Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
టయోటా చీపెస్ట్ కారు గ్లాంజా. రూ.6.73 లక్షల ప్రారంభ ధరతో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Toyota Glanza Price, Mileage And Features Telugu: నాణ్యత, నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాల్లో టయోటా ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే టయోటా కారు కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. అది పూర్తిగా నిజం కాదు. టయోటా అందించే గ్లాంజా మోడల్ చాలా తక్కువ బడ్జెట్లోనే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది.
టయోటా అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన అత్యంత చవకైన కారు గ్లాంజానే. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. చిన్న కుటుంబాలకు కూడా మంచి ఆప్షన్ అవుతుంది.
ధర
తెలుగు రాష్ట్రాల్లో టయోటా గ్లాంజా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.73 లక్షలు. వేరియంట్, గేర్‌బాక్స్, బీమా, రిజిస్ట్రేషన్, ప్రాంతాన్ని బట్టి ఆన్-రోడ్ ధర మారుతుంది. కొనుగోలుదారులు నెలవారీ వాయిదాల (EMI) ద్వారా కూడా ఈ కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
గ్లాంజాలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. వేరియంట్‌ను బట్టి మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది. చిన్న పరిమాణం కారణంగా నగర ట్రాఫిక్‌లో కారును సులభంగా నడపొచ్చు.
ఫీచర్లు
ఫీచర్ల విషయంలోనూ గ్లాంజా ఆకట్టుకుంటుంది. వేరియంట్‌ను బట్టి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, హెడ్-అప్ డిస్ప్లే, కనెక్టెడ్ టెక్నాలజీ, వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా కూడా లభిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: EV మార్కెట్లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
సేఫ్టీ
భద్రత విషయంలో టయోటా గ్లాంజాకు మంచి ప్యాకేజీ ఇచ్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా లభిస్తాయి. ABS, EBD, బ్రేక్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ముందు సీట్లకు సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్లు, పిల్లల సీట్ల కోసం ISOFIX మౌంట్స్ కూడా ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి మరిన్ని భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
టయోటా లైనప్‌లో గ్లాంజా తర్వాత అర్బన్ క్రూయిజర్ టైసర్, రూమియన్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లు ఉన్నాయి. టైసర్ ప్రారంభ ధర రూ.7.43 లక్షలు. రూమియన్ ధర రూ.9.79 లక్షల నుంచి మొదలవుతుంది. హైరైడర్ ప్రారంభ ధర రూ.11.31 లక్షలు.
అందువల్ల, తక్కువ బడ్జెట్లో టయోటా కారు కావాలనుకునేవారికి గ్లాంజా మంచి ఎంపికగా నిలుస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ ప్రయాణాలు, రోజువారీ పనులు, నగర ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. 5 సీట్ల సామర్థ్యం ఉండటంతో చిన్న కుటుంబాలకు కూడా సరిపోతుంది.
ఇది కూడా చదవండి: కొత్త గేర్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ సీట్ మసాజ్.. Skoda Slavia Faceliftలో ఇంకా ఏం మారిందంటే?
ఎక్కువ స్థలం లేదా 3 వరుసల సీట్లు కావాలనుకునేవారు రూమియన్‌ను పరిశీలించవచ్చు. SUV తరహా డిజైన్ కావాలనుకునేవారికి టైసర్ లేదా హైరైడర్ సరైన ఎంపిక కావచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















