Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anakapalli OTT Platform : రీసెంట్ విలేజ్ రొమాంటిక్ డ్రామా అనకాపల్లి ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Vikram Sahidev's Action Thriller Anakapalli OTT Release Date Locked : రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విలేజ్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా 'అనకాపల్లి' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన 'అనకాపల్లి' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (SunNXT)లో నవంబర్ 3 (గురువారం) నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ఊహించని మలుపులు, మర్చిపోలేని క్షణాలు కలిసినప్పుడు... ఒక అద్భుతమైన ప్రయాణానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించగా... విక్రమ్, సంధ్యా వశిష్టలతో పాటు తారక్ పొన్నప్ప, త్రినాథరావు నక్కిన, ఇంద్రజ, నందిని రాయ్, సంగీత క్రిష్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవ్జాండ్ మ్యూజిక్ అందించగా... నక్కిన నరేటివ్స్, భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
'అనకాపల్లి' ప్రాంతంలో పేరు మోసిన రౌడీ షీటర్ బుల్లెట్ (తారక్ పొన్నప్ప). అతని పేరు చెబితేనే అందరికీ భయం. డ్రగ్స్ వ్యాపారం చేసే నాయుడు (కాండ్రేగుల నాయుడు)తో బుల్లెట్ తరచూ గొడవలు పడుతుంటాడు. ఇదే ప్రాంతంలో విద్యుత్ శాఖ ఏఈగా నిజాయతీగా పని చేస్తుంటాడు సాంబశివరావు (త్రినాథరావు నక్కిన). అతని కొడుకు సూర్య (విక్రమ్ సహిదేవ్) తండ్రి నిజాయతీపై ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటాడు. తమ ప్రాంతంలో బుల్లెట్ హవా చేసి అతని యాటిట్యూడ్‌పై ఆకర్షితుడవుతాడు.
అలా, బుల్లెట్ గ్యాంగ్‌లో చేరిన సూర్య... అతనికి క్రమంగా కుడి భుజంగా మారతాడు. ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే అనుచరుడు నాయుడిని మర్డర్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బుల్లెట్‌కు అనుకోని విధంగా సూర్య ఎదురు తిరుగుతాడు. బుల్లెట్ ఆధిపత్యాన్నే సవాల్ చేస్తాడు. అసలు సూర్య ఎందుకు ఎదురుతిరిగాడు? అమృతతో ప్రేమాయణం ఎలా సాగింది? బుల్లెట్ ఎలా రియాక్ట్ అయ్యాడు? సూర్య జీవితంలో అతని తల్లి ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
View this post on Instagram
Also Read : Hebah Patel : టాలీవుడ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - మోడ్రన్ డ్రెస్‌లో అందాల హెబ్బా పటేల్ క్యూట్ ఫోటో షూట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























