అన్వేషించండి

ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు

భారత్‌లో ADAS ఫీచర్లతో లభించే టాప్ 10 చౌకైన కార్లు ఇవే. హోండా అమేజ్, మారుతి బాలెనో నుంచి నిస్సాన్ టెక్టన్ వరకు ధరలు, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

Most affordable cars with ADAS: కార్ల కొనుగోలులో మైలేజీ, ధర, డిజైన్‌తో పాటు భద్రత ఫీచర్లకు కూడా ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతోంది. ఒకప్పుడు ఖరీదైన కార్లకే పరిమితమైన ఈ ఫీచర్లు ఇప్పుడు సాధారణ ధరల్లో లభించే కార్లలోనూ అందుబాటులోకి వచ్చాయి. హ్యుందాయ్, హోండా, మహీంద్రా, మారుతి సుజుకి వంటి కంపెనీలు ఈ టెక్నాలజీని తమ కార్లలో అందిస్తున్నాయి.

ప్రస్తుతం, ADASలో ప్రధానంగా రెండు స్థాయిలు ఉన్నాయి. అవి.. లెవల్ 1 & లెవల్ 2. లెవల్ 1లో.. ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదంపై హెచ్చరికలు, లేన్‌లోనే వాహనం ఉండేందుకు సాయం చేసే ఫీచర్లు ఉంటాయి. లెవల్ 2లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అదనపు సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే అన్ని కార్లలోనూ ఒకే ఫీచర్లు ఉండవు, వేరియంట్‌ను బట్టి సదుపాయాలు మారుతాయి.

భారత్‌లో ADAS అందించే 10 చవకైన పెట్రోల్, డీజిల్ కార్ల జాబితా ఇదే.

 10. నిస్సాన్ టెక్టన్

ధర: రూ.15.39 లక్షలు – రూ.18.59 లక్షలు

నిస్సాన్ కొత్త ఎస్‌యూవీ టెక్టన్‌లో టెక్నా, టెక్నా+ వేరియంట్లకు లెవల్ 2 ADAS అందించారు. ఇందులో 100hp సామర్థ్యం ఉన్న 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 163hp సామర్థ్యం ఉన్న 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మాన్యువల్, డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి.

 9. ఎంజీ ఆస్టర్

ధర: రూ.15.30 లక్షలు

2021లో లాంచ్‌ అయిన ఎంజీ ఆస్టర్, అప్పట్లో ADASతో వచ్చిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. ఇందులోని టాప్ వేరియంట్ సావీ ప్రోలో లెవల్ 2 ADAS ఉంది. ఇది 110hp సామర్థ్యమున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, CVT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

 8. హోండా ఎలివేట్

ధర: రూ.15.19 లక్షలు – రూ.16.36 లక్షలు

హోండా ఎలివేట్‌లో టాప్ ZX వేరియంట్‌తో పాటు ZX బ్లాక్, ADV ఎడిషన్లలోనూ ADAS అందుబాటులో ఉంది. ఇందులో 121hp సామర్థ్యమున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!

 7. హ్యుందాయ్ వెన్యూ

ధర: రూ.14.65 లక్షలు – రూ.15.65 లక్షలు

కొత్త హ్యుందాయ్ వెన్యూలో గత మోడల్‌తో పోలిస్తే మెరుగైన లెవల్ 2 ADAS సిస్టమ్‌ను అందించారు. HX 10, HX 10 నైట్ వేరియంట్లలో ఈ ఫీచర్ ఉంది. టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది. N లైన్ N10 వేరియంట్‌లోనూ ADAS అందుబాటులో ఉంది.

 6. కియా సోనెట్

ధర: రూ.13.66 లక్షలు – రూ.14.37 లక్షలు

కియా సోనెట్‌లో GTX+ , X-లైన్ వేరియంట్లకు లెవల్ 1 ADAS అందించారు. టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి గేర్‌బాక్స్ మారుతుంది. ఈ మోడల్ నెక్ట్స్‌ జెన్‌ కారులో లెవల్ 2 ADAS వచ్చే అవకాశం ఉందని అంచనా.

 5. టాటా నెక్సాన్

ధర: రూ.13.62 లక్షలు – రూ.13.82 లక్షలు

టాటా నెక్సాన్‌లో ఫియర్‌లెస్+ PS వేరియంట్‌కు లెవల్ 2 ADAS అందించారు. అయితే ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ కలయికలో మాత్రమే లభిస్తుంది. రెడ్ డార్క్ ఎడిషన్‌లోనూ ఈ ఫీచర్ ఉంది. డీజిల్ వేరియంట్లలో ADAS లేదు.

 4. హోండా సిటీ

ధర: పెట్రోల్ రూ.13.59 లక్షలు – రూ.17.44 లక్షలు; హైబ్రిడ్ రూ.21.44 లక్షలు

హోండా సిటీలో బేస్ SV వేరియంట్ మినహా V, ZX, ZX+ వేరియంట్లలో లెవల్ 2 ADAS ఉంది. 121hp సామర్థ్యమున్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. సిటీ హైబ్రిడ్ ZX+ మోడల్‌లోనూ ADAS ఉంది.

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?

 3. మహీంద్రా XUV 3XO

ధర: రూ.12.02 లక్షలు – రూ.15.03 లక్షలు

మహీంద్రా XUV 3XOలో AX5 L, AX7 L వేరియంట్లకు లెవల్ 2 ADAS అందించారు. AX5 Lలో 131hp సామర్థ్యమున్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. AX7 Lలో అదనంగా 117hp సామర్థ్యమున్న 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపిక కూడా ఉంది.

 2. మారుతి బలెనో

ధర: రూ.9.55 లక్షలు – రూ.9.99 లక్షలు

రూ.10 లక్షల లోపు ధరలో ADAS అందించే హ్యాచ్‌బ్యాక్‌గా మారుతి బలెనో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇందులో టాప్ ఆల్ఫా (O) వేరియంట్‌కు లెవల్ 2 ADAS ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

 1. హోండా అమేజ్

ధర: రూ.9.39 లక్షలు – రూ.10 లక్షలు

ఈ జాబితాలో అత్యంత తక్కువ ధరకు ADAS అందించే కారుగా థర్డ్‌ జనరేషన్‌ హోండా అమేజ్ నిలిచింది. దీని టాప్ ZX వేరియంట్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో 90hp సామర్థ్యమున్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. 4 మీటర్లలోపు పొడవున్న సెడాన్‌లలో ADAS అందించే ప్రత్యేక మోడల్‌గా ఇది నిలుస్తోంది.

 మారుతి బ్రెజ్జా కూడా..

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్లతో పాటు బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి కొన్ని డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు వచ్చాయి. ఇవి ZXi, ZXi+ వేరియంట్లలో లభిస్తాయి. ధరలు రూ.9.85 లక్షల నుంచి రూ.13.55 లక్షల వరకు ఉన్నాయి. అయితే ఇందులోని ఫీచర్లను పూర్తి స్థాయి ADAS వ్యవస్థతో సమానంగా చూడకూడదు.

గమనిక: పైన పేర్కొన్న ధరలు 2026 సెప్టెంబర్ 10 నాటికి ఉన్న ఎక్స్‌షోరూమ్ ధరలు. నగరం, వేరియంట్, తాజా ధరల మార్పులను బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget