కొత్త స్కోడా స్లావియా బేస్ క్లాసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.99 లక్షలు. హైదరాబాద్‌లో దీని ఆన్ రోడ్ ధర రూ. 11.85 లక్షలు.
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 10 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ అయింది. 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో పాటు, ఈ కారుకు సంబంధించిన పూర్తి వివసుకోండి.

- కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ రూ. 9.99 లక్షలకు విడుదల.
- ఆధునిక డిజైన్, AI, 360 కెమెరా, రియర్ సీట్ మసాజర్.
- 1.0L, 1.5L ఇంజిన్ ఎంపికలు; మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్.
- కాంపాక్ట్ బడ్జెట్‌లో పూర్తిస్థాయి మిడ్‌సైజ్ సెడాన్ అనుభవం.
భారత్‌లో హ్యాచ్‌బ్యాక్, SUV, లగ్జరీ కార్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. దీనివల్ల సెడాన్ కార్ల విక్రయాలు కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్‌లో సెడాన్ కార్లకు మళ్లీ డిమాండ్ పెంచేందుకు కొన్ని కార్ల కంపెనీలు సరికొత్త మోడల్ ప్రవేశపెడుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ సెడాన్ సెగ్మెంట్‌పై మళ్లీ ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో స్కోడా కంపెనీ ప్రజాదరణ పొందిన తన సెడాన్ 'స్లావియా' కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ చేసింది.
స్లావియా ఫేస్‌లిఫ్ట్ కారు లాంచ్ అయినప్పటి నుంచి దీని ధర హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే స్కోడా కంపెనీ ఈ అద్భుతమైన సెడాన్‌ను 10 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు అందుబాటులోకి తెచ్చింది. కాంపాక్ట్ సెడాన్ బడ్జెట్‌లోనే పూర్తి స్థాయి మిడ్ సైజ్ సెడాన్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తున్న ఈ కారు, లాంచ్ అయిన వెంటనే ఆటో మార్కెట్‌లో సంచలనంగా మారింది. ఈ కారు ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
10 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్
కొత్త స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వేర్వేరు వేరియంట్లతో విక్రయాలు జరుగుతున్నాయి. దీని బేస్ క్లాసిక్ వేరియంట్ 1.0 లీటర్ TSI మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ. 9.99 లక్షలకు లాంచ్ అయింది. హైదరాబాద్‌లో దీని ఆన్ రోడ్ ధర రూ. 11.85 లక్షలుగా ఉంది. క్లాసిక్+ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షలకు ప్రారంభమవుతుంది. దీని ఆటోమేటిక్ వెర్షన్‌ను కొనుగోలు చేయాలంటే ఎక్స్ షోరూమ్ ధరే రూ. 12.49 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
స్కోడా స్లావియాలో మిడ్-రేంజ్‌లో సిగ్నేచర్ ధర రూ. 14.34 లక్షలు, 'స్పోర్ట్‌లైన్' అన్ రోడ్ ధర రూ. 17.90 లక్షలుగా నిర్ణయించారు. ఇక దీని టాప్-ఎండ్ 'ప్రెస్టీజ్' వేరియంట్ మ్యాన్యువల్ ఆన్ రోడ్ ధర రూ. 18.9 లక్షలు. మరింత ఎక్కువ పవర్ కోరుకునే వారికి 1.5 లీటర్ TSI ఇంజన్ కేవలం ప్రెస్టీజ్, మోంటే కార్లో ట్రిమ్స్‌లో లభిస్తుంది. Prestige 1.5 TSI DCT ఆన్ రోడ్ ధర రూ. 22.20 లక్షలు కాగా, మాంటెకార్లో 1.5 TSI DCT ఆన్ రోడ్ ధర రూ.22.38 లక్షలుగా ఉంది.
అద్భుతమైన డిజైన్, ఫీచర్లలోనూ బెస్ట్
కొత్త స్లావియా డిజైన్‌లో చిన్న చిన్న మార్పులు చేశారు. మరింత మోడ్రన్, ప్రీమియం లుక్ అందిస్తుంది. ఇక దీని ఇంటీరియర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సపోర్ట్, మైండ్ బ్లోయింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లు ఇచ్చారు. ఈ కారులో ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే దీని రియర్ సీట్ మసాజర్. ఈ సెగ్మెంట్‌లోని వేరే ఏ ఇతర కారులోనూ ఈ ఫీచర్ కనిపించదు. ఈ ఫీచర్ లాంగ్ జర్నీ సమయంలో ప్రయాణికులకు లగ్జరీ, సౌకర్యవంతమైన జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ఇంజన్ కూడా పవర్‌ఫుల్
ఈ స్లావియా సెడాన్‌లో 1.0 లీటర్ TSI, పవర్ ఫుల్ 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌లతో పాటు 2 పవర్ ఫుల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ ఇంజన్ రోజువారీ వాడకానికి, అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. 1.5 లీటర్ ఇంజన్ వేగాన్ని ఇష్టపడే వారికి అధిక పవర్‌ను ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి మీ డ్రైవింగ్‌ను మరింత స్మూత్‌గా మారుస్తాయి.
ఈ కారు ఎందుకు ప్రత్యేకం?
కేవలం 12 లక్షల కంటే తక్కువ ధరకు వచ్చే దీని బేస్ క్లాసిక్ వేరియంట్‌లో మరీ హైఎండ్ ఫీచర్లు లేకపోయినా.. ఇది స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, ఆటోమేటిక్ ఏసీ, స్టీల్ వీల్స్, చిన్న టచ్‌స్క్రీన్‌తో మీకు ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా అందిస్తుంది. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న ఈ సెడాన్ ఇప్పుడు సబ్ 4 మీటర్ కాంపాక్ట్ కార్లు, SUVల బడ్జెట్‌లోనే వస్తుంది. బడ్జెట్ ధరలో ఒక లగ్జరీ, సేఫ్టీ, పవర్‌ఫుల్ సెడాన్ కొనాలని చూస్తుంటే మీకు కొత్త స్కోడా స్లావియా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.
Frequently Asked Questions
కొత్త స్కోడా స్లావియా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఎంత?
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఏ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది?
స్కోడా స్లావియా 1.0 లీటర్ TSI మరియు పవర్ ఫుల్ 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. ట్రాన్స్‌మిషన్ కోసం మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.
స్కోడా స్లావియాలో అందించిన ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటి?
ఈ కారులో ప్రత్యేకమైన ఆకర్షణ దాని రియర్ సీట్ మసాజర్. ఈ సెగ్మెంట్‌లోని వేరే ఏ ఇతర కారులోనూ ఈ ఫీచర్ కనిపించదు.
స్కోడా స్లావియాను ఎందుకు తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు?
సెడాన్ కార్ల డిమాండ్ పెంచడానికి స్కోడా కంపెనీ తన ప్రజాదరణ పొందిన 'స్లావియా'ను కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌గా లాంచ్ చేసింది. ఇది కాంపాక్ట్ సెడాన్ బడ్జెట్‌లోనే పూర్తి స్థాయి మిడ్ సైజ్ సెడాన్ అనుభవాన్ని అందిస్తుంది.
స్కోడా స్లావియా ఇంటీరియర్‌లో ఏయే ఆధునిక ఫీచర్లు ఉన్నాయి?
దీని ఇంటీరియర్‌లో AI సపోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.
ట్రెండింగ్ వార్తలు























