అన్వేషించండి

Honda Elevate Facelift కొత్త లుక్‌ అదిరిపోయింది.. కేవలం ₹21,000తో బుక్‌ చేసుకోవచ్చు

హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రూ.11.80 లక్షల ప్రారంభ ధరతో లాంచ్‌ అయింది. కొత్త డిజైన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు వచ్చాయి.

Honda Elevate Facelift Price, Mileage And Features Telugu: హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ కొత్త SUV ప్రారంభ ధర రూ.11.80 లక్షల ఎక్స్‌షోరూమ్ నుంచి స్టార్ట్‌ అవుతుంది. 2023లో మార్కెట్లోకి వచ్చిన ఎలివేట్‌కు ఇది తొలి ప్రధాన అప్‌డేట్. కొత్త మోడల్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా మార్పులు చేశారు. అయితే ఇంజిన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ₹21,000 చెల్లించి ఈ కారును ముందుగానే బుక్‌ చేసుకోవచ్చు. ఈ SUVలో మొత్తం ఐదు ప్రధాన వేరియంట్లు ఉన్నాయి. SV, V, VX, ZX, ZX+ పేర్లతో ఇవి అందుబాటులో ఉంటాయి. ZX+ వేరియంట్‌లో బ్లాక్ ఎడిషన్ కూడా లభిస్తుంది.

హోండా ఎలివేట్ ధరలు

SV వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రూ.11.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. V వేరియంట్ మాన్యువల్ ధర రూ.12.29 లక్షలు కాగా, CVT ధర రూ.13.79 లక్షలు. VX మాన్యువల్ ధర రూ.13.93 లక్షలు, CVT ధర రూ.15.39 లక్షలు.

ZX వేరియంట్ మాన్యువల్ ధర రూ.15.39 లక్షలు కాగా, CVT ధర రూ.16.89 లక్షలు. ZX+ మాన్యువల్ ధర రూ.16.80 లక్షలు, CVT ధర రూ.18.30 లక్షలు. ZX+ బ్లాక్ ఎడిషన్ ధరలు వరుసగా రూ.16.90 లక్షలు & రూ.18.40 లక్షలుగా ఉన్నాయి.

కొత్త లుక్‌లో ఎలివేట్

ఫేస్‌లిఫ్ట్‌లో బయటి డిజైన్‌ను పూర్తిగా మార్చలేదు. అయితే, ముందు భాగంలో కొత్త లైటింగ్ డిజైన్ తీసుకొచ్చారు. గ్రిల్ పైన కొత్త సెగ్మెంటెడ్ LED DRL స్ట్రిప్ ఉంటుంది. ఇది రెండు LED హెడ్‌ల్యాంప్‌లను కలుపుతుంది.

గ్రిల్‌ను కూడా స్వల్పంగా మార్చారు. కొత్త మెష్ డిజైన్‌తో పాటు గ్లోస్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లకు బాడీ కలర్ ఫినిష్ వచ్చింది. హోండా లోగోను గ్రిల్ నుంచి బానెట్ ముందుభాగానికి మార్చారు.

వెనుక భాగంలో కొత్త LED లైట్ బార్ వచ్చింది. ఇది రెండు టెయిల్ ల్యాంప్‌లను కలుపుతుంది. అయితే మొత్తం డిజైన్ మాత్రం పాత మోడల్‌కు దగ్గరగానే ఉంటుంది. అల్లాయ్ వీల్స్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్తగా నార్డిక్ ఫారెస్ట్ పెర్ల్ రంగును అందిస్తున్నారు. ఇది సింగిల్ టోన్ & డ్యూయల్ టోన్ ఆప్షన్లలో లభిస్తుంది. బాడీ చుట్టూ ఉన్న క్లాడింగ్‌కు కూడా గ్లోస్ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో కారు తీసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ 5 యాక్సెసరీస్ ఉంటే టెన్షన్ ఉండదు!

ఫీచర్లలో భారీ మార్పులు

క్యాబిన్‌లో ఫీచర్ల పరంగా మరిన్ని మార్పులు చేశారు. వెనుక సీట్లకు వెంటిలేషన్ ఫంక్షన్ ఈ విభాగంలో తొలిసారిగా అందిస్తున్నారు. ముందు రెండు సీట్లకు పవర్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు వెంటిలేషన్ సౌకర్యం వచ్చింది.

కొత్త 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. కెపాసిటివ్ టచ్ రియర్ LED రీడింగ్ ల్యాంప్స్‌ను కూడా అందించారు. CVT వేరియంట్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో పాటు ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా లభిస్తుంది.

డ్యాష్‌బోర్డ్‌లో కూడా స్వల్ప మార్పులు చేశారు. ఫాక్స్ వుడ్ ట్రిమ్ స్థానంలో ఎక్కువ వైట్ లెదరెట్ ప్యాడింగ్ & స్టిచింగ్ ఇచ్చారు. ఎత్తైన వేరియంట్లలో యాంబియంట్ లైటింగ్‌ను ఇప్పుడు కంపెనీ నుంచే అందిస్తున్నారు.

భద్రతలోనూ అప్‌డేట్

భద్రత విషయంలో ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి. ముందు పార్కింగ్ సెన్సార్లు, వెనుక డిస్క్ బ్రేక్‌లు కొత్తగా వచ్చాయి. హోండా సెన్సింగ్ ADAS వ్యవస్థలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌కు తక్కువ వేగంలో ఫాలో ఫంక్షన్ కూడా అందించారు. ఇది CVT వేరియంట్లలో మాత్రమే ఉంటుంది.

10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, లేన్ వాచ్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్ & వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి.

క్యాబిన్ శబ్దం తగ్గుతుందా?

ఎలివేట్ పాత మోడల్‌లో క్యాబిన్‌లో ఇంజిన్ శబ్దం ఎక్కువగా వినిపిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫేస్‌లిఫ్ట్‌లో అదనపు సౌండ్ డ్యాంపింగ్ మెటీరియల్ ఉపయోగించినట్లు హోండా తెలిపింది. దీంతో క్యాబిన్ మరింత నిశ్శబ్దంగా మారుతుందని కంపెనీ చెబుతోంది. అయితే దీనిని టెస్ట్‌ డ్రైవ్ చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ధారించవచ్చు.

ఇది కూడా చదవండి: గూగుల్‌ మ్యాప్స్‌ మిర్రరింగ్‌ ఉన్న 8 బైక్‌లు.. పూర్తిగా కొత్త ప్రదేశంలోనూ ఈజీగా దారి తెలుసుకోవచ్చు!

ఇంజిన్‌లో మార్పు లేదు

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో పాత 1.5 లీటర్ నాలుగు సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 121hp గరిష్ఠ శక్తి & 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. మాన్యువల్ వేరియంట్ 15.31kpl మైలేజీ ఇస్తుందని హోండా చెబుతోంది. CVT వేరియంట్ 16.61kpl మైలేజీ ఇస్తుంది.

సిటీ మోడల్‌లో ఉన్న 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఎలివేట్‌కు మాత్రం ఇవ్వలేదు.

మొత్తంగా చూస్తే.. హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధాన మార్పులు డిజైన్ & ఫీచర్ల చుట్టూనే ఉన్నాయి. ఇంజిన్, గేర్‌బాక్స్‌లను మాత్రం యథాతథంగా ఉంచారు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా వంటి మిడ్‌సైజ్ SUVలకు ఇది పోటీ ఇస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టాటా ఏరిస్ iCNG కొనబోతున్నారా? ముందు ఈ 2 మైనస్‌ల గురించి తప్పక తెలుసుకోండి
Tata Aeris CNG కారు కొనొచ్చా, లేదా? ప్లస్‌లు, మైనస్‌లు తెలిస్తే నిర్ణయం ఈజీ
నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?
TVS Apache RTR 160 4V కొనడానికి రూ.25,000 ఉంటే చాలు, మిగిలిన డబ్బును బ్యాంక్‌ లోన్‌గా ఇస్తుంది!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
సరికొత్తగా మార్కెట్లోకి Skoda Slavia Facelift.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే.. ఫీచర్ల వివరాలు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Elevated Corridor: కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు రద్దు.. రూ.1090 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Embed widget