పేమెంట్ కేవలం రూ.3,900 నుంచి ప్రారంభమవుతుంది.

FZ సిరీస్‌లో FZ-S Fi Hybrid, FZ-S Fi, FZ-S Fi V4 DLX, FZ-S Fi V4, FZ Rave, FZ-Fi, FZ Blue Flex మోడళ్లు ఉన్నాయి. ఈ మోడళ్లలో ఎంపిక చేసిన వాహనాల కొనుగోలుపై పండుగ ఆఫర్లు వర్తిస్తాయి.

స్కూటర్లపై ఎలాంటి ఆఫర్లు?

Yamaha Fascino 125, RayZR 125 స్కూటర్లపై కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు స్కూటర్ల కొనుగోలుపై కనీసం రూ.3,399 బీమా ప్రయోజనం లభిస్తుంది. డౌన్ పేమెంట్ రూ.2,499 నుంచి ప్రారంభమవుతుంది.

తక్కువ ప్రారంభ చెల్లింపుతో స్కూటర్ కొనాలని భావించేవారికి ఈ ఆఫర్లు ఉపయోగపడవచ్చు. బీమా ప్రయోజనం, ఫైనాన్స్ సదుపాయాలు వినియోగదారుల అర్హత, డీలర్‌షిప్ నిబంధనల ఆధారంగా మారవచ్చు.

ఇది కూడా చదవండి: Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?

XSR155పై రూ.5,555 బెనిఫిట్

XSR155 బైక్ కొనుగోలుపై రూ.5,555 బీమా ప్రయోజనాన్ని యమహా అందిస్తోంది. ఈ బైక్‌కు డౌన్ పేమెంట్ రూ.4,999 నుంచి ప్రారంభమవుతుంది. ప్రత్యేక లుక్‌, ఆధునిక ఫీచర్లు ఉన్న బైక్‌ను కొనాలనుకునేవారు ఈ ఆఫర్‌ను పరిశీలించవచ్చు.

R15, MT-15 కొనేవారికి ముఖ్య గమనిక

యమహా R15, MT-15 మోడళ్లపై బీమా ప్రీమియంలో ప్రత్యేక ప్రయోజనం లేదు. అయితే ఈ రెండు బైక్‌లను రూ.4,999 ప్రారంభ డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఈ మోడళ్లపై ప్రయోజనం ప్రధానంగా తక్కువ ప్రారంభ చెల్లింపు రూపంలోనే ఉంటుంది.

ఏ బైక్‌లపై ఆఫర్లు లేవు?

యమహా కంపెనీ అన్ని మోడళ్లకు ఈ పండుగ ప్రయోజనాలను వర్తింపజేయడం లేదు. Aerox 155, R15S, EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఆఫర్ల పరిధిలో లేవు. ఇటీవల పరిచయం చేసిన R2 మోడల్‌పైనా ప్రస్తుతం ఎలాంటి పండుగ ఆఫర్లు ప్రకటించలేదు.

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్లు వర్తించవు. ఇతర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

ఇది కూడా చదవండి: పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి

ఆఫర్లు ఎప్పటి వరకు?

బీమా ప్రయోజనాల విషయంలో యమహా ప్రత్యేక గడువును ప్రకటించింది. సాధారణంగా 2026 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలో మాత్రం అక్టోబర్ 10 నుంచి ఈ ఆఫర్లు అమల్లోకి వచ్చాయి.

తక్కువ డౌన్ పేమెంట్, ఫైనాన్స్ పథకాలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి నవంబర్ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.

కొనే ముందు ఇవి తెలుసుకోండి

యమహా ప్రకటించిన బీమా ప్రయోజనాలు వినియోగదారులకు లభించే కనీస ప్రయోజనాలుగా పేర్కొంది. తుది ప్రయోజనం, ఫైనాన్స్ నిబంధనలు, అర్హతలు డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. అందువల్ల బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే ముందు సమీప అధీకృత యమహా షోరూమ్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Electric Scooter Sales: జనం ఎక్కువగా కొంటున్నది ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లనే.. అక్టోబర్‌లో రెట్టింపు అమ్మకాలు!
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొంటారా? ప్రస్తుతం దేశంలో నంబర్‌ 1, నంబర్‌ 2 కంపెనీలు ఇవే!
25.5hp పవర్‌తో మార్కెట్‌లోకి దూసుకొచ్చిన Bajaj Pulsar NS200.. ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల కంపారిజన్‌
కొత్త ఫీచర్లతో వచ్చిన బజాజ్ పల్సర్ NS200.. ఇప్పుడు KTM డ్యూక్, TVS అపాచీ కంటే ఇదే బెస్ట్‌ బైకా?
Honda CBR1000RR-R Fireblade: 2026, 2027 మోడళ్ల మధ్య తేడాలేంటి? కొత్తగా ఏ మారింది?
కొత్త లుక్‌తో తిరిగొచ్చిన హోండా ఫైర్‌బ్లేడ్.. బరువు తగ్గించి, టార్క్ పెంచిన కంపెనీ!
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
Tulsi Leaves Benefits : తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
తులసి ఆకులు రోజూ తింటే ఏమవుతుంది? జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు లాభాలివే
Polimera 3 Viraavi : 'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
'పొలిమేర'లో పవర్ ఫుల్ విరావి వచ్చేశాడు - యాక్షన్ కింగ్ అర్జున్ న్యూ లుక్ చూశారా?
CM Revanth Reddy: 2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
2028 డిసెంబరు నాటికి కొడంగల్‌కు కృష్ణాజలాలు: లగచర్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget