అన్వేషించండి

Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌

దీపావళి పండుగ సందర్భంగా హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ విర్టస్, హ్యుందాయ్ వెర్నా సహా టాప్ 5 సెడాన్లపై రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

Diwali 2026 Offers On Sedans: దీపావళి పండుగ దగ్గరపడుతోంది. ఈ సందర్భంగా, కార్ల కంపెనీలు పండుగ సీజన్ అమ్మకాలను పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కాంపాక్ట్ SUVలు, హ్యాచ్‌బ్యాక్ కార్లపై అందుబాటులో ఉన్న ప్రయోజనాల గురించి ఇప్పటికే 'abp దేశం' కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు సెడాన్ కార్ల వంతు వచ్చింది. కొన్ని పాపులర్‌ సెడాన్లపై రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. మరికొన్ని మోడళ్లపై రూ.50,000 నుంచి రూ.80,000 వరకు తగ్గింపులు ఉన్నాయి.

Honda City: రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు

ఈ జాబితాలో హోండా సిటీ మొదటి స్థానంలో ఉంది. దీని పెట్రోల్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. మాస్ మార్కెట్ సెడాన్లలో ఇదే అత్యధిక ఆఫర్. ఈ ఆఫర్‌లో రూ.60,000 వరకు నగదు తగ్గింపు ఉంది. ఏదైనా పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.50,000 వరకు బోనస్ లభిస్తుంది. పాత హోండా కారుకు అదనంగా రూ.6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రూ.4,000 వరకు లాయల్టీ బోనస్, రూ.5,000 వరకు కార్పొరేట్ ప్రయోజనం ఉన్నాయి.

అన్ని వేరియంట్లతో పాటు రూ.19,000 విలువైన డ్యాష్‌క్యామ్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఎక్స్‌టెండెడ్ వారంటీపై రూ.16,900 తగ్గింపు కూడా ఉంది. హోండా సిటీ ధరలు రూ.12.08 లక్షల నుంచి రూ.17.44 లక్షల వరకు ఉన్నాయి.

సిటీ హైబ్రిడ్‌పై మాత్రం ఈ స్థాయిలో ఆఫర్లు లేవు. ఇప్పటికే హోండా కస్టమర్లుగా ఉన్నవారికి రూ.6,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 లాయల్టీ బోనస్, రూ.5,000 కార్పొరేట్ ప్రయోజనం అందిస్తున్నారు. దీని ధర రూ.21.44 లక్షలు.

Volkswagen Virtus: రూ.80,000 వరకు ప్రయోజనాలు

వోక్స్‌వ్యాగన్ విర్టస్‌పై కూడా దీపావళి సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ సెడాన్‌పై మొత్తం రూ.80,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ.50,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ విర్టస్ ధరలు రూ.10.71 లక్షల నుంచి రూ.19.20 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?

Hyundai Verna: రూ.80,000 వరకు డిస్కౌంట్

హ్యుందాయ్ వెర్నాపై గరిష్ఠంగా రూ.80,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.40,000 వరకు నగదు తగ్గింపు, రూ.10,000 వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. దీనితో పాటు స్క్రాపేజ్ బోనస్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌లో ఒకదానిని ఎంచుకోవచ్చు. పాత కారును స్క్రాప్ చేస్తే రూ.25,000 వరకు బోనస్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.20,000 వరకు ప్రయోజనం ఉంటుంది. కొన్ని ఎంపిక చేసిన పాత కార్ల యజమానులకు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.30,000 వరకు పెరుగుతుంది.

ఈ ప్రత్యేక జాబితాలో Maruti Alto K10, Hyundai i10, Hyundai i20, Maruti Swift, Maruti Dzire, Maruti Baleno, Maruti Celerio, Maruti S Presso, Maruti Wagon R, Maruti Ignis, Tata Tiago ఉన్నాయి. ఈ ఆఫర్లు వెర్నాలోని అన్ని వేరియంట్లకు వర్తిస్తాయి. దీని ధర రూ.10.99 లక్షల నుంచి రూ.18.31 లక్షల వరకు ఉంది.

Honda Amaze: రూ.43,000 వరకు ప్రయోజనాలు

హోండా అమేజ్‌పై రూ.43,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ.15,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.21,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటికి అదనంగా రూ.4,000 వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ.3,000 వరకు కార్పొరేట్ బోనస్ లభిస్తాయి.

హోండా సిటీ మాదిరిగానే అమేజ్ ఎక్స్‌టెండెడ్ వారంటీపై కూడా రూ.16,900 తగ్గింపు ప్రకటించారు. హోండా అమేజ్ ధరలు రూ.7.65 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!

Hyundai Aura: రూ.40,000 వరకు ప్రయోజనాలు

ఈ జాబితాలో చివరి స్థానంలో హ్యుందాయ్ ఆరా ఉంది. దీని CNG వేరియంట్లపై రూ.30,000 వరకు నగదు తగ్గింపు ఆఫర్‌ ఉంది. పెట్రోల్ వేరియంట్లపై ఈ తగ్గింపు రూ.15,000 వరకు ఉంది. అన్ని వేరియంట్లకు రూ.5,000 వరకు స్క్రాపేజ్ బోనస్, మరో రూ.5,000 వరకు గ్రామీణ ప్రాంతాల ప్రత్యేక ఆఫర్ కూడా లభిస్తుంది. వీటితో కలిపి గరిష్ఠంగా రూ.40,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

నగరాన్ని బట్టి డిస్కౌంట్లు, ప్రయోజనాలు మారవచ్చు. డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న స్టాక్‌పై కూడా ఆఫర్లు ఆధారపడి ఉంటాయి. కచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్‌ను సంప్రదించాలి.

గమనిక: అన్ని కార్ల ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో
సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!
టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం రూ.4.5 లక్షలే.. సింగిల్‌ ఛార్జ్‌తో 320km!
Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget