అన్వేషించండి

Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!

ట్రయంఫ్ బొన్నెవిల్ 350 మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. T4, T40, T40 బ్లాక్ ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు, డెలివరీ తేదీల గురించి తెలుసుకోండి.

350cc Triumph Bonneville Details In Telugu: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ నుంచి వచ్చిన కొత్త బొన్నెవిల్ 350 సిరీస్‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌ ధరలు, వేరియంట్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. మొత్తం మూడు వేరియంట్లలో వీటిని అందిస్తోంది. ప్రారంభ ధర రూ.2.55 లక్షలు. వేరియంట్‌ను బట్టి ధర, ఫీచర్లు మారతాయి.

మూడు వేరియంట్లు.. ధరలు

ట్రయంఫ్ బొన్నెవిల్ 350 సిరీస్‌లో T4, T40, T40 బ్లాక్ వేరియంట్లు ఉన్నాయి. వీటిలో T4 ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం రూపొందించిన ప్రారంభ వేరియంట్. మిగిలిన T40, T40 బ్లాక్ మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లలోనూ అందుబాటులో ఉండే వెర్షన్లు.

బొన్నెవిల్ T4 ధర రూ.2.55 లక్షలు. T40 ధర రూ.2.80 లక్షలు. T40 బ్లాక్ ధరను కూడా రూ.2.80 లక్షలుగా నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.

T4లో ఏం ఉన్నాయి?

బొన్నెవిల్ సిరీస్‌లో తక్కువ ధరకు లభించే మోడల్ T4. T40తో పోలిస్తే దీని ధర రూ.25,000 తక్కువ. ఇంజిన్, ప్రధాన మెకానికల్‌ భాగాలు రెండు వేరియంట్లలోనూ ఒకేలా ఉంటాయి. అయితే కొన్ని ఆధునిక ఫీచర్లను T4లో తగ్గించారు.

T4లో కలర్‌ LCD డిస్‌ప్లే ఉంటుంది. T40లో ఇచ్చిన 4 అంగుళాల TFT స్క్రీన్‌కు బదులుగా దీనిని అందించారు. క్రూయిజ్ కంట్రోల్, IMU వ్యవస్థలు కూడా ఇందులో ఉండవు. ఫలితంగా వంపుల్లో బైక్ వాలిన కోణానికి అనుగుణంగా పనిచేసే ABSకు ‍‌( lean-sensitive ABS) బదులుగా సాధారణ డ్యూయల్ ఛానల్ ABS అందుబాటులో ఉంటుంది.

ఈ వేరియంట్ ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ బండి డెలివరీలు 2027 జనవరి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇది కూడా చదవండి: 2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!

T40లో అదనపు ఫీచర్లు

T40 వేరియంట్‌లో ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో కొత్త గుండ్రని ఆకారంలోని 4 అంగుళాల రంగుల TFT డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో ఐదు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. రోడ్, రెయిన్, ఎకోతో పాటు రైడర్‌ తనకు నచ్చినట్లు మార్చుకునే మరో రెండు మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, లీన్‌ సెన్సిటివ్‌ ABS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. హెరిటేజ్ డిస్‌ప్లే అమరికతో పాతకాలపు బైక్‌ల తరహా రూపాన్ని స్క్రీన్‌పై పొందవచ్చు.

ట్రయంఫ్ నావిగేషన్ యాప్ ద్వారా ఫోన్‌ను అనుసంధానిస్తే, ప్రయాణంలో టర్న్‌ బై టర్న్‌ వివరాలను డిస్‌ప్లేపై చూడవచ్చు. ఈ వేరియంట్ డెలివరీలు 2026 నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి.

T40 బ్లాక్ ప్రత్యేకత ఏమిటి?

T40 బ్లాక్ వేరియంట్ ధర కూడా రూ.2.80 లక్షలే. ఇందులో T40కు ఉన్న అన్ని ప్రధాన ఫీచర్లు కొనసాగుతాయి. అయితే దీని లుక్‌లో నలుపు రంగుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఇంజిన్, ఇతర ప్రధాన భాగాలకు నలుపు రంగు ఫినిష్‌ అందించారు. క్లాసిక్ బైక్‌లో గంభీరమైన రూపాన్ని కోరుకునేవారికి ఈ మోడల్ నచ్చవచ్చు. ఈ బండి డెలివరీలు కూడా 2026 నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి.

ఇది కూడా చదవండి: 2026 Toyota Glanza Facelift లుక్‌ అదిరిపోయింది.. కొత్త ఇంజిన్, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ కూడా!

మూడు వేరియంట్లలో ఒకే ఇంజిన్

ఈ 3 వేరియంట్లలోనూ 350సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. ట్రయంఫ్ తన 400 సిరీస్‌లో ఉపయోగిస్తున్న ఇంజిన్ ఫ్లాట్‌ఫామ్‌ ఆధారంగా దీనిని డెవలప్‌ చేసింది. అయితే కొత్త సిలిండర్ హెడ్, చిన్న థ్రాటిల్ బాడీలు, ప్రత్యేక క్యామ్‌షాఫ్ట్‌లు, కొత్త పీషూటర్ ఎగ్జాస్ట్‌తో ఇంజిన్‌లో మార్పులు చేసింది.

ఈ ఇంజిన్ 7,000 ఆర్‌పీఎం వద్ద 29 హెచ్‌పీ శక్తిని, 5,500 ఆర్‌పీఎం వద్ద 31.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ, మధ్యస్థ ఇంజిన్ వేగాల్లో మెరుగైన టార్క్ అందేలా దీన్ని రూపొందించారు.

చాసిస్, బ్రేకింగ్ వ్యవస్థ

మూడు వేరియంట్లలోనూ ఒకే తరహా చాసిస్‌ను ఉపయోగించారు. వెనుక భాగంలో వెల్డింగ్ చేసిన సబ్‌ఫ్రేమ్, గొట్టపు ఆకారంలోని స్టీల్ స్వింగ్‌ఆర్మ్ ఉన్నాయి. ముందు భాగంలో 43 మి.మీ. టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుకవైపు రెండు షాక్ అబ్జార్బర్లు అందించారు.

బ్రేకింగ్ కోసం ముందు చక్రానికి 310 మి.మీ. డిస్క్, రెండు పిస్టన్ల కాలిపర్‌ను ఇచ్చారు. వెనుక చక్రానికి 255 మి.మీ. డిస్క్, ఒక పిస్టన్ కాలిపర్‌ను అమర్చారు.

మొత్తంగా చూస్తే.. తక్కువ ధరలో బొన్నెవిల్ అనుభూతిని కోరుకునేవారికి T4 ఒక ఎంపిక. ఎక్కువ సాంకేతిక ఫీచర్లు కావాలనుకునేవారు T40ను పరిశీలించవచ్చు. అదే ఫీచర్లతో నలుపు రంగు రూపాన్ని ఇష్టపడేవారికి T40 బ్లాక్ అనుకూలంగా ఉంటుంది. 

గమనిక: పేర్కొన్న ధరలు ఎక్స్‌షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ventilated Seats: లాంగ్‌ ట్రిప్పుల్లోనూ చల్లగా, హాయిగా జర్నీ.. ఈ 10 కార్లలో వెంటిలేటెడ్ సీట్లు.. మీ బడ్జెట్‌లోనే!
చల్లటి ప్రయాణాన్ని అందించే వెంటిలేటెడ్ సీట్లు ఉన్న 10 చవకైన కార్లు.. ప్రారంభ ధర రూ.8.50 లక్షలే!
Best Mileage Diesel Cars: మీ డబ్బు ఆదా చేస్తూ ఎక్కువ మైలేజీ ఇచ్చే డీజిల్ SUVలు.. 16.5 నుంచి 24.08kpl వరకు!
బెస్ట్‌ మైలేజీ ఇచ్చే 7 డీజిల్ కాంపాక్ట్ SUVలు ఇవే.. టాప్ ప్లేస్‌లో టాటా నెక్సాన్
421cc ఇంజిన్‌తో వస్తున్న Hero Xpulse 450 ఆవిష్కరణ.. 46.7hp పవర్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతలు
హీరో కొత్త బైక్‌లో కార్ల తరహా ఫీచర్లు.. Android Auto, Apple CarPlayతో వస్తున్న Xpulse 450!
Norton 450 Urban ఆవిష్కరణ.. 47hp ఇంజిన్, 8-అంగుళాల TFT స్క్రీన్‌తో రెండు వేరియంట్లు
Norton కొత్త బైక్‌లు చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించే డిజైన్‌తో 450 Urban
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget