అన్వేషించండి

Triumph Bonneville T40 vs పోటీ బైక్‌లు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, హోండా, జావా.. ధర, ఫీచర్లలో ఏది బెటర్‌ ఆప్షన్‌?

ట్రయంఫ్ బొన్నెవిల్ T40ను రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా CB350C, జావా 350తో పోలిస్తే పవర్, ఫీచర్లు, బరువు, ధరలో ఎలా ఉందో తెలుసుకోండి.

Triumph Bonneville T40 vs Rival Bikes: ట్రయంఫ్ బొన్నెవిల్ T40 భారత మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టింది. రెట్రో లుక్‌ + మోడ్రన్‌ టచ్‌తో వచ్చిన ఈ బైక్‌కు 350cc విభాగంలో గట్టి పోటీ ఉంది. Royal Enfield Classic 350 ఇప్పటికే ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. Honda CB350C & Jawa 350 కూడా తమదైన శైలిలో పోటీ ఇస్తున్నాయి. అయితే.. కొత్తగా వచ్చిన Bonneville T40 ఈ బైక్‌ల కంటే పవర్, టెక్నాలజీ విషయంలో ముందంజలో ఉంది. అదే సమయంలో ధర కూడా ఎక్కువగానే ఉంది. మరి ఇంజిన్, పరిమాణం, ఫీచర్లు & ధర విషయంలో ఈ నాలుగు బైక్‌లలో ఏది మెరుగ్గా ఉందో ఈ కథనంలో విశ్లేషిద్దాం.

పవర్ విషయంలో బొన్నెవిల్ T40దే పైచేయి

ట్రయంఫ్ బొన్నెవిల్ T40లో 350cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7,000rpm వద్ద 29hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5,500rpm వద్ద 31.2Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 349cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 20.2hp శక్తి & 27Nm టార్క్ ఇస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.

హోండా CB350Cలో 348.36cc ఇంజిన్ ఉంది. ఇది 21hp శక్తి & 29.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జావా 350లో 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండగా, ఇది 22.57hp శక్తి & 28.1Nm టార్క్ అందిస్తుంది.

అంటే ఈ నాలుగు బైక్‌లలో బొన్నెవిల్ T40కే అత్యధిక పవర్ & టార్క్ ఉన్నాయి. పవర్ టు వెయిట్ నిష్పత్తిలో కూడా ట్రయంఫ్ ముందంజలో ఉంది.

బరువు, పరిమాణంలో ఏది బెస్ట్?

బొన్నెవిల్ T40లో 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165mm. దీని బరువు 195kg. సీట్ హైట్ 790mm. వీల్‌బేస్ 1,418mm.

క్లాసిక్ 350లో 13 లీటర్ల ట్యాంక్, 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. బరువు 195kg. సీట్ హైట్ 805mm. వీల్‌బేస్ 1,390mm.

హోండా CB350C ఈ విభాగంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని బరువు 186kg మాత్రమే. 15.2 లీటర్లతో అతిపెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇందులోనే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 165mm. సీట్ హైట్ 800mm. వీల్‌బేస్ 1,441mm.

జావా 350 బరువు సుమారు 193kg. గ్రౌండ్ క్లియరెన్స్ 178mm. సీట్ హైట్ 790mm. వీల్‌బేస్ 1,449mm.

సీట్ హైట్‌ విషయంలో T40, జావా 350కి ప్లస్‌ పాయింట్స్‌ పడతాయి. తక్కువ బరువు విషయంలో మాత్రం హోండా CB350C ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి: నెలకు రూ.2500 EMIతో TVS Apache RTR 160 4V కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, లోన్‌ ఎంత వస్తుంది?

బ్రేకులు, టైర్లు, సస్పెన్షన్

నాలుగు బైక్‌లలోనూ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్ & వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెట్రో బైక్‌లకు సరిపోయే సంప్రదాయ సస్పెన్షన్ సెటప్‌ను అన్ని కంపెనీలు కొనసాగించాయి.

బొన్నెవిల్ T40లో ముందు 310mm డిస్క్, వెనుక 255mm డిస్క్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఉంటుంది.

క్లాసిక్ 350లో ముందు 300mm, వెనుక 270mm డిస్క్‌లు ఉన్నాయి. CB350Cలో ముందు 310mm, వెనుక 240mm డిస్క్‌లు ఉన్నాయి. జావా 350లో ముందు 280mm, వెనుక 240mm డిస్క్‌లు ఉన్నాయి. నాలుగు బైక్‌లలోనూ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది.

టైర్ల విషయంలో కూడా పెద్ద తేడాలు లేవు. క్లాసిక్ 350 & CB350C ముందు 19 అంగుళాల వీల్స్‌తో వస్తాయి. T40 & జావా 350లో 18 అంగుళాల ముందు వీల్స్ ఉన్నాయి.

ఫీచర్లలో ట్రయంఫ్ చాలా ముందుంది

ఫీచర్ల విషయంలో బొన్నెవిల్ T40 తన ప్రత్యర్థి బైక్‌ల కంటే స్పష్టంగా ముందుంది. ఇందులో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంది. 4 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేను అందించారు.

ఈ మోటార్‌ సైకిల్‌లో 5 రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, రోడ్, రైన్ & రెండు కస్టమైజ్ చేసుకునే రైడర్ మోడ్‌లు ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ & క్రూయిజ్ కంట్రోల్ కూడా స్టాండర్డ్‌గా లభిస్తాయి.

హోండా CB350Cలో డ్యూయల్ ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, HSTC ట్రాక్షన్ కంట్రోల్ & హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ ఉన్నాయి. అయితే ఈ ఫీచర్లలో కొన్ని అధిక వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి.

ఇది కూడా చదవండి: Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి

ధరలో మాత్రం ట్రయంఫ్ ఖరీదైనదే

బొన్నెవిల్ T40 ధర రూ.2.80 లక్షలు. ఈ నాలుగు బైక్‌లలో ఇదే అత్యంత ఖరీదైనది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ.1.89 లక్షల నుంచి రూ.2.26 లక్షల వరకు ఉంది. హోండా CB350C ధర రూ.2 లక్షల నుంచి రూ.2.04 లక్షల వరకు ఉంటుంది. జావా 350 ధర రూ.2.11 లక్షల నుంచి రూ.2.21 లక్షల వరకు ఉంది.

ట్రయంఫ్.. T40 కంటే తక్కువ ధరలో బొన్నెవిల్ T4ను కూడా తీసుకొచ్చింది. దీని ధర రూ.2.55 లక్షలు. అయినప్పటికీ క్లాసిక్ 350 టాప్ వేరియంట్ కంటే ఇది రూ.29,000 ఎక్కువే.

ఇంకా తక్కువ ధరలో రెట్రో బైక్ కావాలంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కూడా ఉంది. దీని ధర రూ.1.67 లక్షల నుంచి రూ.2.11 లక్షల వరకు ఉంటుంది. ట్రయంఫ్ బ్రాండ్‌లోనే స్పీడ్ T4 రూ.2.10 లక్షల ధరతో అందుబాటులో ఉంది.

మొత్తంగా చూస్తే.. బొన్నెవిల్ T40 పవర్, టెక్నాలజీ & ఆధునిక ఫీచర్లలో ప్రత్యర్థుల కంటే బెటర్‌గా ఉంది. అయితే, దానికి తగ్గట్టే ధర కూడా ఎక్కువ. క్లాసిక్ 350 ధర, బ్రాండ్ విలువ విషయంలో బలంగా ఉంది. హోండా CB350C తక్కువ బరువు & పెద్ద ఫ్యూయల్ ట్యాంక్‌తో ఆకట్టుకుంటుంది. జావా 350 మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో నిలుస్తుంది. కాబట్టి సంప్రదాయ రెట్రో అనుభూతి కావాలా, లేక ఆధునిక ఫీచర్లతో కూడిన ప్రీమియం రెట్రో బైక్ కావాలా అనేదే కొనుగోలు నిర్ణయంలో కీలకం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget