అన్వేషించండి

అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి

రెనాల్ట్ కంపెనీకి చెందిన కొత్త Duster Hybrid త్వరలోనే భారత మార్కెట్‌లోకి రాబోతోంది. అక్టోబర్ 17న జరిగే దీని లాంచింగ్ ఉండగా, ఇంజిన్ ఆప్షన్లు గురించి ఇక్కడ తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రెనో డస్టర్ హైబ్రిడ్ మోడల్ అక్టోబర్ 17న విడుదల.
  • శక్తివంతమైన హైబ్రిడ్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు.
  • ఆధునిక ఫీచర్లు, ADAS సేఫ్టీతో మస్కులర్ డిజైన్.

ఆటోమొబైల్ మార్కెట్ నుంచి నిరంతరం కొత్త వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రెనాల్ట్ కంపెనీకి సంబంధించి అప్డేట్ వచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన SUV రెనో డస్టర్ మరొకసారి కొత్త అవతార్‌లో రీఎంట్రీకి సిద్ధమైంది. ఎందుకంటే, కంపెనీ తమ ఈ ఐకానిక్ వాహనం నెక్స్ట్-జనరేషన్ హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పుడు రెనో కంపెనీ దీనిని మోడ్రన్ హైబ్రిడ్ టెక్నాలజీ, బోల్డ్ లుక్స్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో పరిచయం చేయబోతోందని సమాచారం. 

కస్టమర్లు చాలా కాలం నుంచి ఈ కొత్త SUV కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో రాబోతున్న డస్టర్ తన సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా వాహనాలకు గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు. ఇక ధర విషయానికి వస్తే భారత్‌లో తయారీ, హైబ్రిడ్ టెక్నాలజీతో రావడం వల్ల దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుండి రూ. 11 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశరాు. దీని టాప్ హైబ్రిడ్ వేరియంట్ల ధర రూ. 18 లక్షలు ఉండే అవకాశం ఉంది.  కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌లో ఏమేం ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు ,ప్రత్యేకమైన అప్‌డేట్స్ లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. పది లక్షల వాహనం అయితే 2 లక్షలు డౌన్ పేమెంట్ చేయాలి. మిగతా మొత్తానికి మీరు ఎంచుకునే టర్మ్ 4 నుంచి 7 ఏళ్లు ఆధారంగా, వడ్డీ శాతాన్ని బట్టి నెలవారీ EMI 13 వేల నుంచి 20 వేలు వరకు ఉండవచ్చు. త్వరలో కారు ధర, బుకింగ్ వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

అక్టోబర్ 17న లాంచ్ 

 కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌ను అక్టోబర్ 17న లాంచ్ చేయనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కొత్త SUVని భారత మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. లాంచ్ రోజునే దీని బుకింగ్ , డెలివరీకి సంబంధించిన పూర్తి టైమ్‌లైన్ వెల్లడి కానుంది. ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.

Also Read: 1.3 లక్షలు డౌన్ పేమెంట్ చేసి Tata Aeris కారు కొనవచ్చు.. EMI ఎంత చెల్లించాలి

హైబ్రిడ్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు

కొత్త రెనాల్ట్ డస్టర్‌లో కస్టమర్లకు పవర్‌ఫుల్, ఫ్యూయల్-ఎఫిషియంట్ ఇంజిన్ ఆప్షన్లు లభించనున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ 1.6 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్ అని అంచనా వేస్తున్నారు. ఇది 2 ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి పనిచేస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లభించవచ్చు. ఈ కొత్త హైబ్రిడ్ సెటప్ కారుకు అద్భుతమైన పవర్ ఇవ్వడమే కాకుండా దాని మైలేజ్ అద్భుతంగా ఉండబోతోంది.

మస్కులర్ డిజైన్ 

కంపెనీ కొత్త డస్టర్ ఎక్స్‌టీరియర్‌ను అంతకుముందు కంటే మరింత అగ్రెసివ్, మస్కులర్‌గా తయారు చేసిందని తెలుస్తోంది. ఇందులో కొత్త Y- షేప్డ్ LED DRLs, సిగ్నేచర్ గ్రిల్, రూఫ్ రైల్స్, వెడల్పాటి అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. కారు కేబిన్ లోపల మీకు పూర్తిగా కొత్త , ప్రీమియం డాష్‌బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో 10.1 ఇంచుల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఇచ్చారు. 

Also Read: యాక్సెంట్ నుంచి 2026 వెర్నా వరకు.. రెండు దశాబ్దాల్లో హ్యుందాయ్ సెడాన్ ప్రయాణం!
సేఫ్టీ విషయానికి వస్తే కొత్త రేనో డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,  అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి హైటెక్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. 

Frequently Asked Questions

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎప్పుడు విడుదల అవుతుంది?

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ అక్టోబర్ 17న విడుదల అవుతుంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది.

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ధర ఎంత ఉండవచ్చు?

భారత్‌లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10 లక్షల నుండి రూ. 11 లక్షల వరకు ఉండవచ్చు. టాప్ హైబ్రిడ్ వేరియంట్ల ధర రూ. 18 లక్షలు ఉండే అవకాశం ఉంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికలు ఏమిటి?

ఇది 1.6 లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా లభిస్తుంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌లో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి?

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా లభిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Renault Triber కొనేవాళ్ల అసలు ఛాయిస్ ఇదే.. ఈ వేరియంట్‌లో ఫీచర్లు & పవర్ రెండూ పక్కా!
రెనాల్ట్‌ ట్రైబర్‌లో ఏ వేరియంట్ కొనాలి? రూ.8.53 లక్షలకే టర్బో ఇంజిన్‌తో అదిరిపోయే ప్యాకేజీ!
2026 Bajaj Pulsar NS125 కొత్త అవతార్.. ఇక LCD డిస్‌ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లు!
లాంచ్‌కు ముందే లీకైన 2026 పల్సర్ NS125 ఫొటోలు.. కొత్త రంగులు, కలర్ డిస్‌ప్లే!
First-Time Car Insurance: మీ కార్ ఇన్సూరెన్స్‌లో ఇవి ఉన్నాయా? పాలసీ తీసుకునే ముందు ఈ చెక్‌లిస్ట్ చూడండి
మొదటిసారి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Cheapest 7 Seater Cars: భారత్‌లో అత్యంత చౌకైన 7 సీటర్ కార్లు ఇవే.. మీకు ఏది బెస్ట్, ధర చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత చౌకైన 7 సీటర్ కార్లు ఇవే.. మీకు ఏది బెస్ట్, ధర చూసి కొనేయండి
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Embed widget