అన్వేషించండి

ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు

Suzuki E Sky Electric Car | సుజుకి కంపెనీ జపాన్‌ మార్కెట్లోకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు e SKY ని తీసుకొచ్చింది. ఈ కారు 310 కి.మీ రేంజ్, BYD బ్యాటరీతో ఎంట్రీ ఇచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్‌లో బడ్జెట్ ఈవీ విభాగంలోకి వచ్చే అవకాశం.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భవిష్యత్తులో EV వాహనాలు మాత్రమే రోడ్లపై పరుగులు పెట్టే రోజులు వచ్చేలా ఉన్నాయి. భారత్, విదేశాలలో సైతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలపై ఫోకస్ చేస్తున్నాయి. రేంజ్ ఎక్కువ, తక్కువ అనేది లేకుండా ఫస్ట్ ఈవీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయి హాట్ టాపిక్ అవుతోంది. సుజుకి కంసెనీ జపాన్‌లో సుజుకి ఈ స్కై (Suzuki E SKY)ని లాంచ్ చేసింది. సుజుకి కారు చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, దీని ఫీచర్లు యువతకు, కొత్తగా కార్లు కొనేవారికి బాగా నచ్చుతాయని భావిస్తున్నారు. కస్టమర్లకు ఒక చౌకైన, బెస్ట్ ఎలక్ట్రిక్ ఎంపికను అందించడమే కంపెనీ ఉద్దేశ్యం. 

జపాన్ మార్కెట్లో లాంచ్ అయిన కారు

సుజుకి తన ఈ కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు సుజుకీ ఈ స్కై మోడల్ జపాన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. అంతకుముందు ఈ కారును కంపెనీ కేవలం ఒక కాన్సెప్ట్ మోడల్‌గా తీసుకువచ్చింది. దీనికి  విశేష ఆదరణ లభించడంతో సుజుకి ఈ కాన్సెప్ట్‌ను వాస్తవరూపంలోకి తేవాలని నిర్ణయించుకుంది. అది ఇప్పుడు కార్యరూపం దాల్చి రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. 

 నవంబర్ 16 నుంచి Suzuki E Sky ఈవీ కారు విక్రయాలు ప్రారంభమవుతాయి. దీనికోసం జపాన్‌లో కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కారును భారత్‌కు లేదా ఇతర దేశాలకు ఎప్పుడు తీసుకువస్తారా అని చర్చ జరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ ఈ కారును భారత్‌లో లాంచ్ చేస్తే, ఇక్కడి బడ్జెట్ విభాగంలోని కస్టమర్లను త్వరగా ఆకర్షించనుంది. 

310 కి.మీ రేంజ్ ఇవ్వనున్న సుజుకీ ఈవీ

ఈ చిన్న సుజుకీ కారు తన విభాగం పరంగా ఎంతో పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై మంచి పనితీరుతో ఆకట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ అయితే దాదాపు 310 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుందని సుజుకీ తెలిపింది. రోజూ ఆఫీసుకు వెళ్లేవారు, సమీపంలో ఉన్న టౌన్, గ్రామాలకు వెళ్లే వారికి ఉపయోగపడుతుంది. సిటీలో రోజు బిజినెస్, ఆఫీసుకు వెళ్లే వారికి సైతం సరిగ్గా సరిపోతుంది. రోజులోనే పదే పదే ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. దాంతో చాలా తక్కువ సమయంలో బ్యాటరీని సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 

5 సీటర్ ఈవీ కారు

ఈ కొత్త సుజుకీ ఎలక్ట్రిక్ కారు డిజైన్ చాలా మోడ్రన్, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. కాంపాక్ట్ సైజ్ అయినప్పటికీ, లోపల క్యాబిన్‌ విశాలంగా, ప్రయాణంలో సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. చిన్న కుటుంబం జర్నీకి ఈ కారు సరిపోతుంది. కారులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. కారు డాష్‌బోర్డ్‌పై డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లభిస్తాయి. మీ ప్రయాణాన్ని సురక్షితంగా మార్చేందుకు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 

భారత మార్కెట్ అంచనాలు

ప్రస్తుతానికి సుజుకి ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు జపాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వచ్చే నెలలో విక్రయాలు మొదలవుతాయి. అక్కడ సక్సెస్ అయితే వెంటనే భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తారు.  ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఈ 5 సీటర్ ఈవీ కారు భారత మార్కెట్లో అంచనాలు అందుకుంటుని కంపెనీ భావిస్తోంది. సుజుకీ కంపెనీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువగా ఫోకస్ చేయనుందని తెలుస్తోంది. 

 

Frequently Asked Questions

సుజుకి ఈ స్కై కారు భారతదేశంలో లాంచ్ అవుతుందా?

ప్రస్తుతానికి ఈ కారు జపాన్ మార్కెట్లో మాత్రమే లాంచ్ చేయబడింది. జపాన్‌లో విజయవంతమైతే, కంపెనీ భారత మార్కెట్‌ను టార్గెట్ చేయొచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget