అన్వేషించండి

కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!

రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.21,000తో బుక్ చేసుకోవచ్చు. ఏఆర్ఏఐ గుర్తించిన మైలేజ్ లీటర్‌కు 29 కి.మీ. ఈ కొత్త ఎస్‌యూవీ ఇంజిన్, బ్యాటరీ వివరాలు తెలుసుకోండి.

Renault Duster Hybrid Details In Telugu: రెనాల్ట్‌ ఇండియా కంపెనీ, తన సూపర్‌ ఎస్‌యూవీ డస్టర్ హైబ్రిడ్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను అక్టోబర్ 17న భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ కారు కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లు కేవలం రూ.21,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. రెనాల్ట్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంది.

ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీలో ప్రత్యేక ఆకర్షణ దాని మైలేజ్. డస్టర్ హైబ్రిడ్ లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇస్తుందని ఏఆర్ఏఐ గణాంకాలను రెనాల్ట్‌ వెల్లడించింది. అయితే వాస్తవ పరిస్థితుల్లో వచ్చే మైలేజ్.. ట్రాఫిక్, డ్రైవింగ్ వేగం, వాతావరణం, డ్రైవింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది.

హైబ్రిడ్ ఇంజిన్‌లో ప్రత్యేకతలివే

రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్‌లో 1.8 లీటర్ల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లను జత చేశారు. వీటిలో ఒకటి 20 హెచ్‌పీ సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటర్‌గా పనిచేస్తుంది. మరో 49 హెచ్‌పీ మోటార్ చక్రాలకు శక్తిని అందిస్తుంది.

ఈ వ్యవస్థకు 1.4 కిలోవాట్ అవర్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్ఠంగా 160 హెచ్‌పీ శక్తిని, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు బలమైన హైబ్రిడ్ వ్యవస్థతో పనిచేస్తుంది. అందువల్ల బ్యాటరీని ప్రత్యేకంగా ఛార్జింగ్ పాయింట్‌కు అనుసంధానించాల్సిన అవసరం లేదు. కారు నడుస్తున్నప్పుడు, బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తయ్యే శక్తి ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ప్రయాణం

ఈ ఎస్‌యూవీలో బహుళ విధానాల్లో పనిచేసే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించారు. డ్రైవింగ్ పరిస్థితులను బట్టి కారు విద్యుత్ శక్తితో మాత్రమే కాదు, అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్‌తోనూ ముందుకు సాగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లు రెండూ కలిసి పనిచేస్తాయి.

నగరాల్లో తక్కువ వేగంతో ప్రయాణించే సమయంలో విద్యుత్ మోటార్ల వినియోగం పెరగడం వల్ల ఇంధన ఆదా అవుతుంది. బ్రేకులు వేసినప్పుడు శక్తిని తిరిగి బ్యాటరీలో నిల్వ చేసే వ్యవస్థ కూడా మైలేజ్ మెరుగుపడటానికి తోడ్పడుతుంది.

నగర ప్రయాణాల్లో 80 శాతం విద్యుత్‌తోనే?

డస్టర్ హైబ్రిడ్ నగర ప్రయాణాల్లో 80 శాతం దూరాన్ని విద్యుత్ శక్తితోనే ప్రయాణించగలదని రెనాల్ట్‌ చెబుతోంది. అయితే ఇది డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ, వేగం, వాతావరణం వంటి అంశాలు ఇంధన వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి.

ఇది కూడా చదవండి: ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు

డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్

ప్రస్తుతం డస్టర్‌లో 1.0 లీటర్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్ మూడో ఎంపికగా చేరనుంది. డీజిల్ వేరియంట్ లేని లోటును ఈ కొత్త పవర్‌ట్రెయిన్ కొంతవరకు భర్తీ చేయవచ్చని భావిస్తున్నారు.

మారుతి గ్రాండ్ విటారా, మారుతి విక్టోరిస్, టయోటా హైరైడర్ వంటి హైబ్రిడ్ ఎస్‌యూవీలకు డస్టర్ హైబ్రిడ్ నేరుగా పోటీ ఇవ్వనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget