అన్వేషించండి

రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?

తెలుగు రాష్ట్రాల్లో ట్రయంఫ్ బోన్నెవిల్ T4 ఎక్స్ షోరూమ్ & ఆన్ రోడ్ ధరలు ఇవే. నెలకు ఎంత EMI కట్టాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Triumph Bonneville T4 Down Payment, Loan and EMI Details: ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో బ్రిటిష్ ఐకానిక్ బ్రాండ్ ట్రయంఫ్ తన కొత్త Triumph Bonneville T4 మోడల్‌ను భారత మార్కెట్‌ లాంచ్ చేసింది. క్లాసిక్ బోన్నెవిల్ డిజైన్ సొగసును మోడర్న్ ఇంజినీరింగ్‌తో కలిపి ఈ బైక్‌ను డిజైన్ చేసింది. కొత్త Bonneville T40తో పాటే ఈ బండిని కూడా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే, T40 కంటే తక్కువ ధరలోనే T4ను అందిస్తోంది.

ట్రయంఫ్ బోన్నెవిల్ T4 పవర్‌ఫుల్‌ ఇంజిన్ & ఫీచర్లు

ఈ మోడల్‌లో 350cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్‌ను అమర్చారు. ఇది 29 PS గరిష్ట పవర్ 31.2 Nm టాప్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ సహాయంతో లాంగ్ రైడ్లలో కూడా స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. సేఫ్టీ పరంగా ఇందులో డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, LED హెడ్‌లైట్స్ & డిజిటల్ TFT డిస్‌ప్లే అందుబాటులో ఉన్నాయి.

విజయవాడలో ఎక్స్ షోరూమ్ & ఆన్‌రోడ్ ధరలు

విజయవాడలో Triumph Bonneville T4 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 2.55 లక్షల రూపాయలు. RTO రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఇతర కస్టమ్ ఛార్జీలు కలిపితే బెజవాడలో ఆన్‌రోడ్ ధర సుమారు 3.04 లక్షల రూపాయలు అవుతుంది.

హైదరాబాద్‌లో ఎక్స్ షోరూమ్ & ఆన్‌రోడ్ ధరలు

హైదరాబాద్ నగరంలో కూడా Triumph Bonneville T4 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 2.55 లక్షల రూపాయలు. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ సహా అవసరమైన ఛార్జీలు, ఫీజులు కలిపి ఇక్కడ ఆన్‌రోడ్ ధర సుమారు 3.16 లక్షల రూపాయలు అవుతుంది.

 కనీస డౌన్‌పేమెంట్ & బ్యాంక్ ఫైనాన్స్ ఆఫర్లు

ఈ ప్రీమియం బైక్‌ను సొంతం చేసుకోవడానికి ప్రముఖ బ్యాంకులు & ఫైనాన్స్ కంపెనీలు కనీస డౌన్‌పేమెంట్ ఆఫర్లను అందిస్తున్నాయి. కస్టమర్‌ సిబిల్‌ స్కోర్‌ బాగా ఉంటే, ముందుగా కేవలం రూ.25,000 చెల్లించి ఈ బైక్‌ను డెలివరీ తీసుకోవచ్చు. మిగిలిన డబ్బును లోన్‌ రూపంలో అరేంజ్‌ చేయవచ్చు. ప్రస్తుతం ప్రముఖ బ్యాంకులు సంవత్సరానికి 8.5% నుంచి 14% వరకు వడ్డీతో ద్విచక్ర వాహన రుణాలు ఇస్తున్నాయి.

ఇది కూడా చదవండి: నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?

10% వార్షిక వడ్డీ రేటు చొప్పున వివిధ కాలపరిమితులకు EMI లెక్కలు

మీరు కనీస డౌన్‌పేమెంట్ రూ.25000 చెల్లించిన తర్వాత, మిగిలిన దాదాపు 2.91 లక్షల రూపాయలను రుణంగా తీసుకోవాలి. ఈ లోన్ మొత్తానికి 10% వడ్డీ రేటు అనుకుంటే, నెలకు చెల్లించాల్సిన EMI వివరాలు:

2 ఏళ్ల వ్యవధికి ‍‌(24 నెలలు): నెలకు రూ.14,532 EMI చెల్లించాలి.
3 ఏళ్ల వ్యవధికి (36 నెలలు): నెలకు రూ.10,495 EMI చెల్లించాలి.
4 ఏళ్ల వ్యవధికి (48 నెలలు): నెలకు రూ.8,477 EMI చెల్లించాలి.
5 ఏళ్ల వ్యవధికి (60 నెలలు): నెలకు రూ.7,266 EMI చెల్లించాలి.

ఒకవేళ మీరు రూ.1 లక్ష డౌన్‌పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన దాదాపు 2.16 లక్షల రూపాయలు లోన్‌ అవుతుంది. ఈ లోన్‌పై 10% వడ్డీ అనుకుంటే, నెలకు చెల్లించాల్సిన EMI వివరాలు:

2 ఏళ్ల వ్యవధికి ‍‌(24 నెలలు): నెలకు రూ.10,782 EMI చెల్లించాలి.
3 ఏళ్ల వ్యవధికి (36 నెలలు): నెలకు రూ.7,787 EMI చెల్లించాలి.
4 ఏళ్ల వ్యవధికి (48 నెలలు): నెలకు రూ.6,289 EMI చెల్లించాలి.
5 ఏళ్ల వ్యవధికి (60 నెలలు): నెలకు 5,391 EMI చెల్లించాలి.

ఇది కూడా చదవండి: Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి

బైక్ లోన్ తీసుకునేముందు వేర్వేరు బ్యాంకులు అందించే ప్రాసెసింగ్ ఫీజులు & హిడెన్ ఛార్జీలను సరిచూసుకోవడం మరిచిపోవద్దు. క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. లోన్ కాలపరిమితిని ఎంచుకునేటప్పుడు, వీలైనంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేసి & మీ నెలవారీ బడ్జెట్‌కు తగిన విధంగా 3 ఏళ్లు లేదా 4 ఏళ్ల ప్లాన్‌ను ఎంచుకోవడం ఆర్థికంగా సురక్షితం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?
ట్రయంఫ్ బొన్నెవిల్ T40 vs రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350, హోండా CB350C, జావా 350 - ఏది బెటర్‌?
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget