అన్వేషించండి

Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450, ట్రయంఫ్ ట్రాకర్ 400 బైక్‌ల వేగం, పికప్, ఓవర్‌టేకింగ్ సామర్థ్యం, బ్రేకింగ్ పనితీరును పోల్చి తెలుసుకోండి.

RE Guerrilla 450 vs Triumph Tracker 400 Performance: ప్రీమియం బైక్ కొనాలనుకునేవారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450, ట్రయంఫ్ ట్రాకర్ 400 రెండూ ఆసక్తికరమైన ఎంపికలు. ఈ రెండు బైక్‌లలోనూ సుమారు 40 హెచ్‌పీ శక్తి ఉంది. బరువులు కూడా దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. ధరల మధ్య వ్యత్యాసం సుమారు రూ.10,000 మాత్రమే. అయితే రోడ్డుపై వీటి పనితీరులో మాత్రం స్పష్టమైన తేడాలు కనిపించాయి. వేగం అందుకోవడం, నడుస్తున్నప్పుడు పికప్, బ్రేకింగ్ వంటి అంశాల్లో నిర్వహించిన పరీక్షల్లో గెరిల్లా 450 ముందంజలో నిలిచింది. ఈ రెండు బైక్‌ల పనితీరును వివరంగా తెలుసుకుందాం.

వేగం అందుకోవడంలో గెరిల్లా 450దే పైచేయి

గెరిల్లా 450 బరువు 185 కిలోలు. ట్రయంఫ్ ట్రాకర్ 400 బరువు 181 కిలోలు. అంటే గెరిల్లా 450 నాలుగు కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది. అయినప్పటికీ వేగం అందుకోవడంలో మెరుగ్గా దూసుకెళ్లింది.

గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గెరిల్లా 450కు 2.85 సెకన్లు పట్టింది. ట్రాకర్ 400కు 3.05 సెకన్లు అవసరమయ్యాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడంలో గెరిల్లా 450కు 4.36 సెకన్లు పట్టగా, ట్రాకర్ 400కు 4.86 సెకన్లు పట్టింది.

ఇక గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంలో ఈ రెండు బైక్‌ల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. గెరిల్లా 450 కేవలం 6.24 సెకన్లలోనే ఈ వేగాన్ని చేరుకుంది. ట్రాకర్ 400కు 7.55 సెకన్లు పట్టాయి. అంటే ఈ పరీక్షలో గెరిల్లా 450 ఏకంగా 1.31 సెకన్లు ముందుంది.

దీనికి ప్రధాన కారణం ఇంజిన్ సామర్థ్యం, టార్క్ అందించే విధానం. గెరిల్లాలో ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉండటంతో పాటు తక్కువ, మధ్యస్థ ఇంజిన్ వేగాల్లోనూ మెరుగైన పవర్‌ లభిస్తుంది. ట్రాకర్ 400లోని 349 సీసీ ఇంజిన్ మాత్రం 6,000 ఆర్‌పీఎం దాటిన తర్వాత మరింత చురుగ్గా స్పందిస్తుంది.

ఇది కూడా చదవండి: రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత

ఓవర్‌టేకింగ్‌లోనూ గెరిల్లా దూకుడు

బైక్ పనితీరును అంచనా వేయడానికి.. ఆగి ఉన్న స్థితి నుంచి వేగం అందుకోవడమే కాకుండా, ఇప్పటికే ప్రయాణిస్తున్నప్పుడు వేగాన్ని పెంచుకునే సామర్థ్యాన్ని కూడా పరిశీలించాలి. దీనినే రోల్ ఆన్ యాక్సిలరేషన్ అంటారు. రోడ్డుపై మరో వాహనాన్ని అధిగమించేటప్పుడు ఈ సామర్థ్యం ఉపయోగపడుతుంది.

రెండో గేర్‌లో గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గెరిల్లా 450కు 1.98 సెకన్లు పట్టాయి. ట్రాకర్ 400కు 2.44 సెకన్లు అవసరమయ్యాయి.

మూడో గేర్‌లో గంటకు 30 నుంచి 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి గెరిల్లా 450కు 2.78 సెకన్లు పట్టగా, ట్రాకర్ 400కు 4.15 సెకన్లు పట్టాయి. నాలుగో గేర్‌లో గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంలోనూ గెరిల్లా 450 ముందుంది. దీనికి 3.38 సెకన్లు పట్టగా, ట్రాకర్ 400కు 4.32 సెకన్లు పట్టాయి.

గెరిల్లా 450లో 40 ఎన్‌ఎం టార్క్ ఉండగా, ట్రాకర్ 400లో 32 ఎన్‌ఎం టార్క్ ఉంది. తక్కువ వేగాల వద్దే ఎక్కువ టార్క్ అందుబాటులో ఉండటం గెరిల్లాకు ప్రయోజనంగా మారింది.

ఇది కూడా చదవండి: పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి

బ్రేకింగ్‌లోనూ గెరిల్లా 450దే విజయం

వేగం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు బైక్‌ను సురక్షితంగా ఆపగలగడం కూడా అంతే ముఖ్యం. గంటకు 60 కిలోమీటర్ల వేగం నుంచి పూర్తిగా ఆగే వరకు తీసుకున్న దూరాన్ని పరిశీలించిన పరీక్షలో గెరిల్లా 450 మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది.

గెరిల్లా 450, గంటకు 60 కిలోమీటర్ల వేగం నుంచి పూర్తిగా ఆగడానికి 15.73 మీటర్ల దూరం తీసుకుంది. ట్రాకర్ 400కు 16.75 మీటర్లు అవసరమయ్యాయి. అంటే గెరిల్లా 450 సుమారు 1.02 మీటర్ల తక్కువ దూరంలోనే ఆగిపోయింది.

గెరిల్లాలో 310 మి.మీ. ముందు బ్రేక్ డిస్క్ ఉండగా, ట్రాకర్ 400లో 300 మి.మీ. డిస్క్ ఉంది. గెరిల్లాలో రహదారి వినియోగానికి అనుకూలమైన టైర్లు ఉండటం కూడా ఈ ఫలితానికి తోడ్పడింది. అయితే ట్రాకర్ 400లోని నాలుగు పిస్టన్ల బ్రేక్ కాలిపర్ బ్రేకింగ్ సమయంలో మెరుగైన స్పందనను అందించినట్లు పరీక్షలో గుర్తించారు.

మొత్తంగా ఏది మెరుగైన బైక్?

వేగం అందుకోవడం, గేర్లు మార్చకుండా వేగాన్ని పెంచుకోవడం, బ్రేకింగ్ దూరం.. ఈ మూడు పరీక్షల్లోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ముందంజలో నిలిచింది. ముఖ్యంగా ఎక్కువ టార్క్, మెరుగైన యాక్సిలరేషన్‌ కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా కనిపిస్తోంది. అలాగని ట్రయంఫ్ ట్రాకర్ 400ను తక్కువగా అంచనా వేయకూడదు, ఈ పరీక్షల్లో గెరిల్లా 450ను అధిగమించలేకపోయింది అంతే.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
రూ.23 వేలు డౌన్ పేమెంట్ కడితే VLF Strada ఎలక్ట్రిక్ స్కూటర్ నెలవారీ EMI ఎంత
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget