అన్వేషించండి

39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?

కవాసాకి Z300 బైక్ ఆవిష్కరణ, 296 సీసీ ఇంజిన్, 39 హెచ్‌పీ శక్తి, టీఎఫ్‌టీ తెర, బుకింగ్స్ తేదీ, అంచనా ధర & కేటీఎం 390 డ్యూక్‌తో పోటీ వివరాలు తెలుసుకోండి.

Kawasaki Z300 Revealed: కవాసాకి నుంచి కొత్త బైక్ వచ్చేస్తోంది. యువతను ఆకట్టుకునేలా రూపొందించిన Z300 స్ట్రీట్ నేకెడ్ బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది. నింజా 300 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త మోటార్‌సైకిల్.. కవాసాకి Z సిరీస్‌లో ప్రారంభ స్థాయి మోడల్‌గా నిలవనుంది. పెద్ద బైక్‌లా కనిపించే రూపం, పవర్‌ఫుల్‌ ఇంజిన్, మోడ్రన్‌ టెక్నాలజీతో ఈ బైక్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. దీని ధర ఎంత ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కవాసాకి Z300 డిజైన్ ఎలా ఉంది?

బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో కవాసాకి Z300ను ప్రదర్శించింది. ఈ బైక్ రూపకల్పనలో పెద్దదైన Z900 ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. స్పోర్టీ లుక్‌తో పాటు వీధుల్లో సులభంగా నడిపేందుకు అనువైన ఆకృతిని కంపెనీ అందించింది. నేకెడ్ బైక్ కావడంతో ఇందులో ముందు భాగం మినహా పూర్తి ఫెయిరింగ్ బాడీవర్క్ ఉండదు. దీనివల్ల బైక్‌కు ప్రత్యేకమైన స్ట్రీట్ ఫైటర్ రూపం వచ్చింది.

ఈ బైక్‌లో వెడల్పైన, నిటారుగా ఉండే ఒకే హ్యాండిల్‌బార్‌ను ఇచ్చారు. దీనివల్ల రైడర్ కూర్చునే భంగిమ సౌకర్యవంతంగా ఉంటుంది. రోజువారీ ప్రయాణాలతో పాటు నగర రోడ్లపై బైక్ నడిపేవారికి ఈ తరహా డిజైన్‌ ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ, నలుపు రంగుల్లో Z300 అందుబాటులోకి రానుంది.

296 సీసీ ఇంజిన్.. 39 హెచ్‌పీ శక్తి

కవాసాకి Z300లో 296 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సదుపాయం ఉన్న ప్యార్లల్‌ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. ఇదే ఇంజిన్‌ను Ninja 300లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 39 హెచ్‌పీ శక్తిని, 26.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు గేర్ల గేర్‌బాక్స్‌ను జత చేశారు.

ఇంజిన్ విషయంలో నింజా 300తో పోలికలు ఉన్నప్పటికీ, Z300లో రైడింగ్ అనుభవం భిన్నంగా ఉండనుంది. నిటారుగా కూర్చునే భంగిమ, వెడల్పైన హ్యాండిల్‌బార్ కారణంగా నగర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?

TFT స్క్రీన్‌తో మోడ్రన్‌ ఫీచర్లు

కొత్త Z300లో మరో ప్రధాన ఆకర్షణ దాని స్క్రీన్‌. నింజా 300లో ఉండే సెమీ డిజిటల్ మీటర్‌కు బదులుగా ఇందులో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇందులో స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్‌ చేసుకునే ఫెసిలిటీ సహా చాలా ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. అయితే, పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

అక్టోబర్ 19 నుంచి బుకింగ్స్

బెంగళూరులో తొలి ప్రదర్శన తర్వాత అక్టోబర్ 18న ముంబై, పుణెలోనూ ఈ బైక్‌ను ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 19 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సాంకేతిక వివరాలు, వేరియంట్లు, ధరను అక్టోబర్ 20న కవాసాకి అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించనుంది.

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం కవాసాకి నింజా 300 ఎక్స్‌షోరూమ్ ధర రూ.3.34 లక్షలు. ఈ నేపథ్యంలో Z300 ధరపై ఆసక్తి నెలకొంది. కొత్త బైక్‌లో ఫెయిరింగ్ బాడీవర్క్ తక్కువగా ఉన్నప్పటికీ, ఆధునిక ఎలక్ట్రానిక్ సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల ధరను కంపెనీ ఎలా నిర్ణయిస్తుందన్నది కీలకం.

ఇది కూడా చదవండి: రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?

Z300 ధర రూ.3 లక్షల లోపు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇదే జరిగితే మార్కెట్లో పోటీ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా KTM 390 Duke, TVS Apache RTR 310 వంటి బైక్‌లతో పోలికలు మొదలవుతాయి. ధర, పూర్తి ఫీచర్లు అధికారికంగా వెల్లడైన తర్వాతే Z300 మార్కెట్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందో స్పష్టమవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget