అన్వేషించండి

2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!

2026 హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ఐదు వేరియంట్లలో వచ్చింది. రూ.11.80 లక్షల నుంచి రూ.18.30 లక్షల ధరలతో లభిస్తోంది. ఇందులో ఏ వేరియంట్ కొనడం మంచిదో తెలుసుకోండి.

2026 Honda Elevate facelift variants: హోండా ఎలివేట్‌కు భారీ అప్‌డేట్ వచ్చింది. 2023లో మార్కెట్లోకి వచ్చిన ఈ ఎస్‌యూవీకి ఇదే తొలి ప్రధాన ఫేస్‌లిఫ్ట్. కొత్త ఎలివేట్‌లో డిజైన్ మారింది. క్యాబిన్‌లోనూ కొత్త ఫీచర్లు వచ్చాయి. మరింత ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది. 2026 హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ.11.80 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాప్ వేరియంట్ ధర రూ.18.30 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. మొత్తం ఐదు వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ అందుబాటులో ఉంది, అవి: SV, V, VX, ZX & ZX+.

వేరియంట్‌ వారీగా ధరలు, ఫీచర్లు

అన్ని వేరియంట్లలో ఇంజిన్‌లో మాత్రం మార్పు లేదు. 1.5 లీటర్, నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 హెచ్‌పీ పవర్ & 145 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ ఎంపికలు ఉన్నాయి. మాన్యువల్ వెర్షన్ 15.31 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీవీటీ వెర్షన్ 16.61 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

బేస్ SV వేరియంట్ ధర రూ.11.80 లక్షలు. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. 7 అంగుళాల ఎంఐడీ, పుష్ బటన్ స్టార్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

V వేరియంట్ ధర రూ.12.29 లక్షల నుంచి రూ.13.79 లక్షల వరకు ఉంది. SV వేరియంట్‌లో ఉన్న ఫీచర్లకు అదనంగా ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే ఉన్నాయి. హోండా కనెక్ట్, రియర్ వ్యూ కెమెరా కూడా లభిస్తాయి. సీవీటీ వెర్షన్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు

VX వేరియంట్ ధర రూ.13.93 లక్షల నుంచి రూ.15.39 లక్షల వరకు ఉంది. పై రెండు వేరియంట్లలో ఉన్న ఫీచర్లతో పాటు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, సన్‌రూఫ్, ఎల్‌ఈడీ లైట్ బార్స్, రూఫ్ రైల్స్ ఇందులో ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6 స్పీకర్ల ఆడియో సిస్టమ్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ZX వేరియంట్ ధర రూ.15.39 లక్షల నుంచి రూ.16.89 లక్షల వరకు ఉంది. ఇది ఫీచర్ల పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పైన చెప్పిన అన్ని ఫీచర్లతో పాటు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, లెదరెట్ సీట్లు ఇందులో ఉన్నాయి. ముందు వెంటిలేటెడ్ సీట్లు కూడా లభిస్తాయి.

భద్రత విషయంలోనూ ZX మరింత ముందుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ వంటి ADAS ఫీచర్లు ఉన్నాయి. ఆటో హై బీమ్, లీడ్ కార్ డిపార్చర్ అలర్ట్ కూడా లభిస్తాయి.

చివరిగా, టాప్‌ స్పెక్‌ ZX+ వేరియంట్. దీని ధర రూ.16.80 లక్షల నుంచి రూ.18.30 లక్షల వరకు ఉంటుంది. అన్ని వేరియంట్లలో ఉన్న ఫీచర్లతో పాటు పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, ముందు పార్కింగ్ సెన్సార్లు ఇందులో యాడ్‌ అవుతాయి.

ఇది కూడా చదవండి: రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?

డబ్బుకు తగిన విలువ

డబ్బుకు తగ్గ విలువ విషయంలో ZX వేరియంట్ ముందుంటుంది. జెడ్ఎక్స్+లో అదనపు సౌకర్యాలు ఉన్నా ధర కూడా పెరుగుతుంది. పెద్ద టచ్‌స్క్రీన్, మెరుగైన సీట్లు & ADAS ఫీచర్లు కావాలనుకునేవారికి జెడ్ఎక్స్ మంచి ఎంపిక. ధర, ఫీచర్లు & భద్రత మధ్య సమతుల్యత కోరుకునే వారికి ఇదే బెస్ట్ వేరియంట్‌గా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Wrong e-Challan: ట్రాఫిక్ రూల్స్‌ ఉల్లంఘించకపోయినా చలానా వచ్చిందా? రాంగ్‌ ఈ-చలాన్‌ను రద్దు చేయించడం ఎలా?
పొరపాటున మీకు ట్రాఫిక్‌ చలాన్ వచ్చిందా? కంగారు వద్దు.. ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి!
KTM 200 Duke కొత్త ఫీచర్లు లీక్.. 25hp పవర్‌తో మరింత స్పోర్టీ రైడింగ్, ధర స్వల్పంగా పెరిగే అవకాశం!
KTM 200 డ్యూక్‌ భలే అప్‌డేట్‌ అయిందిగా.. యూత్‌ స్పీడ్‌కు తగ్గట్లుగా కొత్తగా క్విక్‌షిఫ్టర్‌, రైడ్‌ మోడ్స్‌!
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
క్రెటా కంటే తక్కువ ధరకే Hyundai Bayon SUV లాంచ్‌.. HX6, HX8, HX10 వేరియంట్లలో మీకు ఏది బెస్ట్‌?
కొత్త హ్యుందాయ్ బేయాన్‌లో 7 ట్రిమ్‌లు, 11 వేరియంట్లు.. మీ డబ్బుకు తగ్గ విలువ ఇచ్చేది ఏది?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget