అన్వేషించండి

Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి

భారత్‌లో హోండా కంపెనీ XR300L, XR300 Rallyలను లాంచ్ చేసింది. వీటి ధర, ఫీచర్లతో పాటు ఇంజిన్, ఆఫ్‌రోడ్ హార్డ్‌వేర్, ఈ రెండు బైక్‌ల స్పెషాలిటీ తెలుసుకోండి..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా XR300L, Rally బైకులు ₹1.83, ₹2.08 లక్షలకు వచ్చాయి.
  • రెండు మోడళ్లలో శక్తివంతమైన 293.5cc ఇంజిన్, అధునాతన హార్డ్‌వేర్ ఉన్నాయి.
  • భారతదేశంలో తయారైన ఇవి KTM వంటి వాటికి గట్టి పోటీనిస్తాయి.

హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ భారత మార్కెట్లో అడ్వెంచర్, డ్యూయల్-స్పోర్ట్ సెగ్మెంట్‌ను బలోపేతం చేస్తోంది. అందులో భాగంగా 2 కొత్త బైక్స్ లాంచ్ చేసింది. కంపెనీ హోండా XR300L, XR300 Rallyలను అక్టోబర్ 5న భారత్‌లో లాంచ్ చేసింది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా 1.83 లక్షలు, 2.08 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు మన దేశంలో తయారవుతున్నాయి. వీటి విక్రయాలు హోండా బిగ్‌వింగ్ (Honda BigWing) డీలర్‌షిప్‌ల ద్వారా చేస్తున్నారు. ఈ 2 మోడళ్లు జూలైలో హోండా ప్రదర్శించిన 10 కొత్త టూ-వీలర్ల పెద్ద ప్రొడక్టులో భాగమని తెలిసిందే. హోండా XR300Lను మరింత వర్సటైల్ డ్యూయల్ స్పోర్ట్ బైక్‌గా నిలబెట్టాయి. హోండా XR300 Rallyని మరింత అడ్వెంచర్, ఆఫ్‌రోడ్ ఫోకస్ బైకుగా తీసుకొచ్చారు. అంటే హోండా ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి భిన్నమైన రైడర్లను టార్గెట్ చేస్తోంది. 

293.5 సీసీ ఇంజిన్‌తో పాటు పవర్ ఫుల్ హార్డ్‌వేర్

హోండా XR300L, హోండా XR300 Rally రెండింటిలోనూ 293.5cc ఎయిర్, ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇస్తున్నారు. అంతర్జాతీయ స్పెసిఫికేషన్ ఆధారంగా ఈ ఇంజిన్ 24.3 hp, 26.5 Nm ఔట్ పుట్ జనరేట్ చేస్తుంది. హోండా ఇంకా తన ఇండియా వెబ్‌సైట్‌లో బైక్‌ల పూర్తి స్పెసిఫికేషన్, పెర్ఫార్మెన్స్ వివరాలు అప్‌డేట్ చేయలేదు. రెండు బైక్‌లలో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, ప్రో-లింక్ రియర్ మోనోషాక్ వంటి హార్డ్‌వేర్ లభిస్తున్నాయి. ఇవి కాస్త అనుకూలంగా లేని రోడ్లపై జర్నీలో సహాయపడతాయి. వీటితోపాటు స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ABS, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC) అందించారు. XR300L డిజైన్ మరింత ప్రాక్టికల్ డ్యూయల్ స్పోర్ట్ లక్షణాలు కలిగి ఉంది.  Rally వెర్షన్‌లో  మరింత అడ్వెంచర్ టైప్ సెటప్ లభిస్తుంది.

XR300 Rally ఎందుకంత స్పెషల్ 

సాధారణ రోడ్లతో పాటు ఛాలెంజింగ్ ప్రదేశాలలో బైక్ నడపాలని కోరుకునే రైడర్ల కోసం హోండా XR300 Rallyని తయారు చేశారు. ఇందులో XR300Lతో పోలిస్తే మరింత బాడీవర్క్, పెద్ద విండ్‌స్క్రీన్ వస్తాయి. హోండా రోడ్‌సింక్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఇందులో భాగమే. మరోవైపు XR300Lతో పోల్చితే కొంచెం భిన్నంగా ఉంటుంది. 

రెండు బైక్‌ల బరువు, రైడింగ్ డైనమిక్స్ వాటి అడ్వెంచర్ ఫోకస్డ్ స్వభావానికి అనుగుణంగా ఇచ్చారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, హోండా ఈ 2 మోడళ్లను భారత మార్కెట్ కోసం దేశంలోనే తయారుచేసింది. దీని వల్ల కంపెనీకి ఈ సెగ్మెంట్‌లో తక్కువ ధరతో ఇతర కంపెనీలకు పోటీ ఇవ్వొచ్చు. KTM, ఇతర అడ్వెంచర్ బైక్‌లకు గట్టి పోటీ తప్పవని చెప్పవచ్చు.



Frequently Asked Questions

భారతదేశంలో కొత్త హోండా బైక్‌లు ఎప్పుడు విడుదలయ్యాయి, వాటి పేర్లు ఏమిటి?

హోండా XR300L మరియు XR300 Rally బైక్‌లు అక్టోబర్ 5న భారతదేశంలో విడుదలయ్యాయి. ఇవి అడ్వెంచర్, డ్యూయల్-స్పోర్ట్ సెగ్మెంట్‌ను బలోపేతం చేస్తాయి.

ఈ కొత్త హోండా బైక్‌ల ధరలు ఎంత, వాటిని ఎక్కడ కొనుగోలు చేయవచ్చు?

XR300L ధర రూ. 1.83 లక్షలు, XR300 Rally ధర రూ. 2.08 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటిని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఈ బైక్‌లలో ఏ ఇంజిన్ ఉపయోగించారు, ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

రెండింటిలోనూ 293.5cc ఎయిర్, ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ABS వంటి హార్డ్‌వేర్ ఫీచర్లు లభిస్తాయి.

XR300L మరియు XR300 Rally మధ్య ప్రధాన తేడా ఏమిటి?

XR300L అనేది బహుముఖ డ్యూయల్-స్పోర్ట్ బైక్. XR300 Rally అడ్వెంచర్, ఆఫ్-రోడ్ రైడింగ్‌పై దృష్టి పెడుతుంది. Rally వెర్షన్‌లో ఎక్కువ బాడీవర్క్, పెద్ద విండ్‌స్క్రీన్ ఉంటాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

చూడగానే ఆకట్టుకునే Honda 0 Alpha EV.. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో రాబోతోంది!
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో హోండా ఎలక్ట్రిక్ SUV.. దీనిని కొంటే అందరి కళ్లూ మీ మీదే!
స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!
స్కోడా కారు కొనేవాళ్లకు బంపర్‌ డిస్కౌంట్లు.. రూ.90,000 వరకు మిగులుతుంది!
విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Advertisement

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Embed widget