టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్
టాటా ఎలక్ట్రిక్ కార్లపై అక్టోబర్ 2026లో భారీ డిస్కౌంట్లు. హారియర్ ఈవీపై రూ.2.75 లక్షలు, కర్వ్ ఈవీపై రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు.

Tata Cars Discounts October 2026: టాటా ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునేవాళ్లకు గుడ్ న్యూస్. ఈ దసహా పండుగ గుర్తుండిపోయేలా, అక్టోబర్ 2026లో, టాటా మోటార్స్ చాలా EV మోడళ్లపై రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. Harrier EV, Curvv EV, Nexon EVతో పాటు పాత మోడళ్లైన Punch EV & Tiago EVపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి నగదు డిస్కౌంట్, ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ ప్రయోజనం, ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. ఈ ఆఫర్లు అక్టోబర్ నెల మొత్తం అందుబాటులో ఉంటాయి.
Tata Harrier EV
టాటా హారియర్ ఈవీపై గరిష్ఠంగా రూ.2.75 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. ఫియర్లెస్+ & ఎంపవర్డ్ వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో రూ.1 లక్ష ప్రత్యేక ఆఫర్, రూ.75,000 వరకు ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, రూ.1 లక్ష వరకు లాయల్టీ ప్రయోజనం ఉన్నాయి. టాప్-స్పెక్ ఎంపవర్డ్ AWD స్టెల్త్ ACFC వేరియంట్‌కు ప్రత్యేక ఆఫర్ రూ.50,000గా ఉంటుంది. దీంతో మొత్తం ప్రయోజనం రూ.2.25 లక్షలకు పరిమితం అవుతుంది.
హారియర్ ఈవీ అడ్వెంచర్ వేరియంట్లపై రూ.75,000 ప్రత్యేక ఆఫర్ ఉంది. ఇతర ప్రయోజనాలతో కలిపి గరిష్ఠంగా రూ.2.50 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. హారియర్ ఈవీ ధర రూ.21.79 లక్షల నుంచి ప్రారంభమై రూ.29.79 లక్షల వరకు ఉంది.
Curvv EV
కర్వ్ ఈవీపై ఏకంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనం లభిస్తోంది. అయితే ఇది మే 2026లో సిరీస్X అప్డేట్కు ముందు వచ్చిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. వీటిపై రూ.3 లక్షల నగదు డిస్కౌంట్ & రూ.35,000 వరకు ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. బేస్ క్రియేటివ్ వేరియంట్‌కు నగదు డిస్కౌంట్ రూ.2.50 లక్షలు. దీంతో మొత్తం ప్రయోజనం రూ.2.85 లక్షలు.
ప్రస్తుతం విక్రయిస్తున్న కర్వ్ ఈవీ సిరీస్X వేరియంట్లపై గరిష్ఠంగా రూ.65,000 ప్రయోజనం ఉంది. ఇందులో రూ.35,000 వరకు ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ & రూ.30,000 లాయల్టీ ప్రయోజనం ఉన్నాయి. కర్వ్ ఈవీ ధర రూ.17.19 లక్షల నుంచి రూ.19.39 లక్షల వరకు ఉంది.
ఇది కూడా చదవండి: 2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
Nexon EV
నెక్సాన్ ఈవీపై కూడా ఆఫర్ ఉంది. అన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.45,000 ప్రయోజనం లభిస్తోంది. ఇందులో రూ.10,000 నగదు డిస్కౌంట్ & రూ.35,000 వరకు ఎక్స్చేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి రూ.17.69 లక్షల వరకు ఉంది.
Punch EV
పాత మోడల్ పంచ్ ఈవీపైనా ఆఫర్లు ప్రకటించారు. 35kWh లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.45 లక్షల ప్రయోజనం లభిస్తోంది. 25kWh మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం ఉంది. బేస్ స్మార్ట్ వేరియంట్‌పై రూ.95,000 వరకు లభిస్తుంది.
పాత Tiago EVపై రూ.1.45 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. XT లాంగ్ రేంజ్ వేరియంట్‌పై ఈ గరిష్ఠ ప్రయోజనం లభిస్తుంది. XZ+ లాంగ్ రేంజ్ వేరియంట్‌పై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనం ఉంది. మీడియం రేంజ్ వేరియంట్లపై రూ.65,000 వరకు ప్రయోజనం లభిస్తోంది.
ఇది కూడా చదవండి: Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్ ఎన్ఫీల్డ్, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్ ఆప్షన్?
అయితే ఈ ఆఫర్లలో కొన్ని పాత స్టాక్‌కు మాత్రమే పరిమితం & నగరాన్ని బట్టి ప్రయోజనాల్లో మార్పులు ఉండొచ్చు. కాబట్టి, డీలర్ వద్ద వేరియంట్, స్టాక్ & స్థానిక ఆఫర్లను నిర్ధారించుకున్న తర్వాతే బుకింగ్ చేయడం మంచిది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















