అన్వేషించండి

Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్

దీపావళికి కారు కొనడం మంచిదేనా లేదా డిసెంబర్ ఇయర్ ఎండ్ సేల్ కోసం వేచి చూడాలా అని ఆలోచిస్తుంటారు. ఆ సమయాల్లో లభించే ప్రయోజనాలు, రీసేల్ వ్యాల్యూ వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దీపావళికి పండుగ ఆఫర్లు, నచ్చిన మోడల్స్ అందుబాటులో.
  • డిసెంబర్‌లో భారీ డిస్కౌంట్లు, డీలర్లు పాత స్టాక్ తగ్గిస్తారు.
  • డిసెంబర్‌లో కొంటే కారు రీసేల్ విలువ, మోడల్ సంవత్సరం తగ్గుతుంది.
  • వ్యక్తిగత అవసరాలను బట్టి కొనుగోలు సమయాన్ని ఎంచుకోవాలి.

భారత్‌లో దీపావళి రాగానే కారు షోరూమ్‌లలో కస్టమర్ల రద్దీ కనిపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రకాల పండుగ ఆఫర్లు ఉన్నాయి. దాంతో దీపావళికి వాహనం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. దీపావళి తర్వాత డిసెంబర్‌లో కూడా వాహనాలపై సంవత్సరం ముగింపు ఆఫర్లు కొనసాగుతాయి. దీంతో చాలా మందికి దీపావళికి కారు కొనాలా లేక డిసెంబర్‌లో కొంటే ఎక్కువ ప్రయోజనమా అనే గందరగోళం ఏర్పడుతుంది. వాహనం ఎప్పుడు కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

దీపావళికి కొంటే కలిగే ప్రయోజనాలు

దీపావళి పండుగ సమయంలో కారు కొనడం వల్ల అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే.. ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్‌షిప్‌లు కస్టమర్లను ఆకర్షించడానికి అనేక పండుగ ప్యాకేజీలను ఇస్తాయి. ఇందులో ఆకర్షణీయమైన క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ మినహాయింపులు, ఫ్రీ యాక్సెసరీలు ఉంటాయి. ఈ సమయంలో డీలర్‌షిప్‌ల వద్ద వాహనాల స్టాక్ ఎక్కువగా  ఉంటుంది. దీని ద్వారా మీకు నచ్చిన మోడల్, కావాల్సిన కలర్, సరిగ్గా సరిపోయే వేరియంట్‌ సులభంగా పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌ను మన దేశంలో కొత్త ప్రారంభానికి, పెట్టుబడులకు అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

డిసెంబర్‌లో కారు కొంటే కలిగే ప్రయోజనాలు

మీరు కొన్నిరోజులు వేచి ఉండి డిసెంబర్ నెలలో కారు కొనుగోలు చేస్తే మీకు అధిక ప్రయోజనం లభిస్తుంది. సంవత్సరపు చివరి నెలలో అన్ని కారు కంపెనీలు, డీలర్లు తమ వార్షిక సేల్స్ టార్గెట్స్ పూర్తి చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటారు. తమ పాత స్టాక్‌ను పూర్తి చేయడానికి డీలర్లు ఈ సమయంలో దీపావళితో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో క్యాష్ డిస్కౌంట్లు, ఫ్రీ ఇన్సూరెన్స్, బంపర్ ఎక్స్ఛేంజ్ బెనిఫిల్స్ ఆఫర్ చేస్తారు. కొన్నిసార్లు అక్టోబర్- నవంబర్‌లో మీ బడ్జెట్‌కు మించి ఉన్న వాహనాలు, డిసెంబర్‌లో భారీ డిస్కౌంట్లతో మీ బడ్జెట్‌కు కాస్త దగ్గరగా వస్తాయి. 

డిసెంబర్‌లో కొనడం వల్ల కలిగే నష్టం

డిసెంబర్‌లో లభించే భారీ డిస్కౌంట్ల వెనుక కొన్ని ఇబ్బందులు, నష్టాలున్నాయి. మీరు డిసెంబర్ 20న ఒక కారు కొనుగోలు చేస్తే, ఆర్‌సి (RC), తయారీ రికార్డుల ప్రకారం మీ కారు మోడల్ 2026 ఏడాదికి చెందినదిగా భావిస్తారు. మీరు కొన్నిరోజులు వేచి ఉండి 2027 జనవరిలో వాహనాన్ని కొనుగోలు చేస్తే, అది కొత్త తయారీ సంవత్సరానికి చెందినదిగా భావిస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీ వాహనాన్ని అమ్మే సమయంలో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో కొనుగోలుదారులు ఎల్లప్పుడూ తయారీ సంవత్సరాన్ని చూస్తారు. డిసెంబర్ లో వాహనం కావడం వల్ల మీకు దాని రీసేల్ వ్యాల్యూ కొంచెం తక్కువగా లభిస్తుంది.

ఇప్పుడు మీకు ఏ సమయం సరైనదనే విషయం మీ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీకు నచ్చిన కలర్, వేరియంట్, లేటెస్ట్ తయారీ సంవత్సరం వెహికల్ కావాలనుకుంటే, అలాగే పండుగ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావిస్తే, దీపావళి పండుగకే కారు కొనుగోలు చేయాలి.

వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయడమే అయితే, మోడల్ సంవత్సరం పాతదవ్వడం వల్ల పెద్దగా తేడా ఉండదనుకుంటే, స్టాక్ ముగిసినప్పటికీ అందుబాటులో ఉన్న ఆప్షన్‌లతో సర్దుకుపోతారు. అలాంటివాళ్లు డిసెంబర్ ఇయర్-ఎండ్ సేల్ వరకు వేచి చూడటం మీకు మంచి డీల్‌గా మారుతుంది.

Frequently Asked Questions

దీపావళి సమయంలో కారు కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీపావళికి కంపెనీలు ఆకర్షణీయమైన క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫ్రీ యాక్సెసరీలు అందిస్తాయి. ఈ సమయంలో డీలర్ల వద్ద స్టాక్ ఎక్కువగా ఉండటంతో మీకు నచ్చిన మోడల్, కలర్ సులభంగా లభిస్తాయి.

డిసెంబర్‌లో కారు కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

డిసెంబర్‌లో డీలర్లు తమ సేల్స్ టార్గెట్స్ పూర్తి చేయడానికి, పాత స్టాక్ క్లియర్ చేయడానికి దీపావళితో పోలిస్తే భారీ క్యాష్ డిస్కౌంట్లు, ఫ్రీ ఇన్సూరెన్స్ వంటివి అందిస్తారు. ఇది ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి సహాయపడుతుంది.

డిసెంబర్‌లో కారు కొనడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా?

అవును, డిసెంబర్‌లో కొన్న కారు తయారీ సంవత్సరం ప్రస్తుత సంవత్సరం అవుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనాన్ని అమ్మేటప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో దాని రీసేల్ వ్యాల్యూ కొంత తక్కువగా లభించే అవకాశం ఉంది.

కారు కొనడానికి దీపావళి మంచిదా లేక డిసెంబర్‌లో కొంటే ప్రయోజనమా?

మీకు నిర్దిష్ట మోడల్, కలర్, లేటెస్ట్ తయారీ సంవత్సరం కావాలంటే దీపావళి మంచిది. ఎక్కువ డబ్బు ఆదా చేయాలనుకుంటే, మోడల్ సంవత్సరం పాతదైనా పర్వాలేదనుకుంటే డిసెంబర్ వరకు వేచి చూడవచ్చు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Embed widget