అన్వేషించండి

Long Range Car: ఏకంగా 1770 కి.మీ. లాంగ్ రేంజ్‌తో మార్కెట్లోకి వస్తున్న SUV.. 3.95 సెకన్లలో 100 కి.మీ వేగం

1770 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్, కేవలం 3.95 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని అందుకునే కొత్త హైబ్రిడ్ SUV ఆటో మార్కెట్లోకి రాబోతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గీలీ గెలాక్సీ 700 హైబ్రిడ్ SUV 1770 కి.మీ. రేంజ్.
  • పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, 3.95 సెకన్లలో 100 వేగం.
  • ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, ఆల్-వీల్ డ్రైవ్, ADAS ఫీచర్లు ఉన్నాయి.

ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్‌లో లాంగ్ రేంజ్, హైబ్రిడ్ కార్లదే హవా. ఈ క్రమంలో మార్కెట్లోకి ఒక కొత్త SUV రాబోతోంది. ఈ వాహనం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చైనా ఆటో మార్కెట్లో ఒక కొత్త ఆఫ్-రోడ్ హైబ్రిడ్ SUV ఎంట్రీకి సిద్ధంగా ఉంది. విశ్లేషకులు దీనిని నడిచే పవర్‌హౌస్ అని పిలిచినా ఆశ్చర్యం అక్కర్లేదు. అయితే ఇతర దేశాల్లోనూ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

 ఈ వాహనం పేరు Geely Galaxy Battleship 700 Hybrid SUV. కాగా దీని అతిపెద్ద ప్రత్యేకత 1,770 కిలోమీటర్ల లాంగ్ ఓవరాల్ డ్రైవింగ్ రేంజ్. అంటే ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయడంతో పాటు ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత మీరు రీఫ్యూయలింగ్ లేదా ఛార్జింగ్ గురించి త్వరగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఈ కారు కేవలం 3.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఇంజిన్

ఈ కారు పేరు గీలీ గెలాక్సీ 700 హైబ్రిడ్ ఎస్‌యూవీ. గీలీ గెలాక్సీ తమ కొత్త SUV 'బ్యాటిల్‌‌షిప్ 700'లో భాగంగా ఈ శక్తివంతమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ అందించినట్లు తెలిసింది. ఇందులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ వస్తుంది. అందువల్ల వాహనానికి యాక్సిలరేషన్, భారీ టార్క్‌ను ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తుంది. అందుకే ఇంత పెద్ద మరియు బరువైన SUV అయినప్పటికీ, ఇది స్పోర్ట్స్ కారులా కొన్ని సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుని ఆశ్చర్యపరుస్తుంది.

 ఓవరాల్ రేంజ్ 1770 కి.మీ.

లాంగ్ జర్నీ చేసేవారికి ఈ కారు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇందులో పెద్ద బ్యాటరీతో పాటు పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. దాంతో మీరు ఫ్యూయల్, ఇటు బ్యాటరీ సాయంతో కలిసి  మొత్తం 1,770 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పై కూడా ఈ కారు రోజువారీ పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.దీనివల్ల పెట్రోల్ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.

Also Read: కొత్త లుక్‌తో వస్తున్న Honda Elevate Facelift.. లోపల, బయట కీలక మార్పులతో అక్టోబర్‌ 6న లాంచ్‌

ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ఆల్-వీల్ డ్రైవ్

గీలీ గెలాక్సీ SUV కేవలం ప్లెయిన్ హైవేలకే కాకుండా ఇతర రోడ్డు మార్గాల్లోనూ దూసుకెళ్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్,రకరకాల ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి. దీని హై గ్రౌండ్ క్లియరెన్స్, స్ట్రాంగ్ సస్పెన్షన్, ఆల్-టెర్రైన్ గ్రిప్ దీనికి బురద, ఇసుక, కొండలపై కూడా సులభంగా వెళ్లేలా చేస్తాయి. 

ఫ్యూచరిస్టిక్ లుక్, క్యాబిన్ టెక్నాలజీ

కారు లుక్ విషయానికి వస్తే చాలా మస్క్యులర్,  బోల్డ్‌గా కనిపిస్తుంది. SUV క్యాబిన్‌లో లేటెస్ట్ జనరేషన్‌కు చెందిన పెద్ద టచ్‌‌స్క్రీన్ డిస్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ కన్సోల్, ప్రీమియం లెదర్ సీట్లు ఇచ్చారు. సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో లెవెల్-2 ADAS ఫీచర్లు, 360 డిగ్రీ కెమెరా, పలు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈ కారు స్పీడ్, రేంజ్,  రఫ్ అండ్ టఫ్ పెర్ఫార్మెన్స్‌ల ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు.

Frequently Asked Questions

ఈ కొత్త హైబ్రిడ్ SUV పేరు ఏమిటి?

ఈ కొత్త SUV పేరు గీలీ గెలాక్సీ బ్యాటిల్‌షిప్ 700 హైబ్రిడ్ SUV. ఇది చైనా మార్కెట్లోకి వస్తున్న ఆఫ్-రోడ్ సామర్థ్యం కలిగిన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్.

గీలీ గెలాక్సీ బ్యాటిల్‌షిప్ 700 యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటి?

దీని అతిపెద్ద ప్రత్యేకత 1,770 కిలోమీటర్ల లాంగ్ ఓవరాల్ డ్రైవింగ్ రేంజ్. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసి, ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత సుదీర్ఘ దూరం రీఫ్యూయలింగ్ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు.

ఈ SUV 0 నుండి 100 కి.మీ వేగాన్ని ఎంత సమయంలో అందుకుంటుంది?

గీలీ గెలాక్సీ బ్యాటిల్‌షిప్ 700 కేవలం 3.95 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది భారీ SUV అయినప్పటికీ, స్పోర్ట్స్ కారు లాగా వేగంగా దూసుకుపోతుంది.

ఈ SUVకి ఆఫ్-రోడింగ్ సామర్థ్యం ఉందా?

అవును, దీనికి అడ్వాన్స్‌డ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, వివిధ ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇది బురద, ఇసుక, కొండలపై కూడా సులభంగా వెళ్ళగలదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2027 KTM 200 Dukeలో రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్ సహా కొత్త ఫీచర్లు.. మీరు తెలుసుకోవాల్సిన 7 విషయాలు
KTM 200 Duke మరోసారి అప్‌డేట్.. ఈసారి కొత్తగా వచ్చిన ఫీచర్లు ఏంటి?
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
125 యూనిట్లు.. 6 నిమిషాలు! రికార్డు స్థాయిలో అమ్ముడైన Royal Enfield Classic 650 Hypershift స్పెషల్ ఎడిషన్
కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పెషల్‌ బైక్‌.. ఏంటి ప్రత్యేకత?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
OTT Crime Thriller: రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
రెండు ఓటీటీల్లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్... మాఫియాలో మిడిల్ క్లాస్ కుర్రాడి ప్రేమకథ - మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
Skoda Kodiaq vs Volkswagen Tayron.. ఏ SUV ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఆసక్తికర ఫలితాలు
రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌: స్కోడా కొడియాక్‌, వోక్స్‌వ్యాగన్ టైరాన్‌లో ఏది బెస్ట్‌?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
సారా అలీ ఖాన్‌పై ఫత్వా, ఆమె ఇకపై కేదార్‌నాథ్ ఆలయంలో పూజ చేసుకోలేరా? భారత చట్టం ఏం చెబుతోంది?
Embed widget