అన్వేషించండి

Bajaj Chetak C2501: కంపెనీ చెప్పింది 113 కి.మీ. రేంజ్‌.. నిజంగా వెళ్లింది ఎంత దూరం?

బజాజ్ చేతక్ C2501 ఫుల్ ఛార్జ్‌తో వాస్తవంగా దాదాపు 90 కి.మీ. ప్రయాణించింది. 2.5kWh బ్యాటరీతో 34.6km/kWh సామర్థ్యాన్ని నమోదు చేసింది.

Bajaj Chetak C2501 Real Range: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు ప్రధానంగా చూసే అంశం రేంజ్. కంపెనీ చెబుతున్న రేంజ్ కంటే, వాస్తవ వినియోగంలో ఎంత దూరం వెళ్తుందనేది చాలా ముఖ్యం. తాజాగా బజాజ్ చేతక్ C2501 అసలు రేంజ్‌పై నిర్వహించిన పరీక్షలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

చేతక్ C2501 ధర రూ.1.05 లక్షల ఎక్స్‌షోరూమ్‌. ఈ స్కూటర్‌లో 2.5kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ ప్రకటించిన IDC రేంజ్ 113 కి.మీ..

ఈ స్కూటర్‌లో ఎకో & స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వేగం కంటే మెరుగైన రేంజ్ కోసం వీటిని ఇచ్చారు. ఎకో మోడ్‌లో సూచించే గరిష్ఠ వేగం గంటకు 45 కి.మీ. వరకు ఉంటుంది. స్పోర్ట్ మోడ్‌లో ఇది గంటకు 60 కి.మీ. వరకు ఉంటుంది. ప్రయాణంలోనే D బటన్ ద్వారా మోడ్‌ను మార్చుకోవచ్చు.

ఎక్స్‌పర్ట్‌లు చేతక్ C2501 వాస్తవ రేంజ్‌ను తెలుసుకునేందుకు స్పోర్ట్ మోడ్‌లో పరీక్ష నిర్వహించారు. ఎకో మోడ్‌లో ఈ స్కూటర్ పనితీరు రద్దీగా ఉండే రోడ్లు, తరచుగా ఆగుతూ వెళ్లే ట్రాఫిక్‌కు అనుకూలంగా అనిపించడంతో, ఈ పరీక్షకు స్పోర్ట్ మోడ్‌ను ఎంచుకున్నారు.

స్కూటర్‌ బ్యాటరీని 100 శాతం ఛార్జ్‌ చేశాక పరీక్ష ప్రారంభించారు. ఆ సమయంలో రేంజ్ ఇండికేటర్‌ 112 కి.మీ. చూపించింది. నగరంలోని వివిధ రకాల రోడ్లపై స్కూటర్‌ను నడిపారు. ట్రాఫిక్, సాధారణ రహదారులు, ఆగుతూ వెళ్లే పరిస్థితులు వంటి వేర్వేరు పరిస్థితులను పరీక్షలో భాగంగా తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?

బ్యాటరీ వినియోగం వారీగా రేంజ్‌

బ్యాటరీ 80 శాతానికి చేరేసరికి 19 కి.మీ. ప్రయాణించింది. 60 శాతం వద్ద 36.1 కి.మీ. పూర్తయ్యాయి. 40 శాతం బ్యాటరీ మిగిలే సమయానికి 52.1 కి.మీ. ప్రయాణించింది. 20 శాతం వద్ద 69 కి.మీ. చేరుకుంది. 10 శాతం బ్యాటరీ వద్ద మొత్తం 76.5 కి.మీ. ప్రయాణించింది.

బ్యాటరీ 10 శాతానికి చేరిన తర్వాత స్కూటర్‌ను ఎకో మోడ్‌లోకి మార్చారు. 5 శాతం బ్యాటరీ మిగిలినప్పుడు స్కూటర్ లింప్ మోడ్‌లోకి వెళ్లింది. డ్యాష్‌బోర్డ్‌పై తాబేలు గుర్తు కనిపించింది. దీంతో వేగం గంటకు 35 కి.మీ.కు పరిమితమైంది.

చివరికి బ్యాటరీ సూచిక సున్నాకు చేరింది. రేంజ్ ఇండికేటర్‌ కూడా పూర్తిగా ఖాళీగా చూపించింది. అప్పటికి స్కూటర్ 84 కి.మీ. ప్రయాణించింది. అయినప్పటికీ వెంటనే ఆగిపోలేదు. మరో 2.5 కి.మీ. వరకు నడిచింది. చివరకు పనితీరు గణనీయంగా తగ్గిన సమయంలో పరీక్షను ముగించారు. మొత్తం 86.5 కి.మీ. ప్రయాణించింది.

అంటే కంపెనీ ప్రకటించిన 113 కి.మీ. IDC రేంజ్‌తో పోలిస్తే వాస్తవ పరీక్షలో 86.5 కి.మీ. రేంజ్ వచ్చింది. ఈ పరీక్ష మొత్తం స్పోర్ట్ మోడ్‌లోనే జరిగింది. ఎకో & స్పోర్ట్ మోడ్‌లను కలిపి ఉపయోగిస్తే రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!

అనువైన ఛార్జింగ్‌ టైమ్‌

చేతక్ C2501లో 750W ఛార్జర్‌ను అందించారు. పూర్తిగా ఖాళీ అయిన బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయడానికి 3 గంటల 18 నిమిషాలు పట్టింది. రోజువారీ వినియోగానికి ఇది ఉపయోగకరమైన ఛార్జింగ్ సమయంగా చెప్పొచ్చు.

పరీక్షలో చేతక్ C2501 ప్రతి కిలోవాట్‌అవర్‌కు 34.6 కి.మీ. సామర్థ్యాన్ని నమోదు చేసింది. ట్రాఫిక్‌లో సమానమైన వేగంతో ప్రయాణిస్తే ఈ స్కూటర్ మంచి రేంజ్ అందించే అవకాశం ఉంది. వేగంగా దూసుకెళ్లడం కంటే సాధారణ వేగంతో నడిపితే బ్యాటరీని మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చు.

మొత్తంగా చూస్తే, కంపెనీ చెప్పే IDC రేంజ్ 113 కి.మీ. అయినప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో 86.5 కి.మీ. వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని చేతక్ C2501 చూపించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపడే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Splendor Plus Price Hike: కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చిన హీరో కంపెనీ.. బైక్ ధరలు పెరిగాయి, అయినా నో టెన్షన్
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!
అతి పెద్ద విమానాన్ని లాక్కెళ్లిన BYD కారు.. అది కూడా కేవలం టైర్ల మీద!
Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget