Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
బజాజ్ పల్సర్ బైక్ కొనడానికి ఇదే సరైన సమయం. పండుగ సీజన్ సందర్భంలో కంపెనీ పూర్తి పల్సర్ సిరీస్‌పై రూ. 12,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఆఫర్ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భారత్‌లో పండుగ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఫెస్టివల్ సీజన్‌లో వాహనాల కొనుగోళ్లు సైగం పెరుగుతాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పల్సర్ కంపెనీ కొత్త ఆఫర్లను ప్రకటించింది. బజాజ్ ఆటో తన అత్యంత సక్సెస్‌ఫుల్, యువతకు ఎంతో ఇష్టమైన పల్సర్ సిరీస్‌పై ఫెస్టివ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సీజన్‌లో మీరు కొత్త, స్టైలిష్, పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్ కొనాలని చూస్తుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
లభిస్తున్న ప్రయోజనాలు ఇవే
కంపెనీ తన అన్ని పల్సర్ బైకులపై రూ. 12,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆథరైజ్డ్ బజాజ్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమైంది. ఈ బెనిఫిట్ లిమిటెడ్ సమయం వరకు మాత్రమే పొందే అవకాశం ఉంది. బజాజ్ కంపెనీ ఈ ఫెస్టివ్ బెనిఫిట్ లో కస్టమర్లకు చాలా మేలు చేస్తోంది. క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఏ కస్టమర్ అయినా ఫైనాన్స్ లేదా లోన్ ద్వారా బైక్ కొనాలని అనుకుంటే, వారికి వెహికల్ లోన్ మీద జీరో ప్రాసెసింగ్ ఫీజు సౌకర్యం కల్పిస్తున్నారు.
కంపెనీ బైక్‌తో పాటు 5 ఉచిత సర్వీసులు అందిస్తోంది. దీనివల్ల ప్రారంభ నిర్వహణ ఖర్చు పూర్తిగా తగ్గుతుంది. అయితే, లభించే ప్రయోజనాల మీ సిటీ, ఎంచుకున్న మోడల్‌ను బట్టి కాస్త మారవచ్చు. ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ స్పోర్ట్స్ బైక్ పల్సర్ 125 నుంచి శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ బైక్ పల్సర్ NS400Z వరకు అన్ని మోడళ్లపై ఆఫర్లు వర్తిస్తాయి. పల్సర్ NS125, పల్సర్ 150, N160 S/SS, NS160, NS200, N250, పల్సర్ P220F వంటి మోడళ్లపై కంపెనీ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే కొనే ముందు మీకు ఎంత బెనిఫిట్ లభిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం.
మరింత పవర్ ఫుల్ గా పల్సర్
బజాజ్ ఇటీవల పాత, నమ్మకమైన పల్సర్ సిరీస్‌ను మోడ్రన్ టెక్నాలజీతో అప్డేట్ చేసింది. పల్సర్ కంపెనీ ఇప్పుడు పల్సర్ 125, పల్సర్ 150 వంటి మోడళ్లలో కూడా గూగుల్ మ్యాప్స్ కనెక్టివిటీతో కూడిన మోడ్రన్ TFT కన్సోల్‌ను అందిస్తుంది. మీరు ఈ ఫెస్టివ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి, బైక్ కొనుగోలు చేయడానికి ముందు మీ సమీపంలోని బజాజ్ షోరూమ్‌కు వెళ్ళి ప్రతి మోడల్, ఆఫర్ల వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి.
Also Read: సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
హైదరాబాద్‌లో పల్సర్ NS125 ఆన్ రోడ్ ధర రూ. 1,14,489 కాగా, ప్రస్తుత డిస్కౌంట్ ఆఫర్ లో 1 లక్షా 3 వేలకు బైక్ కొనవచ్చు. మీరు 20 వేలు కనుక డౌన్ పేమెంట్ చేస్తే 83 వేల రూపాయలు లోన్, ఫైనాన్స్ చేసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి. ఒకవేళ 83 వేలకు 9.5 శాతం వడ్డీ రేటుతో 4 ఏళ్ల కు నెలవారీ ఈఎంఐ కాస్త ఎక్కువగా రూ.2,084 ఉంటుంది, కానీ మీరు చెల్లించే మొత్తం వడ్డీ చాలా తక్కువగా (రూ. 17,014) ఉంటుంది.
ఒకవేళ 5 ఏళ్ల కాలపరిమితికి ఈఎంఐ రూ.₹1,742 కి తగ్గుతుంది. 6 ఏళ్ల కాలానికి అయితే నెలవారీ రూ. 1,515 మాత్రమే కట్టాల్సి ఉంటుంది. కానీ చెల్లించే వడ్డీ 26,085 కి పెరుగుతుంది.
ట్రెండింగ్ వార్తలు























